వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేరా బాబా: పోర్న్ చిత్రాలు చూస్తూ సెక్స్, కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలే

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

డేరా బాబా: పోర్న్ చిత్రాలు చూస్తూ సెక్స్, డేరాల నిండా కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలే!

సిర్సా: బాబా ముసుగులో డేరా బాబా అనేక అకృత్యాలకు పాల్పడ్డాడు.ఆశ్రమంలోనే రామ్‌రహీమ్ బాబా తనకు నచ్చిన మహిళలతో శృంగార కార్యకలాపాల్లో మునిగితేలేవాడు.బాబాకు అందుబాటులో 200 మంది అందమైన అమ్మాయిలు ఉండేవారని ప్రచారంలో ఉంది. తన బెడ్‌రూమ్‌ను బాబా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకొన్నాడని అధికారులు గుర్తించారు.ఆశ్రమంలో ఉన్నంత కాలం డేరా బాబా అత్యంత విలాస జీవితాన్ని గడిపారు.

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో డేరా బాబాపై కోర్టు 20 ఏళ్ళ పాటు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో బాబా ప్రస్తుతం జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే తన మాయమాటలతో బాబా పలువురిని మోసం చేశారని దర్యాప్తు అధికారులు గుర్తించారు.

డేరా బాబా: సిర్సాలో గుట్టలుగా అస్థిపంజరాలు, రూ.200 కోట్ల నష్టం డేరా బాబా: సిర్సాలో గుట్టలుగా అస్థిపంజరాలు, రూ.200 కోట్ల నష్టం

ఆశ్రమంలో బాబా బెడ్‌రూమ్ చూస్తే కళ్ళు తిరుగుతాయని దర్యాప్తు అధికారులు అభిప్రాయపడుతున్నారు. డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ బెడ్ రూమ్.. రూ. 10 లక్షల విలువైన బెడ్ ఏర్పాటు చేసుకొన్నారు బాబా.

డేరా బాబా: అరెస్టు తర్వాత అల్లర్లకు రూ.5 కోట్లు, ఆ ఇద్దరే కీలకం? డేరా బాబా: అరెస్టు తర్వాత అల్లర్లకు రూ.5 కోట్లు, ఆ ఇద్దరే కీలకం?

ఈ బెడ్‌పై పడుకొని తనకు నచ్చిన అమ్మాయితో సెక్స్ సుఖాన్ని బాబా అనుభవించేవారని విచారణలో తేలింది. తాను కృష్ణుడుగా చెప్పుకొంటాడు. తన చుట్టూ ఉన్న అమ్మాయిలను గోపికలుగా ప్రకటించారని అంటున్నారు.

నీలి చిత్రాలు చూస్తూ విద్యార్థినులతో సెక్స్

నీలి చిత్రాలు చూస్తూ విద్యార్థినులతో సెక్స్

రూ. 10 లక్షల విలువైన బెడ్‌పై నీలి చిత్రాలు చూస్తూ, స్కూల్ పిల్లలను లేదా ,తనకు నచ్చిన అమ్మాయిలతో రామ్ రహీమ్ సింగ్ రాక్షస క్రీడను సాగించేవాడు. తన సెక్స్ సుఖం కోసం ప్రత్యేకంగా బెడ్‌రూమ్‌ను డిజైన్ చేయించుకొన్నాడు.అత్యంత విలాసవంతంగా ఈ బెడ్‌రూమ్ ఉందని దర్యాప్తు అధికారులు గుర్తించారు.బాబా బెడ్ రూమ్‌లో హోం థియేటర్ నుంచి స్విమ్మంగ్ పూల్ వరకు ఉన్నాయి.

మత్తు మందిచ్చి అత్యాచారం

మత్తు మందిచ్చి అత్యాచారం

బాబా బెడ్‌రూ‌మ్‌లోనే విఐపీలు కలిసేవారని చెబుతుంటారు. తన దగ్గరకు వచ్చే స్త్రీలకు మత్తుమందు ఇచ్చి, మూర్చపోయేలా చేసి అత్యాచారం చేసేవాడు. ఆపై వాళ్లను తన ఆధీనంలోనే పెట్టుకునేవాడు. బాబా తన దత్తపుత్రికగా చెప్పుకునే హనీప్రీత్‌తో రామ్‌ రహీమ్ బాబాకు సెక్స్ సంబంధాలున్నాయని స్వయానా ఆమె భర్తే ఆరోపణలు కూడ చేశారు. 2012లోనే బాబాపై కేసు నమోదు అయినా అది నత్తనడక నడిచింది.బాబా మొత్తం వ్యవహారం అంతా కేవలం శృంగారమే. దాదాపు 270 మంది మహిళలపై అత్యాచారం చేశారని బాబాపై ఆరోపణలున్నాయి.

ఆశ్రమం నిండా గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లు

ఆశ్రమం నిండా గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లు

రేపిస్టు బాబా రామ్ రహీమ్ సింగ్ అరాచకాలకు పరాకాష్టగా అతని డేరాల నిండా గర్భనిరోధక మాత్రలు, కండమ్‌లు దాడుల్లో దొరికాయి. రాత్రి 10 గంటలు దాటగానే అందమైన సాధ్విని పంపమని తన ప్రధాన సాద్వికి ఆదేశించేవాడు. నీ పాపం ఇలా కడిగేస్తానంటూ వాళ్లను పాడుచేసేవాడు. 1999 నుంచి 2002 వరకు 200 మంది సాధ్వీలు బాబా డేరా నుంచి పారిపోయారు.వారిలో సీబీఐకి దొరికింది పదిమందే. మిగిలినవాళ్లు ఏమయ్యారో ఎవరికీ తెలియదు.

పురుషులను రాక్షసంగా ఇలా

పురుషులను రాక్షసంగా ఇలా

ఆడవాళ్లు బోరు కొడితే మగాళ్లతో ఎంజాయ్ చేస్తాడు. ఆ విధంగా వాళ్లను లైంగిక బానిసలుగా తయారు చేశారు. పురుషుల మగతనం లేకుండా బాబా చేశారంటున్నారు. బాబాకు అందుబాటులో 200 మంది అమ్మాయిలు రెఢీగా ఉండేవారు. అయితే బాబా అకృత్యాలను ధైర్యంగా ఎదిరించి పోరాటం చేసిన ఇద్దరు విజయం సాధించారు. బాబాపై పోరాటాన్ని కొనసాగించారు.

English summary
This became amply clear when the anonymous letter that detailed Gurmeet Ram Rahim’s sexual perversion and serial rape of sadhvis in his “gufa” – boudoir – described how the Dera chief raped women at gun point, including the writer of the letter.But besides the gory details of the Dera chief turning graduate, postgraduate girls from believer families into sex slaves.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X