Wife: నా భార్య బెడ్ రూమ్ లో నుంచి బయటకు తోసేస్తోంది, ప్రియుడితో ? రగిలిపోయిన భర్త ఏం చేశాడంటే !
బెంగళూరు: కుటుంబ సభ్యులు చూపించిన మహిళను వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య, పిల్లలతో జీవితాంతం సుఖంగా ఉండాలని అతను ఊహించుకున్నాడు. అయితే బయట అందరూ అనుకున్నట్ల అతని జీవితం అంతసాఫీగా సాగిపోలేదు. ఇంటికి వెలుతున్న భర్తతో అతని భార్య నిత్యం గొడవలు పడుతోందని తెలిసింది. రానురాను దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. నా భార్య తనను దగ్గరకు రానివ్వడం లేదని, బెడ్ రూమ్ లో నుంచి బయటకు తోసేస్తోందని, ప్రియుడితో నా భార్య ఎంజాయ్ చేస్తోందని ఇంతకు ముందే భర్త పంచాయితీలు పెట్టాడు. పెద్దలు పంచాయితీలు చేసినా దంపతుల మద్య గొడవలు మాత్రం అలాగే ఉన్నాయి. రానురాను గొడవలు ఎక్కువ కావడంతో భర్త విసిగిపోయాడు. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యను కొడవలితో నరికి చంపేశాడు. భార్య ప్రాణం పోయిందా లేదా అని నిర్దారించుకున్న భర్త అతని ముగ్గురు పిల్లలను పిలుచుకుని వెళ్లి ఆమె అక్క ఇంట్లో వదిలిపెట్టాడు. పిల్లలను అక్క ఇంట్లో వదిలేసిన భర్త నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయి తన భార్యను ఎందుకు హత్య చేశాను అనే విషయం పిన్ టూ పిన్ చెప్పాడు.

12 ఏళ్ల క్రితం పెళ్లి
బెంగళూరులోని గోవిందపురంలోని భైరప్ప లేఔట్ లో ముజామిల్ పాషా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 12 ఏళ్ల క్రితం ముజామిల్ పాషా కుటుంబ సభ్యులు చూపించిన ఆయేషాబాను (32) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న భార్య ఆయేషాతో ముజామిల్ సంతోషంగా కాపురం చేశాడు.

దంపతుల మద్య తేడాలు
ఆయేషా, ముజామిల్ దంపతులకు రెయాన్ (10), ఫరాహ్ (8), హర్ మాయిద్ (6) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య ఆయేషా, పిల్లలతో జీవితాంతం సుఖంగా ఉండాలని ముజామిల్ ఊహించుకున్నాడు. అయితే బయట అందరూ అనుకున్నట్ల ముజామిల్, ఆయేషాల జీవితం మాత్రం అంత అంతసాఫీగా సాగిపోలేదు.

అక్రమ సంబంధం, బెడ్ రూమ్ లోకి రానివ్వడం లేదని పంచాయితీలు
ఇంటికి వెలుతున్న భర్తతో అతని భార్య నిత్యం గొడవలు పడుతోందని తెలిసింది. రానురాను దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. తన భార్య ఆయేషా తనను దగ్గరకు రానివ్వడం లేదని, బెడ్ రూమ్ లో నుంచి బయటకు తోసేస్తోందని, ఆమెకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని ఇంతకు ముందే భర్త ముజామిల్ పెద్దల ముందు పంచాయితీలు పెట్టాడు.

భార్యను నరికి చంపేసిన భర్త
పెద్దలు పంచాయితీలు చేసినా ముజామిల్, ఆయేషా దంపతుల మద్య గొడవలు మాత్రం అలాగే ఉన్నాయి. రానురాను గొడవలు ఎక్కువ కావడంతో ఆయేషా తీరుతో ఆమె భర్త ముజామిల్ విసిగిపోయాడని తెలిసింది. రాత్రి ఇంటికి వెళ్లిన ముజామిల్ అతని భర్త ఆయేషాతో గొడవ పెట్టుకుని ముందుగానే వెంట తీసుకెళ్లిన కొడవలితో ఆమెను నరికి చంపేశాడు.

పోలీసులకు స్టోరీ చెప్పిన భర్త
భార్య ఆయేషా ప్రాణం పోయిందా లేదా అని నిర్దారించుకున్న ముజామిల్ ముగ్గురు పిల్లలను పిలుచుకుని వెళ్లి ఆమె అక్క ఇంట్లో వదిలిపెట్టాడు. పిల్లలను అక్క ఇంట్లో వదిలేసిన ముజామిల్ నేరుగా గోవిందపుర పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయి తన భార్య ఆయేషాకు అక్రమ సంబంధం ఉందని, అందుకే ఆమెను హత్య చేశానని పిన్ టూ పిన్ పోలీసులకు చెప్పాడు.












Click it and Unblock the Notifications