శశికళ వద్దకు విజిటర్స్ తగ్గటం వెనుక..? సీఎంకు 'చిన్నమ్మ' చిక్కు
అక్రమాస్తుల కేసులో అరెస్టై బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న శశికళ వద్దకు విజిటర్స్ క్రమంగా తగ్గుతున్నారు. గత వారం తమిళనాడుకు చెందిన ఎంపీని, మంత్రిని జైలు అధికారులు వెనక్కి తిప్పి పంపించారు.
చెన్నై/బెంగళూరు: అక్రమాస్తుల కేసులో అరెస్టై బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న శశికళ వద్దకు విజిటర్స్ క్రమంగా తగ్గుతున్నారు. గత వారం తమిళనాడుకు చెందిన ఎంపీని, మంత్రిని జైలు అధికారులు వెనక్కి తిప్పి పంపించారు.
శశికళను కలిసేందుకు ఎక్కువ మంది వస్తుండటంతో జైలు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కువ మందిని కలవనీయడం లేదు. ముఖ్య నేతలను కూడా వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. నిబంధనల మేరకు శశికళను కలిసేందుకు వచ్చే వారిని అనుమతిస్తున్నట్లు చెబుతున్నారు.

కర్నాటక జైలు రూల్స్ ఏం చెబుతున్నాయంటే..
చాప్టర్ 31, కర్నాటక జైలు నిబంధనల ప్రకారం నేరస్తుడిని కలుసుకునేందుకు ఓ విజిటర్ పదిహేను రోజులకు ఒకసారి రావొచ్చు. ఇది కొత్తగా జైలుకు వచ్చిన వారికి కాస్త ఇబ్బంది. కొత్తగా జైలుకు వచ్చిన ఖైదీలకు ప్రారంభంలో జైలు అధికారులు తమ విచక్షణ మేరకు కొంత వెసులుబాటు కల్పిస్తారు.

క్రమంగా తగ్గింపు
ఆ తర్వత క్రమంగా నేరస్తుడిని కలుసుకునేందుకు జైలు అధికారులు క్రమంగా విజిటర్స్‌ను తగ్గిస్తుంటారు. శశికళ వచ్చి నెలలు అవుతోంది. ఆమెకు కొత్తలో కొంత వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత ఆమె సర్దుకున్నారని భావించిన తర్వాత విజిటర్స్‌ను తగ్గిస్తూ వెళ్తున్నారు.

పళనిస్వామి, మంత్రులపై వేటు వేయాలని.. పార్టీ కార్యకర్తనే..
అక్రమాస్తుల కేసులో ముద్దాయిగా తేలి బెంగుళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళతో మిలాఖత్ నిర్వహించిన నలుగురు మంత్రులతో పాటు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌లో ఒక పిటీషన్ దాఖలైంది.
ఈ పిటీషన్‌ను విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన అన్నాడీఎంకే కార్యకర్త అన్బళగన్ దాఖలు చేయడం గమనార్హం. ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, పూర్తి విచారణను ఈ నెల 28వ తేదీన చేపట్టనున్నట్టు తెలిపింది.

శశికళను కలిసి..
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ నియమితులయ్యారు. ఆ తర్వాత జయ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు శశికళతో పాటు ఇళవరసి, సుధాకరన్‌లను దోషులుగా ప్రకటించింది. దీంతో వారంతా బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రులుగా పని చేస్తున్న మంత్రులు పలువురు.. శశికళ ఆదేశాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి ఎడప్పాడి సర్కారు పని చేస్తుందని ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రులుగా ఉన్న కేఏ సెంగోట్టయ్యన్, సెల్లూరు కె రాజు, దిండిగల్ శ్రీనివాసన్, కామరాజ్‌లు బంగళూరు వెళ్ళి... శశికళను కలిశారు.

రాజ్యాంగ వ్యతిరేకం
తమ మిలాఖత్ సమయంలో ప్రభుత్వ పనితీరుపై చర్చించినట్టు వారు వెల్లడించారు. దీన్ని ముఖ్యమంత్రి లేదా ఏ మంత్రీ ఖండించలేదు. ఇలా వ్యవహరించడం భారత రాజ్యాంగ శాసనం 188కి వ్యతిరేకం. ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో చేసిన రహస్య ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. శశికళ దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్థారించిన ఒక నేరస్థురాలు.

అందుకే.. పిటిషన్‌దారుకు కోర్టు ప్రశ్నలు
జైలు జీవితం గడుపుతున్న శశికతో సమావేశమై పాలనాపరమైన విషయాలు చర్చించినందుకు గాను నలుగురు మంత్రులతో పాటు, ముఖ్యమంత్రిని అనర్హులుగా ప్రకటించాలని అన్నాడీఎంకే కార్యకర్త అన్బళగన్ దాఖలు చేసిన పిటీషన్‌లో కోరారు.
దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు పిటీషన్‌దారునికి కొన్ని ప్రశ్నలు సంధించింది. గవర్నర్‌ను కోర్టు ఆదేశించే అధికారం ఉందా? ఇదే విషయంపై వచ్చిన ఫిర్యాదుపై గతంలో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ ఈ నెల 28వ తేదీలోపు మరో పిటీషన్ దాఖలు చేయాలని మదురై బెంచ్ ఆదేశించింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications