అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ జామ్ నగర్ లోనే ఎందుకు?
భారతదేశపు అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడుగా గుర్తింపు పొందిన ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం జులై నెలలో జరగనుంది. మార్చి 1వ తేదీ నుండి పెళ్లికి ముందు, ప్రీ వెడ్డింగ్ వేడుక జరపాలని నిర్ణయించారు ముకేశ్ అంబానీ దంపతులు. ఈ వేడుకకు భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాల నుండి పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు.
ఈ ప్రీ వెడ్డింగ్ వేడుక గుజరాత్ లోని జామ్ నగర్ లో నిర్వహించడానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లో ప్రీ వెడ్డింగ్ వేడుక గుజరాత్ లోని జామ్ నగర్ లో జరపడానికి గల కారణాలు ఏమిటి? ఈ వేడుకను అక్కడే నిర్వహించాలి అని ముఖేష్ అంబానీ దంపతులు భావించటం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరు చర్చిస్తున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ జామ్ నగర్ ను ప్రీ వెడ్డింగ్ వేడుకను నిర్వహించుకోవడానికి, వేదికగా ఎంచుకోవడం వెనుక కారణాలను వెల్లడించారు. తన అమ్మమ్మది జామ్ నగర్ అని, తన అమ్మ ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారని, ఇటుక ఇటుక పేర్చి అందంగా తయారు చేసారని పేర్కొన్నారు.
తాను తన చిన్నప్పుడు ఇక్కడ చాలా సమయం గడిపాను అని తెలిపిన అనంత్ అంబానీ తాను ఉండేది ముంబై అయినప్పటికీ, తన మనసంతా జామ్ నగర్ లోనే ఉంటుందని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు, అమ్మమ్మ కూడా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను జామ్ నగర్ లో జరుపుకోవాలని సూచించారని ఆయన తెలిపారు.
జామ్ నగర్ లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుపుకోవడం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని, చిన్నప్పుడు కలిసి తిరిగిన స్నేహితులు, బంధువులతో కలిసి ఇప్పుడు వేడుకలు జరుపుకోబోతున్నామని అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లొకేషన్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.












Click it and Unblock the Notifications