• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో ట్రంప్ టవర్స్ నిర్మాణం, కొనుగోలుదారులతో జూనియర్ ట్రంప్ డిన్నర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కొడుకు జూనియర్ ట్రంప్ ఇండియాలో పర్యటిస్తున్నారు. దేశంలోని ముంబై, కోల్‌కత్తాల్లో ట్రంప్ టవర్స్‌ను నిర్మించనున్నారు. ఈ విషయమై దేశీయంగా ఉన్న ఇన్వెస్టర్లతో సమావేశం కావడానికి ఆయన ఇండియా పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ట్రంప్ తనయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ఇండో ఫసిఫిక్ బిజినెస్ సదస్సులో ప్రసంగించనున్నారు. ట్రంప్ టవర్స్ లో అపార్ట్‌మెంట్స్ కొనుగోలు చేసినవారితో జూనియర్ ట్రంప్ డిన్నర్ చేయనున్నారు

దేశంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ బ్యాంక్‌ను లూటీ చేసిన నీరవ్ మోదీ అదృశ్యమయ్యారు.అయితే ఆయన ఎక్కడనున్నాడనే విషయం తెలియదు.

ఈ తరుణంలో ఇండియాలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్ల నిర్మాణం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనయుడు జూనియర్ ట్రంప్ రావడంపై కొంత తప్పుడు సంకేతాలను వెల్లడిస్తోంది.

ట్రంప్ టవర్స్‌ లో అపార్ట్‌మెంట్స్ అత్యంత విలాసవంతంగా ఉంటాయి. ఈ అపార్ట్‌మెంట్స్ సుమారు 78 లక్షల డాలర్ల నుండి 1.6 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని నివేదికలు తెలుపుతున్నాయి.

Why prospect of staying in ‘Trump Tower’ appeals to India’s billionaires in times of Nirav Modi scam

ఈ రకమైన విలాసవంతమైన అపార్ట్‌మెంట్ల నిర్మాణం కోసం స్థానికంగా ఉన్న నిర్మాణం సంస్థలకు ట్రంప్‌కు చెందిన నిర్మాణ సంస్థకు మధ్య ఒప్పందాలు జరిగాయి. పూణె, ముంబై, గోరేగాన్,కోల్‌కత్తా ప్రాంతాల్లో ఈ విలాసవంతమైన భవనాలను నిర్మించనున్నారు.

తాజా ప్రపంచ ఆర్ధిక పోరం నివేదిక ప్రకారంగా దేశంలో సుమారు 60 శాతంపేదలున్నారు. గత ప్రభుత్వాలు, కానీ, ప్రస్తుత ప్రభుత్వం కాని, పేదల డబ్బును బడా పారిశ్రామికవేత్తలు యధేచ్చగా దోచుకొని దోపిడి స్వేచ్చగా ఎంజాయ్ చేస్తూ విదేశాలకు పారిపోతున్నారు. కానీ, పేదల డబ్బులను కొల్లగొట్టిన పెద్దలను చట్టం ఏం చేయడం లేదు.

కానీ, కరువు పరిస్థితులతో రుణాలు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారంగానే 2017లో సుమారు 12 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని సుప్రీంకోర్టుకు చెప్పింది. 2013 నుండి ఇదే సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని కేంద్రం ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్నుల జాబితాలో ఇండియాకు చెందిన వారి పేర్లు వచ్చిన సమయంలో సంతోషపడి సంబరాలు చేసుకోవద్దు. అత్యంత సంపదను పోగు చేసుకొనేందుకు పేదల సొమ్మును దోచుకొన్నాడో తెలియదు

1990లో సరళీకరణకు భారత్ తలుపులు తెరిచింది.దీంతో ఇండియాలో బిలియనీర్ల సంఖ్య పెరుగుతోంది.అయితే అమెరికా ప్రస్తుతం తన స్వంత సమస్యలతో ఇబ్బంది పడుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా తమ వ్యాపారాలను వృద్ది చేసుకొనేందుకుగాను ట్రంప్ కుటుంబం అమెరికా అధ్యక్షుడి పదవిని అడ్డుపెట్టుకొంటున్నారనే విమర్శలు లేకపోలేదు.

ఇందులో భాగంగానే ట్రంప్ కొడుకు జూనియర్ ట్రంప్ ఇండియాలో పర్యటించారనే అభిప్రాయాలు కూడ ఉన్నాయి. తన వెంట పెద్ద ఎత్తున అమెరికా మీడియాతో జూనియర్ ట్రంప్ ఇండియా పర్యటనకు వచ్చాడు.అయితే ట్రంప్ కొడుకు అధికారిక పర్యటన ఇది కాదు.

అయితే అనధికారిక పర్యటనకు వచ్చిన సమయంలో ట్రంప్ కొడుకు ప్రధానమంత్రి మోడీతో సమావేశం కానున్నారు. శుక్రవారం నాడు ఇండో ఫసిఫిక్ బిజినెస్ సదస్సులో మోడీతో కలిసి జూనియర్ ట్రంప్ ప్రసంగించనున్నారు.ఈ సదస్సును పురస్కరించుకొని ఇండియాలో ట్రంప్ టవర్స్‌లో అపార్ట్‌మెంట్స్ కొనుగోలు చేసిన వ్యాపారవేత్తలతో జూనియర్ ట్రంప్ డిన్నర్ చేయనున్నారు.

47 అంతస్థుల ట్రంప్ టవర్స్ భవనాన్ని నిర్మించనున్నారు. ఇందులో సుమారు 250 అపార్ట్‌మెంట్లు ఉంటాయి 2023 నాటికి ఈ టవర్స్ నిర్మాణం పూర్తి కానుంది దీని నిర్మాణం పూర్తి కావాలంటే సుమారు 85 లక్షల డాలర్ల నుండి 1.7 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు అవుతోందని ఆర్థిక నిపుణుల అంచనా.

అయితే, ట్రంప్ తీరుపై మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ లాయర్ విమర్శలు గుప్పించారు. కొందరు కొన్ని సమయాల్లో క్విడ్ కో ప్రో కు పాల్పడేందుకు హద్దులు దాటుతున్నారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను జూనియర్ ట్రంప్ కొట్టిపారేశారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని జూనియర్ ట్రంప్ తేల్చి చెప్పారు.

English summary
The visit of American President Donald Trump's eldest child, Donald John Trump Jr, to India has come at a time when the country has been hit hard by a massive banking fraud.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X