రోజుకు రూ.5000 ఇస్తేనే కాపురం చేయినిస్తా.. రూల్ పెట్టిన భార్య, భర్త ఏం చేశాడంటే..!
బెంగళూరులో ఓ భార్య తన భర్తను కాపురం చేయాలంటే రోజుకు రూ.5000 ఇవ్వాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా, విడాకులు కావాలంటే రూ.45 లక్షలు ఇవ్వాలని షరతు పెట్టింది. దీంతో విసిగిపోయిన భర్త పోలీసులను ఆశ్రయించాడు.భార్య రోజుకు రూ.5000 ఇస్తేనే కాపురం చేస్తానని, లేదంటే రూ.45 లక్షలు ఇచ్చి విడాకులు తీసుకోవాలని వేధిస్తోందని భర్త ఆరోపిస్తున్నాడు.ఆమె తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తోంది.ఆమె కారణంగా ఉద్యోగం పోయింది.ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోంది.ప్రైవేటు భాగాలపై దాడిచేసి చంపడానికి ప్రయత్నిస్తోంది.
పిల్లలను కనడానికి నిరాకరిస్తూ, 60 ఏళ్ల వయసులో దత్తత తీసుకుందామని అంటోందని ఆయన తెలిపాడు.దీనిపై భార్య వాదన మరోలా ఉంది. భర్త, అత్తమామలు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కాపురానికి ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని తెలిపింది.పెళ్లి సమయంలో తన తండ్రిరూ.40 లక్షలు కట్నంగా ఇచ్చారని, కనీసం సరైన తిండి కూడా పెట్టడం లేదని ఆరోపించింది. మరో పెళ్లి చేసుకోడానికే తప్పుడు ఫిర్యాదు చేశాడని, ఆడియోలు, వీడియోలను ఎడిట్ చేసి తనపై నిందలు వేస్తున్నాడని మండిపడింది.

డబ్బులు ఖర్చంటే వారికి భయమని, ఇంటిల్లిపాదీ రోజుకు అర లీటరు పాలతోనే సరిపెట్టుకుంటారని, అన్నం విషయంలోనూ రాద్ధాంతం చేస్తుంటారని వెల్లడించింది. భర్త తనను శారీరకంగా వేధిస్తున్నాడని, అతను ఇంట్లో ప్రతి క్షణం రికార్డ్ చేసేవాడని, అతనికి అనుమానం ఎక్కువని తెలిపింది.ఈ సంఘటన బెంగళూరులో చర్చనీయాంశంగా మారడమే కాక, ఆధునిక వైవాహిక సమస్యలపై ఆలోచనకు తావిస్తోంది.2022లో పెద్దలు కుదిర్చిన పెళ్లి ద్వారా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే, ఈ వివాదం ఇప్పుడు వారి వైవాహిక జీవితంలో పెను సవాలుగా మారింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications