నన్నే టార్గెట్ చేస్తున్నారేం: 'విషాదం'పై హేమమాలిని
లక్నో: మధురలో జరిగిన ఘటన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని, అసలు అంశాన్ని పక్కదారి పట్టించి తనను ఎందుకు ఆడిపోసుకుంటున్నారని సినీ నటి, ఎంపీ హేమమాలిని అన్నారు. శనివారం మధురలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు హేమమాలిని నేతృత్వం వహించారు.
ఘటన జరిగిన వెంటనే దానిపై స్పందించకుండా ముంబైలో సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ఆమె విమర్శల పాలయ్యారు. ఓ వైపు సొంత నియోజకవర్గంలో ఇంత ప్రమాదం జరిగితే ఆమె ట్విట్టర్లో ఫోటోలు పోస్ట్ చేయడాన్ని చాలామంది తప్పుబట్టారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, అందరూ తన ట్వీట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయించే ముందు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాల్సిందన్నారు.
అక్కడున్న మూడు వేల మంది దగ్గర ఆయుధాలు ఉన్న విషయం పోలీసులకు తెలుసునని చెప్పారు. కానీ వాళ్లు ఈ దారుణ ఘటన జరగకుండా నివారించలేకపోయారన్నారు. ఘటనలో చనిపోయిన ఎస్పీ ముకుల్ ద్వివేదీ కుటుంబాన్ని హేమ పరామర్శించారు. మరోవైపు ఘటనపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ నిష్పక్షపాత దర్యాప్తు జరిపిస్తామన్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications