''ఆ విద్యార్థిని మనసును ఎవరు కలుషితం చేస్తున్నారు''? ''నాది ఢిల్లీ యూనివర్శిటీయే''

కార్గిల్ యుద్దంలో మరణించిన కెప్టెన్ మణిదీప్ సింగ్ కుమార్తై గుర్మీర్ కౌర్ సోషల్ మీడియాలో ఎబివిపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి కిరణ్ రిజూజు స్పందించారు.

న్యూఢిల్లీ:కార్గిల్ యుద్దంలో మరణించిన కెప్టెన్ మణిదీప్ సింగ్ కుమార్తె గుర్మీర్ కౌర్ సోషల్ మీడియాలో ఎబివిపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.అయితే ఈ ప్రచారంపై కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిరణ్ రిజుజు స్పందించారు. ఆ బాలిక మనసును ఎవరు కలుషితం చేస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు.

పాకిస్తాన్ తన తండ్రిని చంపలేదు, కార్గిల్ యుద్దమే తన తండ్రిని చంపాడని ఆమె ప్లకార్డును ప్రదర్శించిన ఫోటోను పోస్టు చేస్తూ ఎబివిపికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారాన్ని ప్రారంభించింది.

ఢిల్లీలోని రాంజాస్ కాలేజీలో ఎబివిపి కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ తాను డిల్లీయూనిర్శిటీ విధ్యార్థిననని, తాను ఎబివిపి భయపడడనని ఆమె సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలను పోస్ట్ చేసింది.

ఎబివిపిని విమర్శించినందుకుగాను తనపై అత్యాచారం చేస్తారని బెదిరించారని కూడ ఆమె ఆరోపణలు చేసింది.ఈ విషయాలన్నింటిని ఆమె సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసింది.

దీంతో ఈ విషయమై కేంద్ర హోంశాఖ సహయ శాఖ మంత్రి కిరణ్ రిజూజు స్పందించారు. ఆ అమ్మాయి మనసును ఎవరో కలుషితం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.ఈ మేరకు మంత్రి కూడ సోషల్ మీడియా వేదికగానే ఈ వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా మంత్రి తన అభిప్రాయాలను పంచుకొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+