Wife: అత్తారింటిలో గొంతు కోసుకున్న అల్లుడు, చీటికిమాటికి పారిపోతున్న భార్య, అసలు మ్యాటర్ !

వేలూరు/చిత్తూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులకు ఓ కూతురు ఉంది. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. గొడవ పడుతున్న దంపతులు సర్దుకుపోతున్నారు. కొంతకాలం నుంచి భర్తతో గొడవ పడుతున్న భార్య పుట్టింటికి వెళ్లడం, కొంతకాలం తరువాత మళ్లీ భర్త ఇంటికి వెళ్లడం చేస్తోంది. ఇటీవల భర్తతో గొడవపడిన భార్య ఆమె కూతురిని పిలుచుకుని పుట్టింటికి వెళ్లి అక్కడే మకాం వేసింది. మన ఇంటికి రావాలని భర్త పదేపదే అతని భార్యకు ఫోన్ చేసి మనవి చేస్తూనే ఉన్నాడు. నేను నీతో కాపురం చెయ్యను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ భార్య తెగేసి చెప్పింది. నేరుగా భార్య పుట్టింటి దగ్గరకు వెళ్లిన భర్త అక్కడ అతని భార్యతో గడవ పెట్టుకుని కత్తి తీసుకుని అతని గొంతు కోసుకోవడం కలకలం రేపింది.

 12 ఏళ్ల క్రితం పెళ్లి

12 ఏళ్ల క్రితం పెళ్లి

తమిళనాడులోని వేలూరు జిల్లా సమీపంలోని రాణిపేట జిల్లాలోని వాలాజీపేట్ సమీపంలో దేవదానం ప్రాంతంలో నదియా (30) అనే యువతి నివాసం ఉంటున్నది. 12 సంవత్సరాల క్రితం కాంచీపురం జిల్లాలోని ఉత్తరమేరూర్ సమీపంలోని అవతంబాక్కంలో నివాసం ఉంటున్న సభాపతి అనే వ్యక్తితో నదియా వివాహం జరిగింది.

 ఐదవ తరగతి చదువుతున్న కూతురు

ఐదవ తరగతి చదువుతున్న కూతురు

వివాహం చేసుకున్న నదియా, సభాపతి దంపతులు కాంచీపురం జిల్లాలోని భర్త ఇంటిలోనే నివాసం ఉంటూ సంతోషంగా కాపురం చేశారు. సభాపతి, నదియా దంపతులకు ఐదవ తరగతి చదువుతున్న కూతురు ఉంది. మూడు సంవత్సరాల నుంచి సభాపతి, నదియా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

 చీటికిమాటికి పుట్టింటికి పారిపోతున్న భార్య

చీటికిమాటికి పుట్టింటికి పారిపోతున్న భార్య

గొడవ పడుతున్న నదియా, సభాపతి దంపతులు సర్దుకుపోతున్నారు. కొంతకాలం నుంచి భర్త సభాపతి తో గొడవ పడుతున్న అతని భార్య నదియా వాలాజీపేటలోని ఆమె పుట్టింటికి వెళ్లడం, కొంతకాలం తరువాత మళ్లీ కాంచీపురం జిల్లాలోని భర్త ఇంటికి వెళ్లడం చేస్తోంది. చీటికిమాటికి నదియా పుట్టింటికి వెళ్లడం మొదలు పెట్టడంతో సభాపతి విసిగిపోయాడు.

 ఏం చేసుకుంటావో చేసుకో ?

ఏం చేసుకుంటావో చేసుకో ?

ఇటీవల భర్త సభాపతితో గొడవపడిన నదియా ఆమె కూతురిని పిలుచుకుని వాలాజీపేట్ లోని ఆమె పుట్టింటికి వెళ్లి అక్కడే మకాం వేసింది. మన ఇంటికి రావాలని సభాపతి పదేపదే అతని భార్య నదియాకు ఫోన్ చేసి మనవి చేస్తూనే ఉన్నాడు. నేను నీతో కాపురం చెయ్యను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ నదియా ఆమె భర్త సభాపతికి తెగేసి చెప్పింది.

 అత్తారింటి ముందు గొంతు కోసుకున్న అల్లుడు

అత్తారింటి ముందు గొంతు కోసుకున్న అల్లుడు

నేరుగా వాలాజీపేట్ లోని భార్య నదియా పుట్టింటి దగ్గరకు వెళ్లిన సభాపతి అక్కడ అతని భార్యతో గడవ పెట్టుకున్నాడు. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన సభాపతి కత్తి తీసుకుని అతని గొంతు కోసుకోవడం కలకలం రేపింది. వెంటనే సభాపతిని రాణిపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సభాపతి పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని వేలూరు ఆసుపత్రికి తరలించారు. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని, అందుకే ఎక్కువ పుట్టింటికి వెళ్లిపోతుందని సభాపతి ఆరోపిస్తున్నాడని అతని బంధువులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+