Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నల్లగా ఉన్నావంటూ భర్తకు చుక్కలు చూపిన భార్య: క్రూరత్వమేనంటూ హైకోర్టు సంచలన తీర్పు

బెంగళూరు: భార్య వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించిన భర్తకు ఆమె నుంచి విముక్తి కల్పించింది ఉన్నత న్యాయస్థానం. భర్త నల్లగా ఉన్నాడంటూ అతడ్ని తీవ్ర వేధింపులకు గురిచేసింది భార్య. పెళ్లయిన తర్వాత నుంచి భార్య వేధింపులు భరిస్తూ వస్తున్న భర్త.. చివరకు ఓపిక నశించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, భార్య కూడా అతడిపై తప్పుడు కేసు పెట్టడం గమనార్హం. చివరకు అసలు విషయం తెలియడంతో హైకోర్టు వారిద్దరికీ విడాకులు ఇచ్చింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలో ఓ యువతీ యువకుడికి 2007లో వివాహం జరిగింది. అయితే, వివాహమైన తర్వాత నుంచీ నల్లగా, అందవిహీనంగా ఉన్నావంటూ భర్తీను వేధింపులకు గురిచేసింది భార్య. ఆమె చిత్రహింసలు భరించలేక ఆ భార్యా బాధితుడు చివరకు కోర్టును ఆశ్రయించాడు.

womenbeatingmen1

అయితే, అంతలోనే ఆమె కూడా భర్తపై కేసు పెట్టింది. 2011లో తనపై, తన తల్లి, ఇతర కుటుంబసభ్యులనూ చిత్రహింసలకు గురిచేశారని భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో తాను దాదాపు వంద రోజులపాటు పోలీస్ స్టేషన్, కోర్టులో గడిపానని బాధిత భర్త వాపోయాడు. తన భార్య ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి తిరిగి రాలేదని.. దీంతో తాను చాలా బాధపడ్డానని, డిప్రెషన్లోకి వెళ్లానని భర్త ఆవేదన వ్యక్తం చేశాడు.

అందుకే తనకు విడాకులు మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించాడు భర్త. అయితే, భర్త వేసిన పిటిషన్ కొట్టివేయాలని భార్య కోర్టుకు విజ్ఞప్తి చేసింది. తన భర్తకు అక్రమ సంబంధం ఉందని, ఆ సంబంధం నుంచి ఒక బిడ్డ కూడా ఉందని ఆమె ఆరోపించింది. అంతేగాక, తన భర్త కూడా పరుష పదజాలంతో దూషించాడని, బయటకు వెళ్లి ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడని తెలిపింది.

 Wife calling husband dark-skinned amounts to cruelty: Karnataka HC grants divorce over color based comments

ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. ఈ కేసులో సంచలన తీర్పు వెలువరించింది. భర్తతో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉన్నానని భార్య చెబుతున్నా.. ఫిర్యాదును మాత్రం వెనక్కి తీసుకోకపోవడం తన భర్తతో కలిసి జీవించాలనే ఆసక్తి లేదని సూచిస్తోందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. వర్ణ జాతి పరమైన వ్యాఖ్యలు చేసి వేధించడాన్ని క్రూరత్వంగా పరిగణించిన ఉన్నత న్యాయస్థానం.. ఆ భర్తకు భార్య నుంచి విడాకులు మంజూరు చేస్తూ కీలక తీర్పు ఇచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+