Bihar: బీహార్‍లో దారుణం.. భర్తను అక్కడ పొడిచిన భార్య..

బీహార్ లో దారుణం జరిగింది. పాట్నాలో ఓ భార్య భర్త ప్రైవేట్ పార్ట్స్ పై కత్తితో దాడి చేసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
పెళ్లయిన రెండు రోజులకే పాట్నాలోని భార్య ఈ ఘాతుకానికి తెగపడింది. పాట్నాలోని న్యూ డాక్ బంగ్లా రోడ్‌లోని ఓ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీతామర్హికి చెందిన సూర్యభూషణ్ కుమార్ సీఆర్‌పీఎఫ్ జవాన్ గా పని చేస్తున్నాడు.

సూర్య భూషణ్ కుమార్ కు నేహా కుమారి అనే యువతితో పరిచయం ఏర్పండి. పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో తెలిసింది. దీంతో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో వారి పెళ్లి జరగలేదు. ఈ క్రమంలోనే సూర్యభూషణ్ కుమార్ కు మరో అమ్మాయితో పెళ్లి చేయాలని అతని తల్లిదండ్రులు నిర్ణయించారు. అయితే ఈ విషయం నేహా కుమారికి తెలిసింది.

knifeattack

దీంతో నేహా కుమారి సూర్య భూషణ్ కుమార్ పై పెళ్లి చేసుకోవాలని ప్రెషర్ చేసింది. తాను పాట్నాలో ఉన్నానని వెంటనే రావాలని సూర్యభూషణ్ ను కోరింది. దీంతో సూర్యభూషణ్ పాట్నాకు చేరుకోగానే అతనిపై మరింత ఒత్తిడి చేసి పెళ్లి చేసుకోవడానికి ఒప్పించింది. వారిద్దరు పోలీసుల సమక్షంలో ఒకటయ్యారు. జూన్ 5న వారి పెళ్లి జరిగింది. వివాహం తర్వాత వారిద్దరు న్యూ డాక్ బంగ్లా రోడ్‌లోని ఓ హోటల్‌లో దిగారు.

ఈ క్రమంలో పెళ్లి విషయాన్ని ఇరు కుటుంబాలకు తెలిపారు. వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. సూర్యభూషణ్ తల్లిదండ్రులు వెంటనే ఇంటికి రావాలని అతనిపై ఒత్తిడి పెంచారు. పెళ్లిని ఒప్పుకోమని చెప్పేశారు. ఇదే విషయమై జూన్ 7న నేహా, సూర్యభూషణ్ కు మధ్య గొడవ జరిగింది. తన తల్లదండ్రులు వేరే అమ్మాయి పెళ్లి చేస్తామని చెబుతున్నారని.. నేహా చెప్పాడు. కొన్నాళ్ల పాటు దూరంగా ఉంటే అంతా సర్దుకుంటుందని చెప్పాడు.

ఇది విన్న నేహా కుమారి కోపంతో ఊగిపోయింది. అక్కడే ఉన్న కత్తి సూర్యభూషణ్ ప్రైవేట్ పార్ట్స్ పై దాడి చేసింది. దీంతో అతను హెటల్ గది నుంచి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతన్ని హోటల్ సిబ్బంది ఆస్పత్రిలో చేర్పించారు. తనను కాదని మరోకర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోనే ఇలా చేశానని నేహా కుమారి తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+