వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీదేవి సోదరికి ఆలస్యంగా సమాచారం, అభ్యంతరం! సరదాగా వెళ్లొద్దామనుకొని, అంతలోనే

|
Google Oneindia TeluguNews

దుబాయ్/ముంబై: నటి శ్రీదేవి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కార్డియాక్ అరెస్టుతో చనిపోలేదా? లేదంటే ఎలా చనిపోయారు? అనే ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. శ్రీదేవి మృతి కేసులో దుబాయ్ పోలీసులు దర్యాఫ్తు జరుపుతున్నారు.

Recommended Video

Sridevi Passes Away : అందమే శాపమైందా, అవే ప్రాణాలకు ముప్పు తెచ్చాయా?

మరోవైపు, ఆమె కుటుంబ సభ్యులు శ్రీదేవి మృతిపై మాట్లాడటం లేదు. ఈ కారణంగా శ్రీదేవి మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. మరణంపై అధికారులు అధికారిక ప్రకటన చేయలేదు.

తల్లి మృతితో కుప్పకూలిన జాన్వీ!: శ్రీదేవి డెడ్‌బాడీ అప్పగించలేదు, ఫ్లైట్ పంపిన అంబానీతల్లి మృతితో కుప్పకూలిన జాన్వీ!: శ్రీదేవి డెడ్‌బాడీ అప్పగించలేదు, ఫ్లైట్ పంపిన అంబానీ

శ్రీదేవి సోదరికి ఆలస్యంగా సమాచారం

శ్రీదేవి సోదరికి ఆలస్యంగా సమాచారం

పెళ్లి నుంచి శ్రీదేవి భర్త బోనీ కపూర్ హఠాత్తుగా ముంబై రావడం, సర్ ప్రైజ్ డిన్నర్ కోసం అంటూ దుబాయ్ వెళ్లడం తదితర అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శ్రీదేవి సోదరి శ్రీలతకు ఆలస్యంగా సమాచారం ఇవ్వడంపై ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీదేవి మృతిపై పలు ప్రశ్నలు

శ్రీదేవి మృతిపై పలు ప్రశ్నలు

శ్రీదేవి ఎలా చనిపోయింది? బాత్ టబ్‌లో ఊపిరాడక చనిపోయిందా? అసలు చనిపోయినప్పుడు బోనీ కపూర్ ఉన్నారా లేరా? రాత్రి తొమ్మిది గంటల వరకు మెడికల్ హెల్ప్ ఎందుకు తీసుకోలేదు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని అంటున్నారు.

అనుమానాలు నివృత్తి కావాలి

అనుమానాలు నివృత్తి కావాలి

శ్రీదేవి మృతి చెందిన రెండు మూడు గంటల్లో ఏం జరిగింది? బోనీ కపూర్ భారత్‌లో ఉన్నారా, దుబాయ్‌లోన్? హోటల్ సిబ్బందే మొదట గుర్తించారా? కార్డియాక్ అరెస్టుతో చనిపోలేదా? సర్ ప్రైజ్ డిన్నర్ కోసం బోనీ దుబాయ్ వెళ్లారా? అనే అనుమానాలు తేలాల్సి ఉందని అంటున్నారు.

హోటల్లో ఏం జరిగింది

హోటల్లో ఏం జరిగింది

శ్రీదేవి లాంటి హైప్రొఫోల్ పర్సన్ చనిపోతే రిపోర్టులు ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారా? జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్లో అసలు ఏం జరిగింది? అనే అనుమానాలు తేలాల్సి ఉందని అంటున్నారు.

రిసెప్షన్ ముగిశాక హోటల్‌కు శ్రీదేవి

రిసెప్షన్ ముగిశాక హోటల్‌కు శ్రీదేవి

మేనల్లుడు మోహిత్ మార్వా పెళ్లి నిమిత్తం కుటుంబంతో కలిసి దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి శనివారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం రిసెప్షన్ అనంతరం శ్రీదేవి జుమైరా ఎమిరేట్స్ హోటల్‌కు చేరుకున్నారు. రిసెప్షన్ ముగిశాక బోనీకపూర్ పని నిమిత్తం ముంబై వచ్చారు.

సరదాగా వెళ్దామనుకున్నారని మాట్లాడుకున్నారు

సరదాగా వెళ్దామనుకున్నారని మాట్లాడుకున్నారు

అనంతరం శనివారం సాయంత్రం మళ్లీ దుబాయ్ చేరుకున్నారు. శ్రీదేవిని సర్ ప్రైజ్ చేద్దామనుకొని దుబాయ్ కాలమానం ప్రకారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఆమెను నిద్రలేపారు. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత సరదాగా డిన్నర్‌కు వెళ్దామని శ్రీదేవికి బోనీ చెప్పినట్లు స్థానిక దుబాయ్ పత్రిక వెల్లడించింది. అప్పుడు బాత్రూంలోకి వెళ్లిన శ్రీదేవి కన్నుమూసిన విషయం తెలిసిందే.

సర్జరీలపై పలువురి స్పందన

మరోవైపు, శ్రీదేవి మృతికి ఆమె చేసుకొన్న సౌందర్య చికిత్సలు పరోక్షంగా కారణం అయ్యాయా అనే చర్చ కూడా సాగుతోంది. సినీరంగంలో ఉన్న వారు తమ అందానికి మెరుగులు దిద్దుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. శ్రీదేవి మృతి నేపథ్యంలో చాలామంది సర్జరీలపై స్పందించారు.

English summary
Legendary actress and Bollywood's first female superstar Sridevi died too early, leaving her family, friends and fans utterly sad and shocked. The much-loved actress was only 54.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X