Wife: ఉద్యోగం చేస్తున్న భార్య, డిటెక్టీవ్ అవతారం ఎత్తిన పోలీసు భర్త, పోలీసు క్వాటర్స్ లో గొంతు కోసేసి!
లక్నో/ ముజఫర్ నగర్: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువకుడిని వివాహం చేసుకుంటే తమ కుమార్తె సంతోషంగా ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం యువతి, యువకుడి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. సంవత్సరం పాటు దంపతులు సంతోషంగా కాపురం చేశారు. భార్య కూడా ఉద్యోగం చేస్తున్నది. ఉదయం ఆఫీసుకు వెలుతున్న భార్య సాయంత్రం ఇంటికి తిరిగి వెలుతోంది. రానురాను భార్య మీద ఆమె భర్త అనుమానం పెంచుకున్నాడు.
అసలే పోలీసు ఉద్యోగం చేస్తున్న భర్త అతని భార్యకు సినిమా చూపించాడు. నువ్వు ఉద్యోగం మానేయాలని భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు భార్యకు చెప్పారు. ఉద్యోగం మాత్రం మాననని భార్య ఎదురు తిరిగింది. కొంతకాలంగా భార్య ఉద్యోగం చేసే విషయంలో రచ్చరచ్చ జరిగింది. మాటామాటా పెరిగిపోవడంతో పోలీసు క్వాటర్స్ లోనే భర్త అతని భార్య గొంతు కోసేయడం కలకలం రేపింది.

పోలీసు ఉద్యోగం
ఉత్తరప్రదేశ్ లోని ముజఫ్ నగర్ లో యోగేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని సీఆర్ పీఎఫ్ లో యోగేష్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. యోగేష్ కు సునీత అనే యువతికి పెళ్లి సంబంధం చూశారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యోగేష్ ను వివాహం చేసుకుంటే తమ కుమార్తె సునీత జీవితాంతం సంతోషంగా ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు.

మూడు సంవత్సరాల క్రితం గ్రాండ్ గా పెళ్లి
మూడు సంవత్సరాల క్రితం 2019లో యోగేష్, సునీతల పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. సంవత్సరం పాటు యోగేష్, సునీత దంపతులు సంతోషంగా కాపురం చేశారు. సునీత కూడా ఉద్యోగం చేస్తున్నది. ప్రతిరోజూ యోగేష్, సునీత దంపతులు ఉద్యోగాలు చేసుకుంటూ, సమయం చిక్కినప్పుడు బయట తిరుగుతూ హ్యాపీగా ఉన్నారు.

భర్తకు భార్య మీద అనుమానం పెరిగిపోయింది
ఉదయం ఆఫీసుకు వెలుతున్న సునీత సాయంత్రం ఇంటికి తిరిగి వెలుతోంది. రానురాను సునీత మీద ఆమె భర్త యోగేష్ అనుమానం పెంచుకున్నాడు. అసలే పోలీసు ఉద్యోగం చేస్తున్న యోగేష్ అతని భర్త సునీత మీద నిఘా వేశాడు, ఆఫీసుకు వెలుతున్న తన భార్య సునీత ఆఫీసు అయిపోయిన తరువాత ఎక్కడికి వెలుతోంది ?, ఎవరెవరితో మాట్లాడుతోంది, ఏం చేస్తోంది అంటూ సీక్రేట్ గా నిఘా వేసి వివరాలు సేకరించాడు.

ఉద్యోగం వద్దూ.... తొక్కా వద్దు... మానేసి ఇంట్లో ఉండు
కానిస్టేబుల్ యోగేష్ ఇలా నిత్యం అతని భార్య సునీతకు సినిమా చూపించాడు. నువ్వు ఉద్యోగం మానేయాలని సునీతకు ఆమె భర్త యోగేష్ తో పాటు అతని కుటుంబ సభ్యులు గట్టిగా చెప్పారు. అయితే నేను చదువుకున్నానని, ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండనని, పెళ్లికి ముందే నేను ఉద్యోగం చేస్తానని మీకు చెప్పానని సునీత ఆమె భర్త యోగేష్ ఎదురుతిరిగింది.

ఉద్యోగం వదిలేయకుంటే విడాకులు ఇస్తానని బెదిరించిన భర్త
ఉద్యోగం మానేయకుంటే నీకు విడాకులు ఇచ్చేస్తానని యోగేష్ అతని భార్య సునీతను హెచ్చరించాడు. విడాకులు ఇస్తానని చెప్పినా సునీత ఏమాత్రం పట్టించుకోకుండా ఉద్యోగం చేస్తున్నది. ఉద్యోగం మాత్రం మాననని ఎదురు తిరిగిన సునీత రోజూ ఆఫీసుకు వెళ్లి వస్తోంది. కొంతకాలంగా సునీత ఉద్యోగం చేసే విషయంలో రచ్చరచ్చ జరిగింది.
Recommended Video

పోలీసు క్వాటర్స్ లో భార్య గొంతు కోసేసిన పోలీసు
రాత్రి మాటామాటా పెరిగిపోవడంతో పోలీసు క్వాటర్స్ లోనే యోగేష్ పదునైన కత్తితో అతని భార్య సునీత గొంతు కోసేయడం కలకలం రేపింది. సునీతకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. స్థానిక సివిల్ పోలీసులు సీఆర్ పీఎఫ్ కానిస్టేబుల్ యోగేష్ మీద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications