Wife: గడ్డివాము వెనుక నుంచి వచ్చిన ఆంటీ, పొలంలో వెంటాడి చంపేసిన భర్త, రోజు సాయంత్రం !

బెంగళూరు/ గోకాక్: సంతోషంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. వివాహం జరిగిన 25 సంవత్సరాల తరువాత దంపతుల మద్య గొడవలు మొదలు కావడంతో వారి పిల్లలతో పాటు బంధువులు తలలు పట్టుకున్నారు. ప్రతిరోజూ సాయంత్రం అయితే దంపతులు ఏదో ఒక విషయానికి గొడవ పెట్టుకుంటున్నారు. ఇంటికి వెలుతున్న భర్త గొడవ పడందే నిద్రపోవడడం లేదు. గొడవలు ఎందుకు జరుగుతున్నాయో అనే విషయం దంపతులు ఇంత వరకు క్లారిటీగా చెప్పకపోవడంతో గ్రామ పెద్దలు సైతం వారికి పంచాయితీలు చేసి సమస్య పరిష్కరించలేపోయారు. ఉదయం పూట భార్య పశువులను తోలుకుని పొలం దగ్గరకు వెళ్లింది. ప్రతిరోజు సాయంత్రం టైమ్ కు వచ్చేస్తున్న భార్య కొన్ని రోజుల నుంచి ఆలస్యంగా ఇంటికి రావడంతో అదే విషయంలో ఆమెతో భర్త గొడవ పడుతున్నాడు. సాయంత్రం పొలం దగ్గరకు వెళ్లిన భర్త అతని భార్య కోసం గాలించాడు. అదే సమయంలో పొలం శివార్ల నుంచి గడ్డివాము వెనుక నుంచి భార్య గడ్డిమోపు ఎత్తుకుని రావడం చూసిన భర్త రగిలిపోయాడు. అంతే వెంట తీసుకెళ్లిన కొడవలి తీసుకున్న భర్త భార్య మీద దాడి చేశాడు. భర్త దాడి నుంచి తప్పించుకున్న భార్య పొలం వెంట పరుగు తీసింది. పొలాలలో భార్యను వెంటాడి వెంటాడిన భర్త చివరికి ఆమెను కొడవలితో నరికి స్పాట్ లో చంపేయడం కలకలం రేపింది.

వ్యవసాయం చేస్తున్న దంపతులు

వ్యవసాయం చేస్తున్న దంపతులు

కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని గోకాక్ సమీపంలోని బెణచినమడ్ని గ్రామంలో పుండలీక, నింగవ్వ (45) దంపతులు నివాసం ఉంటున్నారు. పుండలిక, నింగవ్వ దూరపు బంధువులు కావడంతో వీరికి 25 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సంతోషంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దంపతుల మద్య కొంతకాలం క్రితం గొడవలు మొదలైనాయి.

ఇంతకాలానికి రామాయణాలు

ఇంతకాలానికి రామాయణాలు

వివాహం జరిగిన 25 సంవత్సరాల తరువాత పుండలిక, నింగవ్వ దంపతుల మద్య గొడవలు మొదలు కావడంతో వారి పిల్లలతో పాటు బంధువులు తలలు పట్టుకున్నారు. ప్రతిరోజూ సాయంత్రం అయితే పుండలిక, నింగవ్వ దంపతులు ఏదో ఒక విషయానికి ఇంటిలో గొడవ పెట్టుకుంటున్నారు.

 గొడవలకు అసలు కారణం ?

గొడవలకు అసలు కారణం ?

ప్రరోజూ సాయంత్రం ఇంటికి వెలుతున్న భర్త పుండలిక అతని భార్య నింగవ్వతొ గొడవ పడందే నిద్రపోవడడం లేదు. గొడవలు ఎందుకు జరుగుతున్నారో అనే విషయం పుండలిక, నింగవ్వ దంపతులు ఇంత వరకు క్లారిటీగా చెప్పకపోవడంతో గ్రామ పెద్దలు సైతం వారికి పంచాయితీలు చేసి సమస్య పరిష్కరించలేపోతున్నారు.

ఉదయం వెళ్లి సాయంత్రం వస్తున్న భార్య

ఉదయం వెళ్లి సాయంత్రం వస్తున్న భార్య


ఉదయం పూట భార్య నింగవ్వ ఇంటి దగ్గర ఉన్న పశువులు, గొర్రెలను తోలుకుని పొలం దగ్గరకు వెలుతోంది. ప్రతిరోజు సాయంత్రం టైమ్ కు వచ్చేస్తున్న భార్య నింగవ్వ గత కొన్ని రోజుల నుంచి ఆలస్యంగా ఇంటికి రావడంతో అదే విషయంలో ఆమెతో భర్త పుండలిక ఎక్కువగా గొడవ పడుతున్నాడు. ఎందుకు ఆలస్యం అవుతోంది, ఎవరితో తిరుగుతున్నావు అంటూ పుండలిక రెచ్చిపోవడంతో అతని భార్య నింగవ్వ సమాధానం చెప్పలేక సతమతం అవుతోందని సమాచారం.

పొలంలో భార్యను వెంటాడిన భర్త

పొలంలో భార్యను వెంటాడిన భర్త

సాయంత్రం భార్య నింగవ్వ త్వరగా ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త పండలిక నేరుగా పొలం దగ్గరకు వెళ్లి అతని భార్య కోసం గాలించాడు. అదే సమయంలో పొలం శివార్ల నుంచి గడ్డివాము దగ్గర నుంచి భార్య నింగవ్వ గడ్డిమోపు ఎత్తుకుని రావడం చూసిన భర్త పుండలిక అవేశంతో రగిలిపోయాడు. అంతే వెంట తీసుకెళ్లిన కొడవలి తీసుకున్న భర్త పుండలిక అతని భార్య నింగవ్వ మీద దాడి చేశాడు. భర్త పుండలిక దాడి నుంచి తప్పించుకున్న నింగవ్వ ఆమె ప్రాణాలు కాపాడుకోవడం కోసం చుట్టుపక్కల పొలాల వెంట పరుగు తీసింది.

చంపేసి శవం పక్కన కుర్చున్న భర్త

చంపేసి శవం పక్కన కుర్చున్న భర్త

పొలంలో భార్య నింగవ్వను వెంటాడి వెంటాడిన ఆమె భర్త పుండలిక చివరికి ఆమెను పట్టుకుని కొడవలితో నరికి స్పాట్ లో చంపేయడం కలకలం రేపింది. భార్య నింగవ్వను హత్య చేసిన పండలిక పారిపోకుండా దర్జాగా పొలంలోనే శవం పక్కన కుర్చున్నాడు. పుండలికను అరెస్టు చేసి అతను ఎందుకు భార్యను హత్య చేశాడు అని విచారణ చేస్తున్నామని ఎస్ ఐ నాగరాజు మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+