అందుకే!.. రాజ్‌థాక్రే భార్యను కుక్క కరిచింది
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే భార్య శర్మిలను వారి పెంపుడు ‘బాండ్' కరవడానికి ఓ కారణం ఉందట. అదేంటంటే.. శర్మల ఆ కుక్క తోకను తొక్కడమే. చూసుకోకుండా చేసిన చిన్న తప్పుకు ఆమె తీవ్ర గాయాలపాలు కావాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఇంట్లో పడుకొని ఉన్న పెంపుడు కుక్క 'బాండ్'పై, అటుగా వెళ్తున్న శర్మిల పొరపాటున కాలు వేసిందట. దీంతో ఆగ్రహంతో ఒక్కసారిగా ఆ కుక్క ఆమె ముఖంపై దాడి చేసింది. పొడవుగా, బలంగా ఉన్న ఆ కుక్క ఒక్కసారిగా లేవడంతో ఆమె ముఖం దానికి చిక్కింది.

దాని పళ్లు పదునుగా ఉండటం, దవడ ఎముకల వరకూ పళ్లు దిగడంతో శర్మిలకు 65 కుట్లు వేయాల్సి వచ్చింది. ఆమె ప్రస్తుతం దేశంలో పేరున్న ప్లాస్టిక్ సర్జన్ అనిల్ తిబరేవాలా పర్యవేక్షణలో ఉన్నారు.
కుక్క కాట్లు కనిపించకుండా చూసేందుకు ఆమెకు ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ కూడా చేశారు. కాగా, రాజ్ థాకరే ఇంట్లో ఉన్న మూడు 'గ్రేట్ డేన్' జాతికి చెందిన శునకాలు జేమ్స్, బాండ్, షాన్‌లను ఫాంహౌస్‌కు పంపినట్టు తెలిసింది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications