Wife: లవ్ మ్యారేజ్, హ్యాండ్ ఇచ్చిన భార్య, ఈ జీవితం ఊహించలేను, వీడియో తీసి భర్త ఆత్మహత్య !

చెన్నై/కడలూరు: కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించుకున్న యువతి, యువకుడు పెళ్లి చేసుకోవలని డిసైడ్ అయ్యారు. వివాహం చేసుకుంటామని ప్రేమికులు వాళ్ల ఇళ్లల్లో చెప్పారు. ప్రేమికుల పెళ్లి చేసుకోవడానికి పెద్దలు నిరాకరించారు. అయితే ప్రేమికులు మొండిపట్టుపట్టి కొంతకాలం ఇళ్లల్లో గొడవలు చేసి పెద్దలను పెళ్లికి అంగీకరించేలా చేశారు. పెద్దలు పెళ్లికి అంగీకరించిన తరువాత సంతోషంగా పెళ్లి చేసుకున్న దంపతులు 10 ఏళ్లపాటు చక్కగా కాపురం చేశారు. అయితే దంపతుల మధ్య ఓ విషయంలో తేడా వచ్చింది. ఇరు వైపుల కుటుంబ సభ్యులు దంపతులకు నచ్చచెబుతూ వచ్చారు. అయితే దంపతుల కాపురం మాత్రం నిలబడలేదు. ఇలాంటి మొగుడు నాకు వద్దు అంటూ భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య ఇలా చెయ్యడంతో తట్టుకోలేకపోయిన భర్త ఇలాంటి జీవితాన్ని తాను ఊహించుకోలేను, నేను ఎవ్వరికీ భారం కాకూడదు, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ వీడియో తీసి స్నేహితులకు షేర్ చేసి పురుగుల మందు తాగేశాడు.

పక్కపక్క ఊర్లలో ప్రేమికులు

పక్కపక్క ఊర్లలో ప్రేమికులు


తమిళనాడులోని కడలూరు జిల్లాలోని పర్రూటి సమీపంలోని పుదుపిళై యారుకుప్పంలో రామలింగం అనే ఆయన నివాసం ఉంటున్నాడు. రామలింగం కుమారుడు మోహన్ రాజ్. పనికుప్పంలో సంధ్యా అనే యువతి నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం మోహన్ రాజ్, సంధ్యాకు పరిచయం కావడంతో తరువాత ఇద్దరు ప్రేమించుకున్నారు.

 పంతం సాధించుకున్న ప్రేమికులు

పంతం సాధించుకున్న ప్రేమికులు

కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించుకున్న మోహన్ రాజ్, సంధ్యా పెళ్లి చేసుకోవలని డిసైడ్ అయ్యారు. వివాహం చేసుకుంటామని ప్రేమికులు మోహన్ రాజ్, సంధ్యా వాళ్లవాళ్ల ఇళ్లల్లో చెప్పారు. ప్రేమికులు మోహన్ రాజ్, సంధ్యా పెళ్లి చేసుకోవడానికి ఇరు కుటుంబాల పెద్దలు నిరాకరించారు. అయితే ప్రేమికులు మోహన్ రాజ్, సంధ్యా మొండిపట్టుపట్టి కొంతకాలం ఇళ్లల్లో గొడవలు చేసి పెద్దలను పెళ్లికి అంగీకరించేలా చేశారు.

10 ఏళ్ల క్రితం గ్రాండ్ గా పెళ్లి

10 ఏళ్ల క్రితం గ్రాండ్ గా పెళ్లి

పెద్దలు పెళ్లికి అంగీకరించిన తరువాత మోహన్ రాజ్, సంద్యా సంతోషంగా పెళ్లి చేసుకున్నారు. మోహన్ రాజ్, సంద్యా దంపతులు ఇన్ని సంవత్సరాలు చక్కగా కాపురం చేశారు. అయితే మోహన్ రాజ్, సంధ్యా దంపతుల మధ్య ఆడపిల్ల కావాలని, లేదు మగబిడ్డ కావాలనే విషయంలో తేడా వచ్చింది. ఇరు వైపుల కుటుంబ సభ్యులు మోహన్ రాజ్, సంధ్యా దంపతులకు నచ్చచెబుతూ వచ్చారు.

విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన భార్య

విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన భార్య

పిల్లలు పుట్టే విషయంలో రానురాను మోహన్ రాజ్, సంధ్యా దంపతుల మధ్య గొడవలు ఎక్కువ కావడంతో వాళ్ల కాపురంలో చిచ్చురేపింది. పెద్దలు పంచాయితీలు చేసినా మోహన్ రాజ్, సంధ్యా దంపతుల మధ్య రాజీ కుదరలేదు. అయితే మోహన్ రాజ్, సంధ్యా దంపతుల కాపురం మాత్రం నిలబడలేదు. మోహన్ రాజ్ లాంటి మొగుడు నాకు వద్దు అంటూ సంధ్యా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది.

 వీడియో తీసి పురుగుల మందు తాగేసిన భర్త

వీడియో తీసి పురుగుల మందు తాగేసిన భర్త

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య సంధ్యా తనను మోసం చేసిందని ఆమె భర్త మోహన్ రాజ్ ఆవేదన చెందాడు. నా భార్య సంధ్యా ఇలా చెయ్యడంతో తట్టుకోలేకపోతున్నానని, ఇలాంటి జీవితాన్ని తాను ఊహించుకోలేనని, నేను ఎవ్వరికీ భారం కాకూడదు, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ ఈనెల 20వ తేదీన వీడియో తీసిన మోహన్ రాజ్ అతని స్నేహితులకు షేర్ చేసి పురుగుల మందు తాగేశాడు.

భర్త ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి

భర్త ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి

విషయం తెలుసుకున్న మోహన్ రాజ్ ను అతని స్నేహితులు పర్రూటీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన మోహన్ రాజ్ చివరికి ప్రాణాలు వదిలేశాడని పోలీసులు అంటున్నారు. మోహన్ రాజ్ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+