మోడీపై శత్రుఘ్నుసిన్హా సంచలనం: గుజరాత్‌లో గెలిస్తే క్రెడిట్ మీదే, ఓడిపోతే.....

గాంధీనగర్: గుజరాత్ ఎన్నికలను పురస్కరించుకొని ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై బిజెపి ఎంపీ, సినీ నటుడు శత్రఘ్నసిన్హా మరోసారి పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

గుజరాత్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తే ఆ క్రెడిట్ అంతా మోడీకే దక్కుతోందని శత్రుఘ్నుసిన్హా అభిప్రాయపడ్డారు. అయితే ఒకవేళ గుజరాత్ రాష్ట్రంలో బిజెపి ఓటమి పాలైతే ఆ బాధ్యతను ఎవరు తీసుకొంటారని శత్రుఘ్నుసిన్హా ప్రశ్నించారు.

Who Will Take The Rap If BJP Loses In Gujarat, Shatrughan Sinha Asks PM

ఈ మేరకు బుదవారం నాడు ట్విట్టర్ వేదికగా శత్రుఘ్నుసిన్హా మోడీపై ప్రశ్నలు కురిపించారు. అయితే గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని విశ్వాసాన్ని శత్రుఘ్నుసిన్హా వ్యక్తం చేశారు. అయితే శత్రుఘ్నుసిన్హా పలు మార్లు బిజెపిపై ఆరోపణలు గుప్పించారు.

గుజరాత్ ఎన్నికల ప్రచార టీమ్‌లో శత్రుఘ్ను సిన్హాకు పార్టీ చోటు కల్పించలేదు. గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను మోడీ సహ పలువురు మంత్రులు, పార్టీ కీలక నేతలు ప్రచారం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రచారాన్ని ముగించుకొని ఢిల్లీకి చేరుకొన్నారన్నారు.

గుజరాత్ ఎన్నికల్లో మోడీ, అమిత్‌షాలు విస్తృతంగా పర్యటించారు.రెండో విడత ఎన్నికల ప్రచారం సాగడానికి కొద్డిగంటల్లోనే శత్రుఘ్నుసిన్హా సోషల్ మీడియా వేదికగా లేవనెత్తిన ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+