లవ్ జీహాద్ అంటే తలలు నరికేయండి, రక్తాభిషేకం చెయ్యాలి, సాధ్వీ సరస్వతి!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: లవ్ జీహాద్ పేరుతో హిందూ యువతులను మోసం చెయ్యడానికి ప్రయత్నించే యువకుల తలలు నరికి భరతమాతకు రక్తాభిషేకం చెయ్యాలని సాధ్వీ సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే హిందూ యువతుల చేతికి తల్వార్ (యుధ్దం చేసే ఖడ్గం) ఇవ్వాలని సాధ్వీ సరస్వతి పిలుపునిచ్చారు.

శక్తి, భక్తి కార్యక్రమం

శక్తి, భక్తి కార్యక్రమం

కర్ణాటకలోని బెళగావిలోని సంభాజీ మైదానంలో శ్రీరామ సేన ఆధ్వర్యంలో శక్తి, భక్తి అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సాధ్వీ సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొంత మంది కారణంగా హిందూ అమ్మాయిలు మోసపోతున్నారని సాధ్వీ సరస్వతి విచారం వ్యక్తం చేశారు.

అమ్మాయిల కట్టడి!

అమ్మాయిల కట్టడి!

సోదరులారా హిందూ అమ్మాయిలను బయటకు పంపించకుండా కట్టడి చెయ్యడానికి ప్రయత్నించరాదని సాధ్వీ సరస్వతి సూచించారు. అయితే తమ సోదరీమణులను బయటకు పంపించే సమయంలో సోదరులు వారి చేతికి ఒక్క ఖడ్గం ఇచ్చి పంపించాలని సూచించారు.

తల ఎత్తి చూస్తే!

తల ఎత్తి చూస్తే!

హిందూ అమ్మాయిలను వలలో వేసుకోవడానికి ప్రయత్నించే యువకులు తల ఎత్తి చూస్తే వారి తలలు అక్కడే తెగిపడాలని సాధ్వీ సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లవ్ జీహాద్ అంటూ వెంటపడే యువకుల తలలు నరకడానికి హిందూ అమ్మాయిలు సిద్దంగా ఉండాలని సాధ్వీ సరస్వతి పిలుపు నిచ్చారు.

 భరతమాతకు రక్తాభిషేకం

భరతమాతకు రక్తాభిషేకం

లవ్ జీహాద్ పేరుతో హిందూ అమ్మాయిల జీవితాలు నాశనం చెయ్యడానికి ప్రయత్నించే యువకుల తలలు ఖడ్గంతో నరికి భరతమాతకు రక్తాభిషేకం చెయ్యాలని సాధ్వీ సరస్వతి పిలుపునిచ్చారు. అప్పుడే లవ్ జీహాద్ కు స్వస్తి చెప్పడానికి అవకాశం ఉంటుందని స్వాధీ సరస్వతి అన్నారు.

సాధ్వీ సరస్వతి

సాధ్వీ సరస్వతి

శ్రీరామ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన శక్తి, భక్తి కార్యక్రమంలో బహిరంగంగా తలలు నరకాలని సాధ్వీ సరస్వతి పిలుపునివ్వడంతో ఇప్పుడు పెద్ద వివాదానానికి దారి తీసింది. శాంతికి భంగం కలిగించేలా సాధ్వీ సరస్వతి మాట్లాడారని ఓ వర్గం ఆరోపిస్తోంది. అయితే లవ్ జీహాద్ పేరుతో కొందరు రెచ్చిపోతున్నారని, సాధ్వీ సరస్వతి ఆవేదన చెందారని, ఆమె మాటల్లో ఎలాంటి తప్పు లేదని హిందూ సంఘ, సంస్థలు అంటున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hindu girls should carry sword, who try to love jihad must be beheaded, said Sadhvi Saraswati in Belagavi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి