సోనియా అల్లుడిలా నేను బాధితుడ్నే: మాల్యా, నీలా పారిపోలేదు: రాబర్డ్ వాద్రా
బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విజయ్ మాల్యా తనను తాను రాజకీయ బాధితుడిగా చెప్పుకున్నారు.
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విజయ్ మాల్యా తనను తాను రాజకీయ బాధితుడిగా చెప్పుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభ్రద సింగ్ మాదిరిగా తాను కూడా రాజకీయ బాధితుడిని అన్నారు.
తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవి, కల్పితం అన్నారు. మాల్యా వ్యాఖ్యలపై రాబర్డ్ వాద్రా స్పందించారు. తన పేరును మరోసారి ఉపయోగించుకున్నారని, ఇప్పటికీ చాలామంది తన పేరును అడ్డం పెట్టుకొని మాట్లాడుకుంటూనే ఉన్నారని, ఈసారి బ్రిటన్ కోర్టులో మాల్యా నా పేరు ఉపయోగించుకున్నారని వాద్రా అన్నారు.

మాల్యాకు తాను ఒక్కటే చెప్పదలుచుకున్నానని, తాను రాజకీయ బాధితుడినే, కానీ ఎప్పుడూ తన పరపతిని తప్పుగా ఉపయోగించలేదని, న్యాయవ్యవస్థ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని, మాల్యా లాగా తాను ఎవరి సొమ్ముతో విదేశాలకు పారిపోలేదన్నారు.
మాల్యాకు తన విన్నపం అని, భారత్ వచ్చి ఆయనపై ఉన్న అన్ని పెండింగ్ కేసుల విచారణకు హాజరుకావాలని కోరుతున్నానని, దీంతో పాటు తన పేరును ఉపయోగించుకోవడం మానేయాలన్నారు.












Click it and Unblock the Notifications