Wife: మూడు నెలల క్రితం పెళ్లి, కొత్త పెళ్లి కూతురి మీద కామాంధుల కన్ను, నడిరోడ్డులో కొత్త పెళ్లి కొడుకు హత్య !
అహమ్మదాబాద్/ రాజ్ కోట్: కుటుంబ సభ్యులు చూపించిన యువతిని మూడు నెలల క్రితమే యువకుడు పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత దంపతులు చాలా సంతోషంగా ఉంటున్నారు. వారంలో మూడునాలుగు రోజులు నవ దంపతులు బైక్ లో షికారుకు వెళ్లి వస్తున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న యువతి మీద స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు కామాంధులు కళ్లుపడ్డాయి. భర్తతో కలిసి బయటకు వెళ్లి వస్తున్న కొత్త పెళ్లి కూతురిని కొందరు యువకులు ఆటపట్టిస్తున్నారు. రెండు రోజుల క్రితం నవ దంపతులు బైక్ లో వెలుతుంటే కొందరు యువకులు వారిని అడ్డుకున్నారు. ఇదే సమయంలో కొత్త పెళ్లి కూతురి గురించి కొందరు యువకులు అసభ్యంగా మాట్లాడారు. ఆ సమయంలో ఇద్దరి మీద కొత్త పెళ్లి కొడుకు చెయ్యి చేసుకున్నాడు. స్థానికంగా నివాసం ఉంటున్న పెద్దలు కొందరు నవ దంపతులకు నచ్చచెప్పి, యువకులను హెచ్చరించి అక్కడి నుంచి పంపించారు. గొడవపడిన వారు బంధువులు కావడంతో సాయంత్రం రాజీ చెయ్యడానికి అదే ప్రాంతంలోని ఓ ఇంటి దగ్గర అందరూ కలవాలని పెద్దలు అనుకున్నారు. కొత్త పెళ్లి కొడుకు, అతని భార్య, ఆమె బంధువులు అక్కడికి వెళ్లారు. అదే సమయంలో కొత్త పెళ్లి కూతురిని బూతులు తిట్టిన వాళ్లు అక్కడికి వెళ్లారు. ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోవడంతో నలుగురు నిందితులు కొత్త పెళ్లి కొడుకును కత్తులతో పొడిచి స్పాట్ లో చంపేయడం కలకలం రేపింది.

మూడు నెలల క్రితం పెళ్లి
గుజరాత్ లోని రాజ్ కోట్ నగరంలో షబ్బీర్ లాల్ పరియా అలియాస్ షబ్బీర్ (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని నెలల క్రితం షబ్బీర్ కు వివాహం చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు రాజ్ కోట్ లోనే ఓ అమ్మాయిని చూశారు. కుటుంబ సభ్యులు చూపించిన యువతిని మూడు నెలల క్రితమే షబ్బీర్ పెళ్లి చేసుకున్నాడు.

కొత్త పెళ్లి కూతురి మీద కన్ను వేసిన కామాంధులు
వివాహం చేసుకున్న తరువాత షబ్బీర్ దంపతులు చాలా సంతోషంగా ఉంటున్నారు. వారంలో మూడునాలుగు రోజులు నవ దంపతులు బైక్ లో షికారుకు వెళ్లి వస్తున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న షబ్బీర్ భార్య మీద స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు కామాంధులు కళ్లుపడ్డాయి. భర్త షబ్బీర్ తో కలిసి బయటకు వెళ్లి వస్తున్న కొత్త పెళ్లి కూతురిని కొందరు యువకులు ఆటపట్టిస్తున్నారు.

అసభ్యంగా బూతులు మాట్లాడిన యువకులు
షబ్బీర్ దంపతులు బైక్ లో వెలుతుంటే స్థానికంగా నివాసం ఉంటున్న జుబేర్ బజారియా అలియాస్ జుబేర్ తో పాటు కొందరు యువకులు వారిని అడ్డుకున్నారు. ఇదే సమయంలో షబ్బీర్ భార్య ( కొత్త పెళ్లి కూతురి) గురించి జుబేర్ తో పాటు అతని బంధువులు మోహ్సిన్ తదితర యువకులు అసభ్యంగా మాట్లాడారు.

చివాట్లు పెట్టి పంపించిన పెద్దలు
ఆ సమయంలో ఇద్దరి మీద కొత్త పెళ్లి కొడుకు షబ్బీర్ చెయ్యి చేసుకున్నాడు. స్థానికంగా నివాసం ఉంటున్న పెద్దలు కొందరు షబ్బీర్ దంపతులకు నచ్చచెప్పి, జుబేర్, మొహ్సిన్ తదితర యువకులను హెచ్చరించి అక్కడి నుంచి పంపించారు. గొడవపడిన షబ్బీర్, జుబేర్ సమీప బంధువులు కావడంతో సాయంత్రం రాజీ చెయ్యడానికి అదే ప్రాంతంలోని ఓ ఇంటి దగ్గర అందరూ కలవాలని పెద్దలు అనుకున్నారు.

కొత్త పెళ్లి కొడుకును స్పాట్ లో చంపేశారు
కొత్త పెళ్లి కొడుకు షబ్బీర్, షబ్బీర్ భార్య, ఆమె బంధువులు బంధువుల ఇంటి దగ్గరకు వెళ్లారు. అదే సమయంలో కొత్త పెళ్లి కూతురిని బూతులు తిట్టిన జుబేర్, అతని సోదరుదు సద్దాం, మొహ్సిన్, షేక్ వాసీం తదితరులు అక్కడికి వెళ్లారు. ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోవడంతో జుబేర్, మొహ్సిన్, వాసీం, సద్దాం అనే నలుగురు నిందితులు కొత్త పెళ్లి కొడుకు షబ్బీర్ ను కత్తులతో పొడిచి స్పాట్ లో చంపేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కొత్త పెళ్లి కొడుకు షబ్బీర్ ను హత్య చేసిన నిందితులు తప్పించుకున్నారని, వారి కోసం గాలిస్తున్నామని, త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని స్థానిక పోలీసులు తెలిపారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications