OMRICON VIRUS : ఇది ఓ హెచ్చరిక - ఇతర వైరస్ కంటే వేగంగా విస్తరించే అవకాశం : డబ్ల్యూహెచ్ఓ డాక్టర్ సౌమ్య స్వామినా

ఇప్పుడు ప్రపంచ దేశాలను ఒణికిస్తున్న ఓమ్రికాన్ మన దేశంలో ఒక హెచ్చరిక లాంటిందని..దీని పైన మరింత అధ్యయనాలు అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ఇది మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇతర కోవిడ్ వేరియంట్లతో ఈ కొత్త వేరియంట్ లక్షణాలను..పోలికలను గుర్తించటానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని చెప్పారు. ఈ వేరియంట్ సమయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో స్పష్టం అవుతుందన్నారు.

అందరూ మాస్కులు ఉపయోగించటం కొనసాగించాలని సూచించారు. మాస్కులు ధరిస్తే జేబుల్లో వైరస్ నిరోధక టీకాలు జేబులో ఉంచుకున్నట్టేనని చెప్పుకొచ్చారు. సీనియర్ సిటిజన్స తప్పని సరిగా రెండు విడతల టీకాలు పూర్తి చేయటం...సామూహిక సమావేశాలను నివారించాల్సిన అవసరం ఉందని డాక్టర్ సౌమ్య స్వామినాథన్ స్పష్టం చేసారు. విస్తృత జీనోమ్ సీక్వెన్సింగ్ తో పాటుగా కేసుల్లో అసాధరణ పెరుగుదల ఉంటే జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, ఇప్పుడు వెలుగు లోకి వచ్చిన 'ఓమిక్రాన్' పైన మరింతగా శాస్త్రీయ అధ్యయనం అవసరమని పేర్కొన్నారు.

WHOs Dr Soumya Swaminathan says Omicron is potentially more contagious than previous variants

అయితే, ఈ వేరియంట్ గతంలో కనిపించిన డెల్టా కంటే వేగంగా ముందుకు వెళ్తుందని...ఇదే సమయంలో అధికారికంగా మాత్రం దీని పైన క్లారిటీ ఇవ్వలేమన్నారు. ఈ స్ట్రెయిన్ గురించి త్వరలోనే మరిన్ని విషయాలు శాస్త్రీయంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. 'ఓమిక్రాన్' ను ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన కలిగించే రూపాంతరంగా పేర్కొందని డాక్టర్ సౌమ్య స్వామినాథన్ చెప్పారు. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన వేరియంట్స్ కంటే ఇది మరింత వేగంగా ఇతరులకు విస్తరించే అవకాశం ఉందన్నారు.

అదే విధంగా ఇతర వేరియంట్ల కంటే ఇది ఆందోళన కలిగించే స్థాయి కలిగించేదా కాదా అనేది తేలాల్సి ఉందని చెప్పారు. ఈ వేరియంట్ లక్షణాలు..తీవ్రత గుర్తించటానికి మరిన్ని అధ్యయనాలు అసవరం అవుతాయని వివరిస్తూ...ఇతర వేరింయట్లతో పోలిక గురించి వివరించారు. అయితే, 'ఓమిక్రాన్' గుర్తింపు దశతోనే ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఇది మార్కెట్ పైన ప్రభావం చూపుతోంది. అనేక దేశాల్లో రాకపోకల పైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక, ఈ వేరియంట్ రెండేళ్లుగా కుదించుకుపోయిన ఆర్దిక వ్యవస్థ పైన ఇంకా ఏ రంగా ప్రభావం చూపుతోందనే అందోళన వ్యక్తం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+