Wife: ఆరు నెలల క్రితం పెళ్లి, నెల ముందు భార్య ఆత్మహత్య, ప్రాణానికి ప్రాణం అని ?, డెత్ నోట్ రాసి !
చెన్నై/మదురై: కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడుకుని యువతి, యువకుడి పెళ్లి చెయ్యాలని అనుకున్నారు. అందంగా ఉన్న అమ్మాయి తనను పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుసుకున్న యువకుడు ఎగిరి గంతేశాడు. ఆరు నెలల క్రితం యువతి, యువకుడికి గ్రాండ్ గా వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుంచి భార్య అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త ఆమె వెంటే ఉంటున్నాడు. జీవితాంతం తన భార్యతో సంతోషంగా జీవించాలని, ఈ జీవితానికి ఇది చాలని భర్త అతని స్నేహితుల దగ్గర పదేపదే చెబుతున్నాడు. నెల రోజుల క్రితం భార్య ఆత్మహత్య చేసుకుంది. వివాహం జరిగిన ఐదు నెలలకే భార్య ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె భర్త హడలిపోయాడు. తన భార్య లేని జీవితం నేను ఊహించుకోలేనని, నేను కూడా నా భార్య దగ్గరకు వెళ్లిపోతానని భర్త అతని స్నేహితులు, బంధువుల దగ్గర చెబుతున్నాడు. భార్య చనిపోయిందని ఆవేదనతో ఇలా మాట్లాడుతున్నాడని అనుకున్న స్నేహితులు అతనికి నచ్చ చెబుతూ అతని మనసు మార్చడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో పాడుపడిన బావిలో భర్త కూడా శవమై కనిపించడం కలకలం రేపింది.

ఆరు నెలల క్రితం పెళ్లి కోసం చర్చలు
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలోని ఉలందరూపేట్ సమీపంలోని గుణమంగళం గ్రామంలో హరిగోవిందన్ (27) అనే యవకుడు నివాసం ఉంటున్నాడు. మేస్త్రీ పని చేస్తున్న హరిగోవిందన్ డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు. తమిళనాడులోని కుంభకోణంలో కీర్తనా (24) అనే యువతి నివాసం ఉంటున్నది. హరిగోవిందన్, కీర్తనాకు వివాహం చెయ్యాలని కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడుకుని వాళ్లకు పెళ్లి చెయ్యాలని చర్చించుకున్నారు.

ఎగిరి గంతేసిన యువకుడు
హరిగోవిందన్ ను వివాహం చేసుకోవడానికి కీర్తనా అంగీకరించింది. అందంగా ఉన్న అమ్మాయి కీర్తనా తనను పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుసుకున్న హరిగోవిందన్ ఎగిరి గంతేశాడు. ఆరు నెలల క్రితం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో కుంభకోణంలో కీర్తనా, హరిగోవిందన్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది.

నా భార్యతో జీవితాంతం జీవించాలి
వివాహం జరిగినప్పటి నుంచి భార్య కీర్తనా అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న ఆమె భర్త హరిగోవిందన్ ఆమె వెంటే ఎక్కువగా ఉంటున్నాడు. జీవితాంతం తన భార్య కీర్తనాతో సంతోషంగా జీవించాలని, ఈ జీవితానికి ఇది చాలని హరిగోవిందన్ అతని స్నేహితులు, బంధువుల దగ్గర పదేపదే చెబుతున్నాడు.

ఆత్మహత్య చేసుకున్న భార్య
వివాహం జరిగిన ఐదు నెలలకే కీర్తనా గర్బవతి అయ్యింది. తన భార్య గర్బవతి అయ్యిందని హరిగోవిందన్ మురిసిపోయాడు. నెల రోజుల క్రితం కీర్తనాకు అబార్షన్ అయ్యింది. బిడ్డ పుడుతాడని ఆనందంలో ఉన్న కీర్తనాకు అబార్షన్ కావడంతో ఆమె ఆవేదన చెందింది. నెల రోజుల క్రితం కీర్తనా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె భర్త హరిగోవిందన్ షాక్ కు గురైనాడు.

భార్యలేని జీవితం ఊహించుకోలేనని భర్త ఆవేదన
తన భార్య కీర్తనా లేని జీవితం నేను ఊహించుకోలేనని, నేను కూడా నా భార్య దగ్గరకు వెళ్లిపోతానని హరిగోవిందన్ అన్నం తినకుండా పనికి వెళ్లకుండా పదేపదే ఆ విషయాన్ని అతని స్నేహితులు, బంధువుల దగ్గర చెబుతున్నాడు. భార్య కీర్తనా చనిపోయిందని ఆవేదనతో హరిగోవిందన్ ఇలా మాట్లాడుతున్నాడని అనుకున్న స్నేహితులు అతనికి నచ్చ చెబుతూ అతని మనసు మార్చడానికి అనేక ప్రయత్నాలు చేశారు.

భార్య సమాధి పక్కనే ఆత్మహత్య చేసుకున్న భర్త
రాత్రి 11 గంటల సమయంలో హరిగోవిందన్ ఇంటి నుంచి వెళ్లాడు. తరువాత అతని కోసం కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేదు, ఫోన్ చేసినా హరిగోవిందన్ రిసీవ్ చెయ్యకపోవడంతో అతని కోసం గాలించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఇంటికి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం కీర్తనాను సమాధి చేసిన సమీపంలోని పాడుపడిన బావిలో హరిగోవిందన్ శవమై కనిపించడం కలకలం రేపింది. తన భార్య కీర్తనా లేని జీవితం నేను ఊహించుకోలేనని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని హరిగోవిందన్ డెత్ నోట్ రాసి పెట్టాడని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications