Lady techie: రూ. లక్షల్లో జీతాలు. అక్రమ సంబంధంతో లేడీ టెక్కీ ఆత్మహత్య, భర్తకు ?

బెంగళూరు: ప్రముఖ ఐటీ కంపెనీల్లో యువతి, యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. యువతి, యువకుడు లక్షల్లో జీతాలు తీసుకోవడంతో ఇద్దరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. వివాహం చేసుకున్న దంపతులు కాపురం చేస్తున్నారు. రెండు వేర్వేరు కంపెనీల్లో దంపతులు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇటీవల అక్రమ సంబంధం విషయంలో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. ఇద్దరూ బాగా చదువుకుని టెక్కీలుగా పని చేస్తుండటంతో వారి జీవితాలు నాశనం కాకూడదని పెద్దలు రాజీ పంచాయితీలు చేశారు. అయితే ఇంట్లో లేడీ టెక్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి జరిగి సంవత్సరం కూడా పూర్తి కాకుండానే లేడీ టెక్కీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

 బెంగళూరులో ఉద్యోగాలు

బెంగళూరులో ఉద్యోగాలు

బెంగళూరులో నివాసం ఉంటున్న శ్వేతా (27) అనే యువతి ఐబీఎం కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నది. బెంగళూరులోని రామమూర్తి నగరలో నివాసం ఉంటున్న అభిషేక్ అనే యువకుడు టీసీఎస్ కంపెనీలో టెక్కీగా ఉద్యోగం చేస్తున్నాడు. శ్వేతా, అభిషేక్ కు పెళ్లి చెయ్యాలని ఇరువైపుల కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు.

 రూ. లక్షల్లో జీతాలు.... గ్రాండ్ గా పెళ్లి

రూ. లక్షల్లో జీతాలు.... గ్రాండ్ గా పెళ్లి

శ్వేతా, అభిషేక్ లక్షల్లో జీతాలు తీసుకోవడంతో 11 నెలల క్రితం ఇద్దరి పెళ్లి బెంగళూరులో చాలా గ్రాండ్ గా జరిగింది. వివాహం చేసుకున్న శ్వేతా, అభిషేక్ దంపతులు రామమూర్తినగర్ లోని రిచర్డ్ గార్డెన్ లో నివాసం ఉంటూ కాపురం చేస్తున్నారు. పెళ్లి జరిగిన తరువాత అభిషేక్, శ్వేతా వేర్వేరు కంపెనీల్లో దంపతులు ఉద్యోగాలు చేస్తున్నారు.

 భర్తకు అక్రమ సంబంధం

భర్తకు అక్రమ సంబంధం

ఇటీవల శ్వేతాకు ఆమె భర్త అభిషేక్ కు షాకింగ్ విషయం తెలిసింది. అభిషేక్ వేరే మహిళతో అక్రమ సంబందం పెట్టుకున్నాడని తెలుసుకున లేడీ టెక్కి శ్వేతా భర్తను నిలదీసింది. అక్రమ సంబంధం విషయంలో అభిషేక్, శ్వేతా దంపతుల మద్య గొడవలు రానురాను ఎక్కువ కావడంతో పెద్దలు జోక్యం చేసుకున్నారు.

 ఆత్మహత్య చేసుకున్న లేడీ టెక్కీ

ఆత్మహత్య చేసుకున్న లేడీ టెక్కీ

దంపతులు ఇద్దరూ బాగా చదువుకుని టెక్కీలుగా పని చేస్తుండటంతో వారి జీవితాలు నాశనం కాకూడదని శ్వేతా, అభిషేక్ పెద్దలు రాజీ పంచాయితీలు చేశారు. అయితే ఇంట్లో లేడీ టెక్కీ శ్వేతా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పెళ్లి జరిగి సంవత్సరం కూడా పూర్తి కాకుండానే లేడీ టెక్కీ శ్వేతా ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు అభిషేక్ మీద కేసు పెట్టారు. పెళ్లికాకముందు నుంచి అభిషేక్ కు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+