యుజ్వేంద్ర చాహల్‌ను 15వ అంతస్తు నుంచి వేలాడదీసిన ఆ క్రికెటర్ ఎవరు
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌కు 9 ఏళ్ల క్రితం ఎదురైన చేదు అనుభవంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టులోని తోటి ఆటగాడు రవిచంద్ర అశ్విన్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాహల్ ఈ విషయం గురించి మాట్లాడాడు.
''ఆ ఘటన 2013లో జరిగింది. ఒక సీనియర్ క్రికెటర్ మద్యం మత్తులో నన్ను 15వ అంతస్తు నుంచి వేలాడదీశాడు’’ అని చాహల్ చెప్పాడు.
''ఈ విషయం గురించి నేను ఎవరితోనూ ఎప్పుడూ చెప్పలేదు. చాలా కొద్ది మందికి మాత్రమే దీని గురించి తెలుసు. ఇప్పుడు దాని గురించి నీతో చెబుతున్నాను.’’
- రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో టీమిండియా దూకుడు తగ్గుతుందా? పెరుగుతుందా?
- కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మే బెటరా? ఈ పోలిక ఎందుకు?
ముంబయి ఇండియన్స్‌కు ఆడుతున్నప్పుడు..
''అది 2013. నేను ముంబయి ఇండియన్స్ జట్టు కోసం ఆడుతున్నాను. బెంగళూరులో ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ తర్వాత పార్టీ చేసుకుంటున్నాం. అక్కడ ఒక ప్లేయర్ బాగా తాగి ఉన్నాడు. అతడి పేరు చెప్పాలని అనుకోవడం లేదు’’అని చాహల్ వివరించాడు.
''యూవీ ఇలా రా అని పిలిచాడు. అతడు చాలా సేపు నన్ను గమనించాడు. 15వ అంతస్తులోని బాల్కనీ బయట నన్ను అతడు గాలిలో వేలాడదీశాడు. నా చేతులతో అతడిని గట్టిగా పట్టుకున్నాను. ఒకవేళ పట్టు సడలితే, నేను పడిపోయేవాణ్ని.’’
''అక్కడ చాలా మంది ఉన్నారు. వారు వెంటనే స్పందించడంతో నేను తప్పించుకోగలిగాను. కాసేపు నాకు స్పృహ తప్పినంత పనైంది. నా జీవితంలో తృటిలో ప్రాణాలతో బయటపడిన ఘటన అది. చిన్న తేడా వచ్చినా, నేను కింద పడిపోయేవాణ్ని’’అని యుజ్వేంద్ర చెప్పాడు.
''బయటకు వెళ్లినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అప్పడు నాకు బాగా అర్థమైంది’’అని యుజ్వేంద్ర వివరించాడు.
- షేన్ వార్న్: 'బాల్ ఆఫ్ ది సెంచరీ' కథ ఇదీ..
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు, ఎందుకు, ఎలా మొదలైంది?

''ఆయనెవరో చెప్పండి’’
ఈ ఇంటర్వ్యూ వీడియోను రాజస్థాన్ రాయల్స్ ట్విటర్‌లో షేర్ చేసింది.
దీంతో చాహల్‌ను ఇలా భయానకంగా గాల్లో వేలాడదీసిన ఆటగాడు ఎవరో చెప్పాలంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.
https://twitter.com/rajasthanroyals/status/1512036191226720260
''ఈ ఘటనకు సంబంధించి ముంబయి ఇండియన్స్ చర్యలు తీసుకోకపోతే ఇకపై నేను ఆ జట్టు అభిమానినని చెప్పుకోను’’అని ఓ ట్విటర్ వినియోగదారుడు ట్వీట్ చేశారు.
https://twitter.com/Dhinchak_Chooja/status/1512350437944401925
''చాహల్‌కు ఇలా జరగడం దురదృష్టకరం. మీరు చెత్త స్టోరీలను సంచలన వార్తలుగా ప్రచారం చేస్తుంటారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి. పరిస్థితులు ఎలా ఉన్నాయో గుర్తించండి’’అని మరో యూజర్ ట్వీట్ చేశారు. ఆమె బీసీసీఐను ట్యాగ్ చేశారు.
https://twitter.com/dpkasagar/status/1512164309173895171
''ఆ ఆటగాడు ఎవరో చెప్పు చాహల్. దానికి సాక్ష్యాలు కూడా బయటపెట్టు. నిజం తెలియాలి’’అని మరో యూజర్ ట్వీట్ చేశారు.
https://twitter.com/KrishK74/status/1512124944833863682
''చాహల్ చెప్పేది వింటుంటే భయం వేస్తోంది. దీనిపై ముంబయి ఇండియన్స్ ఏం చర్యలు తీసుకుందో చెప్పాలి’’అని మరో ట్విటర్ యూజర్ వ్యాఖ్యానించారు.
https://twitter.com/Aaaaaaftab/status/1512089131093880841
- విరాట్ కోహ్లి: టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌కు ఈ తరహా వీడ్కోలు ఏంటి? దాని వెనక కారణమేంటి
- 'మై లవ్, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్
''తెలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు’’
మరోవైపు చాహల్‌ను అలా వేలాడదీసిన ఆ ప్లేయర్ ఎవరో తెలియాల్సిన అవసరముందని భారత మాజీ క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కూడా వ్యాఖ్యానించినట్లు హిందుస్తాన్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది.
''మద్యం మత్తులో చాహల్‌ను అలా వేలాడదీసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ ఘటన నిజమైతే, దాన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. అసలు ఏం జరిగిందో, ఏం చర్యలు తీసుకున్నారో తెలియాల్సిన అసరముంది’’అని సెహ్వాగ్ వ్యాఖ్యానించినట్లు ఆ వార్తలో రాశారు.
ముంబయి ఇండియన్స్ టీమ్‌తోనే చాహల్ తన ఐపీఎల్ కెరియర్‌ను మొదలుపెట్టాడు. అయితే, మొదటి మూడు సీజన్లలో కేవలం ఒక మ్యాచ్‌లోనే అతడికి ఆడే అవకాశం వచ్చింది.
ఆ తర్వాత 2014లో రాయల్ చాలెంజర్స్ అతణ్ని తమ జట్టులోకి తీసుకుంది.
ఇవి కూడా చదవండి:
- నవరాత్రి వేడుకల సమయంలో మాంసం షాపులను ఎందుకు మూయించేస్తున్నారు? అసలు మాంసం తినని వారు ఎంత మంది?
- షాంఘై లాక్డౌన్: ఆహారం దొరకడం లేదంటున్న కొందరు స్థానికులు
- ఇమ్రాన్ ఖాన్ భార్య ఫ్రెండ్ ఫరాఖాన్ ఎవరు, పాకిస్తాన్లో ఈమె పేరు ఎందుకు మారుమోగుతోంది?
- పుతిన్‌కు ఎంతమంది పిల్లలు.. వాళ్లు ఎక్కడున్నారు.. ఏంచేస్తుంటారు?
- యుక్రెయిన్: 'రష్యా సైనికులు మా నాన్న గుండె మీద కాల్చారు.. నా కళ్లెదుటే చంపేశారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications