ముప్పై ఏళ్ల స్నేహం కామానికి బలి.. బెంగుళూరులో షాకింగ్ మర్డర్ !
దేశంలో మానవ సంబంధాలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలో కట్టుకున్న భార్యను కడతేర్చుతున్న మృగాళ్లు ఓ పక్కన ఉంటే.. మరోవైపు ఇప్పుడు కొత్తగా ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను వారినే కాటికి పంపుతున్నారు కొందరు మహిళలు. ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్నాయి. లేటెస్ట్ గా భర్త స్నేహితుడితో ఎఫైర్ పెట్టుకొని కట్టుకున్న వాడిని కిరాతకంగా హతమార్చారు. ఈ దారుణ ఘటన బెంగళూరులో జరగగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ముప్పై ఏళ్ల స్నేహం కామానికి బలి..
బెంగళూరుకు చెందిన విజయ్ కుమార్ (39), ధనుంజయ అలియాస్ జై చిన్ననాటి నుంచి స్నేహితులు. మాగడి ప్రాంతంలో కలిసి పెరిగిన వీరి మధ్య స్నేహం దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం చేసే విజయ్ కుమార్‌కు పదేళ్ల క్రితం ఆశ అనే మహిళతో వివాహమైంది. దంపతులు కామాక్షిపాళ్యలో నివాసం ఉండేవారు. అయితే కాలక్రమేణా ఆశ, ధనుంజయ మధ్య సాన్నిహిత్యం పెరిగింది.

ఒక రోజు వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతూ విజయ్ కి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. అంతేకాకుండా వారిద్దరి సన్నిహిత ఫొటోలు కూడా చూసి షాక్ అయ్యాడు. ఈ విషయంపై వారిని నిలదీయడంతో, స్నేహితుల మధ్య ఘర్షణ చెలరేగింది. కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో విజయ్.. భార్యతో పాటు కడబగెరె సమీపంలోని మాచోహళ్లిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని మకాం మార్చాడు. కానీ స్థలం మారినా కూడా ఆశ-ధనుంజయ సంబంధం మాత్రం అలాగే కొనసాగినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే విజయ్ తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఆశ-ధనుంజయ అతడిని అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజు సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన విజయ్, మాచోహళ్లిలోని డీ గ్రూప్ లేఅవుట్ వద్ద మృతదేహంగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, ఇది హత్య అని నిర్ధారించారు. విచారణలో ఆశ-ధనుంజయ మధ్య కొనసాగిన వివాహేతర సంబంధం బయటపడింది.
దాంతో హత్యా కుట్రకు వీరిద్దరూ పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆశను అదుపులోకి తీసుకోగా, ధనుంజయ పరారీలో ఉన్నాడు. అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ముప్పై ఏళ్ల స్నేహం కామానికి బలి అయ్యిందని.. చివరికి హత్యతో ముగియడం స్థానికంగా కలకలం రేపింది. నమ్మిన స్నేహితుడు, జీవిత భాగస్వామి కలిసి విజయ్ జీవితానికి ముగింపు పలికారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications