మార్చి 8నే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళల హక్కులు, సమానత్వం, సాధికారత కోసం ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు.మహిళలు సాధించిన విజయాలను గుర్తించడం,లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం,మహిళల హక్కుల గురించి అవగాహన కల్పించడం,మహిళా సాధికారతను ప్రోత్సహించడం మహిళా దినోత్సవం ప్రాముఖ్యత.అయితే మార్చి 8న ఎందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారనేది చాలా మందికి తెలియదు. మార్చి 8న మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో , దానికి గల కారణాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చారిత్రక నేపథ్యం:
1900 ప్రారంభ సంవత్సరాలలో కార్మిక ఉద్యమాలు, సోషలిస్ట్ క్రియాశీలత ముఖ్యమైన పాత్ర పోషించాయి.అమెరికాలో సోషలిస్ట్ పార్టీ ఫిబ్రవరి 28, 1909న జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది.1910లో కోపెన్‌హాగన్‌లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ మహిళల సమావేశంలో "క్లారా జెట్‌కిన్" అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆలోచనను ప్రతిపాదించారు.
1917 సంవత్సరం ఫిబ్రవరి 23 న, రష్యా లో మహిళలు " ఆహారం, శాంతి" ( బ్రెడ్ అండ్ పీస్ ) కోసం సమ్మెకు వెళ్ళారు. రష్యన్ విప్లవానికి దోహదపడిన ఈ సంఘటన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మారింది. ఆ రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 కాగా, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 8 కావటంతో, మార్చి 8వ తేదీనే మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

Why is Women s Day celebrated on March 8

ఐక్యరాజ్యసమితి గుర్తింపు:
1975లో ఐక్యరాజ్యసమితి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అధికారికంగా గుర్తించింది.1977లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సభ్య దేశాలను మార్చి 8ని మహిళా హక్కులు, ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా ప్రకటించమని ఆహ్వానించింది.

మహిళా హక్కుల కోసం పోరాటం:
ఈ రోజు మహిళల హక్కులను గుర్తించి, పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తూ, సమాజ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారు.మహిళలు తమ లక్ష్యాలను సాధించడానికి, వారి హక్కుల కోసం పోరాడటానికి సమాజంలో నాయకత్వ పాత్రలను చేపట్టడానికి ప్రేరణ, ప్రోత్సాహాన్ని అందించేందుకు మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు.

లింగ సమానత్వం:
వివిధ రంగాలలోని మహిళలు సాధించిన విజయాలను గుర్తించడానికి, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఈ రోజు జరుపుకుంటారు.అందుకే ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీని ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+