మోడీకి రజనీ సహా నో: విజయకాంత్ హాజరు వెనుక...!
న్యూఢిల్లీ/చెన్నై: నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి డిఎండికె అధ్యక్షులు, ప్రముఖ హీరో విజయకాంత్ హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయన నిర్ణయం వెనుక మర్మం దాగి ఉందని చెబుతున్నారు.
మోడీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షను ఆహ్వానించడం తమిళులు, తమిళ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమిళుల ఆందోళనల నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా మోడీ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉంటున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత, పిఎంకె చీఫ్ వైకోతో సహా సూపర్ స్టార్ రజనీ కూడా హాజరు కావడం లేదు. అయినప్పటికీ విజయకాంత్ హాజరవుతున్నారు. అయితే మోడీ కేబినెట్లో మంత్రి పదవి, తన సోదరుడికి రాజ్యసభ సీటును ఆశిస్తున్నందునే విజయకాంత్ హాజరవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. తొలుత విజయకాంత్ సతీమణి ప్రేమలతకు రాజ్యసభ ఉండవచ్చుననే ప్రచారం సాగింది.

విజయకాంత్
నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి డిఎండికె అధ్యక్షులు, ప్రముఖ హీరో విజయకాంత్ హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయన నిర్ణయం వెనుక మర్మం దాగి ఉందని చెబుతున్నారు.

విజయకాంత్
మోడీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షను ఆహ్వానించడం తమిళులు, తమిళ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమిళుల ఆందోళనల నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా మోడీ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉంటున్నారు.

విజయకాంత్
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత, పిఎంకె చీఫ్ వైకోతో సహా సూపర్ స్టార్ రజనీ కూడా హాజరు కావడం లేదు. అయినప్పటికీ విజయకాంత్ హాజరవుతున్నారు. అయితే మోడీ కేబినెట్లో మంత్రి పదవి, తన సోదరుడికి రాజ్యసభ సీటును ఆశిస్తున్నందునే విజయకాంత్ హాజరవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. తొలుత విజయకాంత్ సతీమణి ప్రేమలతకు రాజ్యసభ ఉండవచ్చుననే ప్రచారం సాగింది.

విజయకాంత్
రాజపక్ష వద్దని తమిళ పార్టీల డిమాండ్ నేపథ్యంలో ఇటీవల విజయకాంత్ ఒత్తిడిలో పడిపోయిన విషయం తెలిసిందే. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షను ఆహ్వానించవద్దని తమిళ పార్టీలు గొంతు చించుకుంటున్నాయి. వారి బాటలోనే విజయకాంత్ నడిచారు. విజయకాంత్ ఎన్డీయేలో భాగస్వామి కావడం గమనార్హం.

విజయకాంత్
మూడు రోజుల క్రితం ఎన్డీయే సమావేశంలో నరేంద్ర మోడీ... విజయకాంత్‌ను, ఆయన సతీమణి ప్రేమలతలను ప్రత్యేకంగా అభినందించారు. తమను ప్రత్యేకంగా మోడీ గుర్తించడంపై వారు ఉబ్బితబ్బిబ్బయ్యారు. అయితే ఇప్పుడు విజయకాంత్ ఒత్తిడిలో పడిపోయారు.

విజయకాంత్
తన ప్రమాణ స్వీకారానికి మోడీ.. పాకిస్తాన్ ప్రధాని, శ్రీలంక అధ్యక్షుడు సహా సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షకు ఆహ్వానం పంపడంపై తమిళ పార్టీలు మండిపడుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత, డిఎంకె పార్టీ అధ్యక్షులు కరుణానిధిలతో పాటు పలు పార్టీలు, నాయకులు రాజపక్షకు ఆహ్వానం పంపించడాన్ని వ్యతిరేకించాయి.

విజయకాంత్
కొద్ది రోజులుగా తమిళ పార్టీలు దీనిపై తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయి. వైకో బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్‌ను కలిసి రాజపక్షను ఆహ్వానించవద్దని కోరారు. అయితే దీనిపై రెండు రోజుల క్రితం వరకు విజయకాంత్ స్పందించలేదు.

విజయకాంత్
అన్ని తమిళ పార్టీలు, నాయకులు మూకుమ్మడిగా రాజపక్ష రాకను వ్యతిరేకిస్తుండటంతో విజయకాంత్ కూడా గొంతు కలపక తప్పలేదు. మోడీ ప్రమాణ స్వీకారానికి రాజపక్షను ఆహ్వానించవద్దని బిజెపిని కోరారు. ఎస్ఎంకె చీఫ్ శరత్ కుమార్ కూడా రాజపక్షకు ఆహ్వానం పంపించడాన్ని ఖండించారు. రాజపక్ష రాకను విజయకాంత్ వ్యతిరేకిస్తూనే మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications