వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రిగారిని బెంబేలెత్తించిన రాంగ్ కాల్స్.. దెబ్బకు స్విచ్చాఫ్

|
Google Oneindia TeluguNews

ముంబాయి : మనమేదైనా బిజీగా ఉన్న సమయంలో రాంగ్ నంబర్ నుంచి కాల్ వస్తే ఎంత చికాకు కలుగుతుంది. కదా..! అలాంటిది పదే పదే రాంగ్ నంబర్స్ నుంచి ఫోన్ కాల్స్ వెల్లువలా వచ్చి పడితే పరిస్థితి ఏంటి. రాంగ్ కాల్స్ బాధ తాళలేక ఒక్కడు సినిమాలో ధర్మవరపు సుబ్బహ్మణ్యం తరహాలో మొబైల్ ను నేలకేసి కొట్టాలనిపిస్తుంది. అచ్చంగా ఇలాంటి పరిస్థితినే అనుభవించారట మహారాష్ట్ర మంత్రి సుభాష్ దేశాయ్.

మామూలే వ్యక్తులకే రాంగ్ కాల్స్ చికాకు తెప్పిస్తే..! ఇక మంత్రుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. అత్యవసర ఫోన్ల కోసం ఎదురుచూస్తున్న సమయాల్లో, సమావేశాల్లో బిజీగా గడుపుతున్నప్పుడు రాంగ్ కాల్స్ దెబ్బకు దేనిపై దృష్టి పెట్టలేకపోయారట సదరు మంత్రి గారు.

Why Maharashtra's Minister Subhash Desai Was Bombarded With Calls By Fans Of Actress

ఇంతకీ మంత్రి గారు రాంగ్ కాల్స్ బాధితుడవడానికి గల అసలు కారణాలేంటంటే.. ఎవరో ఆకతాయిలు ఆయన ఫోన్ నంబర్ ను మరాఠి హీరోయిన్ రింకూ రాజ్ సైట్ లో పోస్ట్ చేశారు. దీంతో ఆ నంబర్ హీరోయిన్ దే అని భావించిన చాలామంది అభిమానులు మంత్రి గారి ఫోన్ ను మోగించడం మొదలుపెట్టారు. సదరు హీరోయిన్ అభిమానులను ఇక భరించలేనని నిర్ధారించుకుని.. ఏకంగా మొబైల్ ను స్విచ్చాఫ్ చేసేశారట.

అయితే.. మంత్రి సుభాష్ కు తర్వాత తెలిసిన విషయమేంటంటే, ఆ హీరోయిన్ సైట్ ను ఎవరో హ్యాక్ చేశారని తెలిసింది. ఇందులో హీరోయిన్ పాత్ర ఏమి లేదని, ఆకతాయిలే ఎవరో కావాలని ఈ పని చేశారని చెప్పుకొచ్చారు మంత్రి గారు.

English summary
"It must be the handiwork of some hackers, who posted my number on the actress' website. She has no role in this," Desai told PTI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X