Wife: మాజీ భార్య బాయ్ ఫ్రెండ్స్ ఎవరు ?, జీపీఎస్ ఎక్కడ సెట్ చేశాడంటే, సిమ్ కార్డుతో కంత్రీ మొగుడు !

గురుగ్రామ్/ చెన్నై: డాక్టర్ గా పని చేస్తున్న భార్య ప్రవర్తన మీద భర్తకు అనుమానం పెరిగిపోయింది. అనుమానపు పిచాచితో కలిసి జీవించలేనని డిసైడ్ అయిన డాక్టర్ ఆమె భర్తతో విడిపోవాలని డిసైడ్ అయ్యింది. దంపతులు వేర్వేరుగా జీవిస్తున్నారు. నా మాజీ భార్య ఏం చేస్తోంది ? ఎక్కడెక్కడికి వెలుతోంది ?, ఎవరిని కలుస్తోంది ? అని కనిపెట్టాలని ఆమె మాజీ భర్త అనుకున్నాడు. మాజీ భార్య తిరుగుతున్న కారులో సీక్రేట్ గా జీపీఎస్ పరికరం అమర్చాడు. అప్పటి నుంచి మాజీ భార్య ఎక్కడెక్కడికి వెలుతుందో అనే విషయాన్ని ఆమె మాజీ భర్త ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు. కారు దిగుతున్న లేడీ డాక్టర్ మొబైల్ ఫోన్ ను కారులో జారవిడించింది. గేర్ బాక్స్ దగ్గర మొబైల్ వెతుక్కుంటున్న సమయంలో జీపీఎస్ పరికరం ఆమె కంట్లో పడింది. జీపీఎస్ ను తీసి చూడగా ఆమె షాక్ అయ్యింది. తన మాజీ కారు డ్రైవర్ సహాయంతో తన మాజీ కంత్రీ మొగుడు కారులో జీపీఎస్ పరికరం పెట్టాడని తెలుసుకున్న తెలుసుకున్న లేడీ డాక్టర్ ఆమె మాజీ భర్త మీద కేసు పెట్టడంతో కథ రసవత్తరంగా మారింది.

లేడీ డాక్టర్ ఫ్యామిలీ

లేడీ డాక్టర్ ఫ్యామిలీ

గురుగ్రామ్ లో రూపా, స్వరూప్ కుమార్ (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. రూపా డాక్టర్ గా పని చేస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం రూపా, స్వరూప్ కుమార్ కు వివాహం జరిగింది. డాక్టర్ గా పని చేస్తున్న రూపా రోగులకు చికిత్స చెయ్యడానికి ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్లడం ఆమె భర్త స్వరూప్ కుమార్ కు నచ్చలేదని సమాచారం.

 అనుమానపు పిచాచి వద్దేవద్దు

అనుమానపు పిచాచి వద్దేవద్దు

భార్య రూపా ప్రవర్తన మీద ఆమె భర్త స్వరూప్ కుమార్ కు రానురాను అనుమానం పెరిగిపోయింది. ఇదే విషయంలో రూపా, స్వరూప్ కుమార్ ల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయని సమాచారం. అనుమానపు పిచాచి అయిన భర్త స్వరూప్ కుమార్ తో కలిసి జీవించలేనని డిసైడ్ అయిన డాక్టర్ రూపా ఆమె భర్తతో విడిపోవాలని డిసైడ్ అయ్యింది.

నా భార్య ఎవరితో కలుస్తోంది ?, వాళ్లతో ఏం చేస్తోంది

నా భార్య ఎవరితో కలుస్తోంది ?, వాళ్లతో ఏం చేస్తోంది


రూపా, స్వరూప్ కుమార్ దంపతులు వేర్వేరుగా జీవిస్తున్నారు. ఇద్దరు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. నా మాజీ భార్య రూపా ఏం చేస్తోంది ? ఎక్కడెక్కడికి వెలుతోంది ?, ఎవరిని కలుస్తోంది ? అని కనిపెట్టాలని ఆమె మాజీ భర్త స్వరూప్ కుమార్ అనుకున్నాడు. రూపాను వెంబడించి ఆమె దినచర్య కనుక్కోవడం కష్టం అని అనుకున్న స్వరూప్ కుమార్ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు.

మాజీ భార్య కారులో జీపీఎస్ సెట్ చేసిన కంత్రీ మొగుడు

మాజీ భార్య కారులో జీపీఎస్ సెట్ చేసిన కంత్రీ మొగుడు


భార్య రూపాకు దూరం అయ్యే సమయంలో స్వరూప్ కుమార్ అతని కారు కూడా ఆమెకే ఇచ్చేశాడని సమాచారం. మాజీ భార్య రూపా తిరుగుతున్న కారులో స్వరూప్ కుమార్ సీక్రేట్ గా జీపీఎస్ పరికరం అమర్చాడు. అప్పటి నుంచి మాజీ భార్య రూపా ఎక్కడెక్కడికి వెలుతుందో అనే విషయాన్ని ఆమె మాజీ భర్త స్వరూప్ కుమార్ అతని మొబైల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు.

మొబైల్ దెబ్బతో జీపీఎస్ పరికరం చిక్కిపోయింది

మొబైల్ దెబ్బతో జీపీఎస్ పరికరం చిక్కిపోయింది

ఇటీవల ఓ రోగిని కలవడానికి రూపా స్వయంగా కారు నడుపుకుంటూ ఓ చోటకు వెళ్లింది. కారు దిగుతున్న లేడీ డాక్టర్ రూపా మొబైల్ ఫోన్ ను కారులో జారవిడించింది. ఆ సమయంలో రూపా ఆమె కారులో మొబైల్ ఫోన్ వెతకడానికి ప్రయత్నించింది. కారు గేర్ బాక్స్ దగ్గర మొబైల్ వెతుక్కుంటున్న సమయంలో జీపీఎస్ పరికరం డాక్టర్ రూపా కంట్లో పడింది. జీపీఎస్ ను తీసి చూడగా ఆమె షాక్ అయ్యింది.

ఫోటోలు, మ్యాప్ లు చూసి షాక్

ఫోటోలు, మ్యాప్ లు చూసి షాక్

రూపా జీపీఎస్ పరికరం బయటకు లాగి దానిని ఆమె సోదరుడి చేతికి ఇచ్చింది. జీపీఎస్ పరికరం ఓపెన్ చేసి చూడగా అందులో సిమ్ కార్డు బయటపడింది. జీపీఎస్ పరికరంలో కొన్ని ఫోటోలతో పాటు మ్యాప్ లు ఉండటంతో రూపాకు ఆమె మాజీ భర్త స్వరూప్ కుమార్ మీద అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

భర్తకు బ్యాండ్ బాజా మొగింది

భర్తకు బ్యాండ్ బాజా మొగింది

తన మాజీ కారు డ్రైవర్ సహాయంతో తన మాజీ కంత్రీ మొగుడు స్వరూప్ కుమార్ కారులో జీపీఎస్ పరికరం పెట్టాడని, అతను తన ప్రవర్తన మీద ఇంకా అనుమానిస్తున్నాడని తెలుసుకున్న లేడీ డాక్టర్ రూపా రగిలిపోయింది. రూపా ఆమె మాజీ భర్త స్వరూప్ కుమార్ మీద కేసు పెట్టింది. అనుమతి లేకుండా మాజీ భార్య వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నాడని లేడీ డాక్టర మాజీ భర్త మీద కేసు నమోదు కావడంతో కథ రసవత్తరంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+