Wife: భార్య మీద అనుమానం, వీడు నా కొడుకేనా ?, నా పోలీకలు, నా కలర్ లేదే ?, లాభం లేదని !

చెన్నై/ చిదంబరం: కొడుకు పుట్టాడని ఆనందంలో తండ్రి పరిగెత్తుకుంటూ ఆసుపత్రికి వెళ్లాడు. బిడ్డను చూసిన తండ్రి షాక్ అయ్యాడు. మొదటి నుంచి భార్య మీద అనుమానం ఎక్కువగా ఉన్న భర్తకు కొడుకును చూసిన తరువాత అనుమానం మరింత పెరిగిపోయింది. వీడు నా కొడుకేనా ?, నా పోలికలు, నా కలర్ ఏ మాత్రం లేవని రగిలిపోయాడు. ఇంటికి వచ్చిన భార్యతో ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్న భర్త అన్నంత పని చేశాడు. మొగుడు చేసిన పనికి భార్యతో పాటు అందరూ హడలిపోయారు.

 శివరంజని, రాజేష్

శివరంజని, రాజేష్

తమిళనాడులోని చిదంబరంలో రాజేష్, శివరంజని దంపతులు నివాసం ఉంటున్నారు. తనకంటే చూడటానికి శివరంజని చాలా అందంగా ఉంటుందని మొదటి నుంచి భర్త రాజేష్ కు కొంచెం అసూయ. దానికితోడు ప్రతిరోజూ భార్య శివరంజని శుభ్రంగా స్నానం చేసి టిప్పుటాప్ గా రెడీ కావడంతో భర్త రాజేష్ కు అనుమానం ఉండేది.

 నీకు కొడుకు పుట్టాడు

నీకు కొడుకు పుట్టాడు

శివరంజని మీద భర్తకు మొదటి నుంచి అనుమానం ఉండేది. ఇదే సమయంలో శివరంజని గర్బవతి అయ్యింది. చిదంబరంలోని ఆసుపత్రిలో శివరంజని పండంటి బిడ్డను జన్మనిశ్చింది. నీకు కొడుకు పుట్టాడని, వెంటనే వచ్చి చూడాలని భార్య శివరంజని, ఆమె కుటుంబ సభ్యులు భర్త రాజేష్ కు ఫోన్ చేసి చెప్పారు.

 దేవుడా.... వీడు నా కొడుకేనా ?

దేవుడా.... వీడు నా కొడుకేనా ?

కొడుకు పుట్టాడని ఆనందంలో రాజేష్ పరిగెత్తుకుంటూ ఆసుపత్రికి వెళ్లాడు. బిడ్డను చూసిన రాజేష్ షాక్ అయ్యాడు. మొదటి నుంచి భార్య శివరంజని మీద అనుమానం ఎక్కువగా ఉన్న భర్త రాజేష్ కు కొడుకును చూసిన తరువాత అనుమానం మరింత పెరిగిపోయింది. వీడు నా కొడుకేనా ?, నా పోలికలు, నా కలర్ ఏ మాత్రం లేవని రాజేష్ రగిలిపోయాడు. ఆసుపత్రిలో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఇంటికి వెళ్లిపోయాడు. శివరంజనిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ చెయ్యడంతో ఆమె ఇంటికి వెళ్లింది.

 బిడ్డను చంపేసి కిరాతకుడు

బిడ్డను చంపేసి కిరాతకుడు

ఇంటికి వచ్చిన భార్య శివరంజనితో ఎక్కువగా మాట్లాడకుండా రెండు రోజులు రాజేష్ సైలెంట్ గా ఉన్నాడు. రాత్రి శివరంజని బిడ్డకు పాలు తాగించి నిద్రపోయింది. ఆ సమయంలో నిద్రపోతున్న చిన్నారిని ఎత్తుకున్న రాజేష్ కిందకు వేసి విసిరికొట్టాడు. పసికందు అనే కనికరం లేకుండా చిన్నారి గొంతును బ్లేడ్ తో కోసేశాడు.

 భార్య మీద అనుమానంతోనే

భార్య మీద అనుమానంతోనే

పక్కన పిల్లవాడు లేని విషయం గమనించిన శివరంజని మంచం కిందకు చూసింది. చలనం లేకుండా పడి ఉన్న బిడ్డను చూసి కేకలు వేసింది. వెంటనే శివరంజని, కుటుంబ సభ్యులు చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బిడ్డ చనిపోయాడని వైద్యులు చెప్పారు. తన పోలికలు లేవని, ఈ బిడ్డ తనకు పుట్టలేదని తానే చిన్నారిని చంపేశానని రాజేష్ అంగీకరించాడని పోలీసులు అంటున్నారు. పురిటి బిడ్డను దారుణంగా చంపేసిన రాజేష్ కు పోలీసులు బెండ్ తీసి అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+