Daughter: కూతురిని చెరువులో విసిరేసి తండ్రి ?, భార్యతో గొడవపడి టెక్కీ ఏం చేశాడంటే ?

బెంగళూరు/కోలారు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కుమార్తె ఉంది. ఉద్యోగం చెయ్యడానికి భర్త అతని భార్య, కూతురితో కలిసి ఐటీ హబ్ వచ్చాడు. అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న వ్యక్తి అతని భార్య, కూతురితో చాలా సంతోషంగా జీవించాడు. అయితే ఇటీవల దంపతుల మద్య ఓ విషయంలో గొడవలు మొదలైనాయి. కూతురిని స్కూల్ లో వదిలిపెట్టి వస్తానని భర్త ఇంటి నుంచి కారులో బయలుదేరాడు. పక్కజిల్లాలో చెరువులో కూతురు శవమై కనిపించింది. చిన్నారి తండ్రి శవం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 గుజరాత్ టూ బెంగళూరు

గుజరాత్ టూ బెంగళూరు

గుజరాత్ కు చెందిన రాహుల్ కొన్ని సంవత్సరాల క్రితం శిల్పా (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రాహుల్, శిల్పా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. ఉద్యోగం చెయ్యడానికి రాహుల్ అతని భార్యతో కలిసి ఐటీ హబ్ సమీపంలోని హోసకోటే సమీపంలోని ఎన్ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.

 ఫ్యామిలీలో గొడవలు

ఫ్యామిలీలో గొడవలు

రాహుల్, శిల్పా దంపతులకు మూడు సంవత్సరాల వయసు ఉన్న జియా అనే కుమార్తె ఉంది. బాగలూరు సమీపంలోని కణ్ణూరులో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న రాహుల్ అతని భార్య, కూతురితో చాలా సంతోషంగా జీవించాడు. రాహుల్, శిల్పా దంపతులకు కుమార్తె సమీపంలోని ప్లే స్కూల్ కు వెళ్లి వస్తోంది.

 ఇంటి నుంచి వెళ్లి మాయం అయిన భర్త

ఇంటి నుంచి వెళ్లి మాయం అయిన భర్త

మంగళవారం రాహుల్ అతని కుమార్తె జియాను ప్లేస్కూ ల్ లో వదిలిపెట్టి వస్తానని కారులో ఇంటి నుంచి బయలుదేరాడు. తరువాత రాహుల్, అతని కుమార్తె ఆచూకి లేకపోవడంతో అతని భార్యతో పాటు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చెయ్యడంతో కోలారు గ్రామీణ జిల్లాలోని బెంగళూరు-చెన్నై హైవేలోని కందట్టి చెరువు సమీపంలో రాహుల్ కారు కనపడింది.

 చెరువులో శవమైన కూతురు

చెరువులో శవమైన కూతురు

కారు పార్క్ చేసిన సమీపంలోని చెరువులో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలించారు. చెరువలో జియా (3) శవమై కనిపించింది. చెరువు చాలా పెద్దది కావడంతో రాహుల్ కోసం పోలీసలు గాలిస్తున్నారు. కొంతకాలం నుంచి రాహుల్ అతని భార్యతో గొడవ పడుతున్నాడని, ఇద్దరి మద్య రాద్దాంతం జరుగుతోందని పోలీసులు అన్నారు.

 ఆత్మహత్య చేసుకున్నాడా ?, ఎస్కేప్ అయ్యాడా

ఆత్మహత్య చేసుకున్నాడా ?, ఎస్కేప్ అయ్యాడా

ఆరు నెలల నుంచి ఉద్యోగానికి కూడా వెళ్లడం లేదని, ఇంటిలోని బంగారు నగలు చాలా వరకు కుదవ పెట్టాడని పోలీసులు అన్నారు. జియాను చెరువులో విసిరేసి హత్య చేసిన రాహుల్ అతను ఆత్మహత్య చేసుకున్నాడా ?, లేక పారిపోయాడా ? అనే కోణంలో కోలారు గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+