Wife: స్కూటర్ నడుపుతున్న భార్య, వెనుక కుర్చుని సైలెంట్ గా చంపేసిన భర్త, శవం పక్కనే కుర్చుని !

బెంగళూరు/ చిత్రదుర్గా: కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయిని వివాహం చేసుకున్న యువకుడు అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. అప్పుడప్పుడు భార్యను బయటకు పిలుచుకుని వెలుతున్న భర్త బయట పానీపూరీలు, చికెన్ పకోడాలు, చిరుతిండ్లు తింటూ రాత్రి ఇంటికి చేరుకుంటున్నారు. కొంతకాలం నుంచి దంపతుల మద్య సమస్యలు మొదలైనాయి. కుటుంబ సభ్యులు, బంధువులు దంపతులకు సర్దిచెబుతూ రాజీలు చేశారు. పెద్దలు బుద్దిమాటలు చెప్పిన తరువాత దంపతులు ఒకరి కోపం వచ్చిప్పుడు ఒకరు సైలెంటగా ఉండిపోతున్నారు. చాలా రోజుల నుంచి ఈ పద్దతిలో దంపతులు రాజీ ఫార్ములా పాటిస్తున్నారని తెలిసింది. సాయంత్రం భార్యను బయటకు పిలుచుకుని వెళ్లిన భర్త ఓ చోట పానీపూరీ తిన్నారని తెలిసింది. తరువాత స్కూటీ భార్యకు ఇచ్చిన భర్త నువ్వు స్కూటర్ డ్రైవ్ చెయ్యాలని చెప్పాడు. భార్య స్కూటర్ డ్రైవ్ చేస్తున్న సమయంలో అదే స్కూటర్ వెనుక కుర్చున్న భర్త దారుణానికి పాల్పడ్డాడు. ముందుగా తీసుకెళ్లిన కత్తి తీసుకుని భార్యను దారుణంగా పొడిచి చంపేసిన భర్త దర్జాగా అక్కడే ఉండిపోయాడు. స్కూటర్ నడుపుతున్న భార్యను ఆమె భర్త కత్తితో పొడిచి చంపేయడం కలకలం రేపింది.

ఇంట్లో సంబంధం చూసి పెళ్లి చేశారు

ఇంట్లో సంబంధం చూసి పెళ్లి చేశారు

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరెలోని బడామకాన్ ప్రాంతంలో మోహబూబ్ బాషా అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన అమీనా (30) అనే యువతితో మోహబూబ్ పాషా వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు చూసిన అమీనా అనే అమ్మాయిని వివాహం చేసుకున్న మోహబూబ్ పాషా అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు.

సంసారంలో చిన్నచిన్న గొడవలు

సంసారంలో చిన్నచిన్న గొడవలు


అప్పుడప్పుడు భార్య అమీనాను బయటకు పిలుచుకుని వెలుతున్న ఆమె భర్త మోహబూబ్ పాషా బయట పానీపూరీలు, చిరుతిండ్లు తింటూ రాత్రి ఇంటికి చేరుకుంటున్నారు. కొంతకాలం నుంచి అమీనా, మోహబూబా పాషా దంపతుల మద్య సమస్యలు మొదలైనాయి. కుటుంబ సభ్యులు, బంధువులు అమీనా, మోహబూబా పాషా దంపతులకు సర్దిచెబుతూ రాజీ పంచాయితీలు చేశారు.

దంపతుల రాజీ ఫార్ములా

దంపతుల రాజీ ఫార్ములా


పెద్దలు బుద్దిమాటలు చెప్పిన తరువాత అమీనా, మోహబూబా పాషా దంపతులు ఒకరి కోపం వచ్చిప్పుడు ఒకరు సైలెంటగా ఉండిపోతున్నారు. చాలా రోజుల నుంచి ఈ పద్దతిలో అమీనా, మోహబూబా పాషా దంపతులు రాజీ ఫార్ములా పాటిస్తున్నారని తెలిసింది. అమీనా, మోహబూబా పాషా దంపతుల కాపురం సర్దుకుంటున్నదని, ఇక ముందు వారు సంతోషంగా ఉంటారని అందరూ అనుకున్నారు.

భార్యను స్కూటర్ నడపని చెప్పిన భర్త ?

భార్యను స్కూటర్ నడపని చెప్పిన భర్త ?

శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉన్న భార్య అమీనాను బయటకు పిలుచుకుని వెళ్లిన భర్త మోహబూబ్ పాషా చెళ్లకెరెలోని ఓ చోట పానీపూరీ తిన్నారని తెలిసింది. తరువాత స్కూటీ భార్య అమీనాకు ఇచ్చిన భర్త మోహబూబ్ పాషా నువ్వు స్కూటర్ డ్రైవ్ చెయ్యాలని చెప్పాడు. భార్య అమీనా స్కూటర్ డ్రైవ్ చేస్తుకుంటూ చెళ్లకెరె పట్టణం దాటుకుని చెళ్లేకెరె గేట్ వరకు వెళ్లింది.

భార్యను దారుణంగా హత్య చేసిన భర్త

భార్యను దారుణంగా హత్య చేసిన భర్త


చెళ్లకెరె గేట్ సమీపంలో అమీనా స్కూటర్ నడుపుతున్న సమయంలో అదే స్కూటర్ వెనుక కుర్చున్న ఆమె భర్త మోహబూబ్ పాషా దారుణానికి పాల్పడ్డాడు. ముందుగా తీసుకెళ్లిన కత్తి తీసుకుని భార్య అమీనాను దారుణంగా పొడిచి చంపేసిన భర్త మోహబూబ్ పాషా దర్జాగా శవం పక్కనే ఉండిపోయాడు.

భర్త నోరు మాత్రం విప్పడం లేదు

భర్త నోరు మాత్రం విప్పడం లేదు

స్కూటర్ నడుపుతున్న భార్య అమీనాను ఆమె భర్త మోహబూబ్ పాషా కత్తితో పొడిచి చంపేయడం చెళ్లకెరెలో కలకలం రేపింది. అమీనాను మోహబూబ్ పాషా ఎందుకు హత్య చేశాడు ? అనే విషయం కచ్చితంగా తెలీడం లేదని, అతను పూర్తి సమాచారం ఇవ్వడం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+