Wife: పెళ్లామ్ కోరికలు తీర్చలేనివాడికి ఇంట్లో భార్య ఎందుకు ?, ఫ్రెండ్ కామెంట్, భర్త ఏంచేశాడంటే !
బెంగళూరు/మైసూరు: చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు యువకులు మంచి స్నేహితులుగా కలసిమెలసి తిరుగుతున్నారు. అయితే ఆ స్నేహితుల్లో కొందరు ఉద్యోగాలు, వ్యాపారం చేస్తుంటే కొందరు జులాయిగా తిరుగుతున్నారు. ఇటీవల ఓ యువకుడు ప్రేమించిన యువతిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న ఆ యువకుడు మాత్రం రాత్రి పూట స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. రాత్రి మద్యం మత్తులో ఉన్న యువకుడు తన భార్య అడుగుతున్నవి అన్నీ తీసివ్వలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో సాటి స్నేహితుడు భార్య కోరికలు తీర్చలేనివాడికి పెళ్లి ఎందుకు అంటూ నోరుజారాడు. భార్య కోరికలు తీర్చలేని వాడికి పెళ్లామ్ ఎందుకు ? అంటూ స్నేహితుడిని ఉద్దేశించి అతని ఫోటోతో పాటు కొంత మ్యాటర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. భార్య విషయంలో చెడుగా కామెంట్ చేశాడని రగిలిపోయిన భర్త అతని ఫ్రెండ్ ను నమ్మించి పిలుచుకుని వెళ్లి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని హణసూరు పట్టణంలో బీరేష్, మనోజ్, నితిన్ తదితర యువకులు నివాసం ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు యువకులు మంచి స్నేహితులుగా కలసిమెలసి తిరుగుతున్నారు. అయితే ఆ స్నేహితుల్లో కొందరు ఉద్యోగాలు, వ్యాపారం చేస్తుంటే బీరేష్, నితిన్ తోపాటు మరికొందరు జులాయిగా తిరుగుతున్నారు.

ఫ్రెండ్ లవ్ మ్యారేజ్
నితిన్ హణసూరు పట్టణంలోనే నివాసం ఉంటున్న ఓ యువతిని మూడు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు. మూడు నెలల క్రితం నితిన్ ప్రేమించిన యువతిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. భార్యతో కాపురం చేస్తున్న నితిన్ ప్రతిరోజు అతని స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.

భార్య కోరికలు తీర్చలేనివాడికి పెళ్లి, పెళ్లామ్ ఎందుకు ?
రాత్రి మద్యం మత్తులో ఉన్న నితిన్ తన భార్య అడుగుతున్నవి అన్నీ తీసివ్వలేకపోతున్నానని, తనకు వ్యాపారం చెయ్యడానికి ఎలాంటి మార్గం కనపడటం లేదని స్నేహితుల దగ్గర విచారం వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో నితిన్ సాటి స్నేహితుడు బీరేష్ మద్యం మత్తులో భార్య కోరికలు తీర్చలేనివాడికి పెళ్లి ఎందుకు అంటూ నితిన్ ను చులకనగా మాట్లాడాడు. ఆ సందర్బంలో నితిన్, బీరేష్ మద్య పెద్ద గొడవ జరిగింది.

పక్కాప్లాన్ తో పిలుచుకుని వెళ్లి చంపేశారు
నితిన్ మీద బీరేష్ రగిలిపోయాడు.భార్య కోరికలు తీర్చలేని వాడికి పెళ్లామ్ ఎందుకు ? అంటూ స్నేహితుడు నితిన్ ను ఉద్దేశించి అతని ఫోటోతో పాటు కొంత మ్యాటర్ ను బీరేష్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. భార్య విషయంలో చెడుగా కామెంట్ చేశాడని బీరేష్ మీద రగిలిపోయిన నితిన్ అతని స్నేహితుడు మనోజ్ తో కలిసి బీరేష్ ను నమ్మించి బైక్ లో హణసూరు సమీపంలోకి పిలుచుకుని వెళ్లి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications