టాయిలెట్ లేదా విడాకులు: భార్య డిమాండ్, లక్ష రివార్డ్

ఈ విషయం తెలిసిన సులభ్ ఇంటర్నేషనల్ వారి ఇంట్లో టాయిలెట్ కట్టించడంతో పాటు సదరు మహిళకు లక్ష రూపాయల రివార్డ్ ఇచ్చారు.
దీనిపై సదరు మహిళ భర్త అలక్ నిరంజన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంట్లో ఇప్పుడు టాయిలెట్ ఉండటం వల్ల తన భార్య ఇప్పుడు తనను విడాకులు డిమాండ్ చేయదని, ఇప్పుడు తాను సంతోషంగా ఉండవచ్చునని వ్యాఖ్యానించారు. టాయిలెట్ లేకుంటే తన భార్య విడాకులు ఇస్తానని చెప్పిందని, చివరకు తనను ఓ సంస్థ విడాకులు ఇచ్చే అవసరం లేకుండా కాపాడిందని, టాయిలెట్ నిర్మాణం పైన తన భార్య కూడా సంతోషంగా ఉందని చెప్పాడు.
కాగా, ఈ మహిళ గత నెల పాట్నాలోని మహిళా హెల్ప్ లైన్‌ను సంప్రదించి... తన భర్త టాయిలెట్ నిర్మించలేక పోతున్నారని, తనకు పలుమార్లు చెబుతున్నప్పటికీ టాయిలెట్ కట్టడం లేదని, తనకు విడాకులు ఇప్పించేందుకు సహకరించాలని కోరింది.
ఈ విషయం తెలిసిన సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వరి పాఠక్ సంస్థ తరఫున టాయిలెట్ నిర్మించి ఇచ్చారు. టాయిలెట్ కోసం విడాకులు తీసుకుంటానని మహిళ చెప్పినందునే తాము నిర్మించి ఇచ్చామని పాఠక్ తెలిపారు.
తాను 2009 నుండి టాయిలెట్ నిర్మించి ఇవ్వారని భర్తను కోరుతున్నానని, పలుమార్లు తనకు హామీ ఇచ్చి ఇప్పటి వరకు నిర్మించలేదని, అందుకే తాను అతనితో జీవించదల్చుకోలేదని మహిళా హెల్ప్ లైన్‌ను కలిసి ఆ మహిళ చెప్పారు. అయితే డబ్బులు లేనందువల్ల తాను టాయిలెట్ నిర్మించలేకపోయినట్లు భర్త చెప్పాడు.












Click it and Unblock the Notifications