దీప్కే అరెస్టు కోసం మహిళా పోలీసులు ఎందుకొచ్చారు... దీని వెనుకున్న వ్యూహం ఏంటి?
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టేందుకు ఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టి కాక్రోచ్ జనతా పార్టీ నాయకులను అదుపులోకి తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు మహిళా పోలీసు అధికారులను రంగంలోకి దించడం చర్చనీయాంశమైంది. శనివారం ఎయిరిండియా విమానం ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో దిగగానే పోలీసులు నేరుగా విమానంలోకి ప్రవేశించి సీజేపీ నాయకులు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలతో పాటు పలువురుని నిర్బంధంలోకి తీసుకున్నారు.
విమానం లోపలికి మహిళా పోలీసులను పంపడం వెనుక ఢిల్లీ పోలీసుల వ్యూహాత్మక ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. విమానంలో సీట్లు, మార్గాలు చాలా ఇరుకుగా ఉంటాయి. అటువంటి ప్రదేశంలో పురుష పోలీసులను పంపితే తోపులాటలు లేదా ఘర్షణలు జరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంటుంది. మహిళా అధికారులను రంగంలోకి దించడం ద్వారా ఈ ముప్పును నివారించవచ్చని పోలీసులు భావించారు.

అంతే కాకుండా జులై 20న జరిగిన విద్యార్థుల నిరసనలో పురుష పోలీసులు మహిళా నిరసనకారులపై దాడి చేశారని కాక్రోచ్ జనతా పార్టీ గతంలో ఆరోపణలు చేసింది. సీజేపీకి మద్దతుగా ఉన్న యువత, మహిళల దృష్టిలో పోలీసుల ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకు.. అలాగే సోషల్ మీడియాలో కథనాలు రాకుండా అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ఈ వ్యూహాన్ని అనుసరించినట్లు సమాచారం.
విమానంలోకి పోలీసులు ప్రవేశించగానే అభిజీత్ దీప్కే వీడియో తీస్తూ ప్రభుత్వ చర్యలను నియంతృత్వం అని మండిపడ్డారు. ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతాకీ జై అని నినాదాలు చేశారు. మహిళా అధికారులు ఎంతో సమన్వయంతో వారి శాంతపరిచి సజావుగా విమానం నుంచి కిందకు దించి వేర్వేరు ప్రాంతాలకు తరలించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ సీజేపీ ఈ నిరసనకు పిలుపునిచ్చింది. అయితే ముందస్తు జాగ్రత్త చర్యగా యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, సీజేపీ లీగల్ సెల్ హెడ్ రత్నా సింగ్‌లతో సహా ఢిల్లీ వ్యాప్తంగా దాదాపు 400 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Delhi - The Cockroach Janata Party (CJP) has claimed that three of its leaders, Abhijeet Dipke, Sourav Das and Ashutosh Ranka, were taken into custody shortly after arriving in Delhi by air. According to the party, the three leaders were detained after disembarking from their flight ahead of a protest scheduled to take place in the national capital today.
— NextMinute News (@nextminutenews7) October 10, 2026
దేశ రాజధాని ఢిల్లీని పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి తీసుకువచ్చారు. 45 మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసివేయగా.. 250కి పైగా రైళ్లను రద్దు చేశారు. రాజధాని వ్యాప్తంగా 23,000 మందికి పైగా పారామిలిటరీ బలగాలను మోహరించి, ముందస్తు నిర్బంధాల ద్వారా ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.













Click it and Unblock the Notifications
