జార్ఖండ్ యువకుడి దాడిని.. రాష్ట్ర్రానికి ఎందుకు ఆపాదిస్తున్నారు...? మోడీ

ఇటివల జార్ఖండ్‌ని ఓ యువకుడిపై దాడి చేసిన ఘటనపై ప్రధాని మోడీ రాజ్యసభలో స్పందించారు..యువకుడిపై దాడిని తీవ్రంగా ఖండించిన మోడీ జార్ఘండ్‌లో దాడి జరిగితే దాన్ని మొత్తం రాష్ట్ర్రానికి వర్తింప చేయడం సమంజం కాదని మోడీ అన్నారు. ఈనేపథ్యంలోనే రాష్ట్ర్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కరెక్టు కాదని చెప్పారు.కాగా నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టమని స్పష్టం చేశారు.

Recommended Video

    కాళేశ్వరం ప్రారంభోత్సవానికి మోడీని ఆహ్వానించారా ? - లక్ష్మణ్
     నేరాలు చేసే వారిని వదిలి పెట్టం..మోడీ

    నేరాలు చేసే వారిని వదిలి పెట్టం..మోడీ

    కాగా దేశంలో నేరస్థులను శిక్షించేందుకు చట్టాలు ఉన్నాయని అది బెంగాల్ అయినా ,బీహార్ అయినా జార్ఘండ్ అయినా నేరస్థులు తప్పించుకోలేరని అన్నారు. ఈ నేపథ్యంలోనే నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు..అయితే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం కరెక్ట్ కాదని అన్నారు. ఇక విషయంపై కఠిన చర్యలు చేపడతామని అన్నారు. సంఘటన వెనక ఎవరు ఉన్నా వదిలిపెట్టమని తెలిపారు. ఈనేపథ్యంలోనే దేశంలో ప్రతి ఒక్కరి అభివృద్దికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని పేర్కోన్నారు.ఇందు కోసం అన్ని రాష్ట్ర్రాలు కలిసి కట్టుగా పోరాడాలని ఆయన పిలుపినిచ్చారు.

    జార్ఖండ్ యువకున్ని జై శ్రీరాం అంటూ కొట్టి చంపిన గ్రామస్థులు

    జార్ఖండ్ యువకున్ని జై శ్రీరాం అంటూ కొట్టి చంపిన గ్రామస్థులు

    గత బుధవారం జార్ఘండ్‌లోని ఖారస్వాన్ జిల్లా దట్కిద్ గ్రామానికి చెందిన అన్సారీ అనే వ్యక్తిని దొంగతనం కేసులో అనుమానిస్తూ అన్సారీని స్థంబానికి తాళ్లతో కట్టేసి కట్టేలతో చావబాదారు..అయితే అన్సారీని కొడుతున్న సమయంలో ఓ వ్యక్తి జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ నినాదాలు చేశాడు..అనంతరం పోలీసులు వచ్చి అన్సారీని విడిపించి ఆసుపత్రికి తరలించారు..తీవ్రగాయాలైన అన్సారీ గత శనివారం మృతి చెందాడు..దీంతో ఇది రాష్ట్ర్రవ్యాప్తంగా సంచలనం అయింది..ఇ

    దాడిపై ప్రశ్నించిన రాహుల్ గాంధీ

    దాడిపై ప్రశ్నించిన రాహుల్ గాంధీ

    ఇక ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రస్తావించారు.జార్ఖండ్‌తోపాటు కేంద్రంలో కూడ బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. మరి ఇలాంటి మానవత్వం లేని ఘటన లేంటని ప్రశ్నించారు. పౌరుల వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించడమే మీ ఉద్దేశం అని ప్రశ్నించారు. దీంతో మోడీ కౌంటర్ అటాక్‌కు దిగారు..ఒక ప్రాంతంలో జరిగిన సంఘటనను రాష్ట్ర్ర వ్యాప్తం చేయడం ఏంటనీ ప్రశ్నించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+