ట్రంప్ హత్యకు ఇరాన్ నయా ప్లాన్..? వెలుగులోకి షాకింగ్ విషయాలు..

అమెరికా- ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఓ వైపు ఇరాన్ లో మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న తరుణంలో మరోవైపు అమెరికా- ఇరాన్ మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హత్యకు ఇరాన్ మాస్టర్ ప్లాన్ రచించినట్లు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ లోని వాల్ స్ట్రీట్ జర్నల్ సంస్థ అందించిన సమాచారం ప్రకారం స్పష్టం అవుతోంది. ఇరాన్ పై మరోసారి దాడులు ఉద్ధృతం చేయాలని ట్రంప్ అధికారిక భవనం శ్వేతసౌధం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుందా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అయితే ఈ విషయం గతవారమే ట్రంప్ టేబుల్ వద్దకు చేరినట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల ట్రంప్ ఓ సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ చంపాలని చూస్తున్నవారి లిస్టులో తన పేరు ఫస్ట్ లో ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్న విషయం తెలిసిందే. ఇక ట్రంప్ హత్యపై వస్తున్న వార్తల్ని యూఎస్ మీడియా సంస్థ సీఎన్ఎన్ కూడా ధ్రువీకరించింది. అది ఒక నిర్దిష్ట దాడి అని పేర్కొంది. కానీ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

ఇక ట్రంప్ ను హతమార్చేందుకు ఇరాన్ దాదాపు 6 ఏళ్ల నుంచే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2020 లో ఇరాన్ జనరల్ క్వాస్సమ్ సోలేమనిని హతమార్చాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి ఇరాన్ ట్రంప్ హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల నాటో సమ్మిట్ పూర్తయిన తర్వాత టర్కీ నుంచి తిరిగి అమెరికాకు వచ్చే క్రమంలో ట్రంప్ తన పాత ఎయిర్ ఫోర్స్ వన్ ఎయిర్ క్రాఫ్ట్ ను వినియోగించారు. దాంతో ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇరాన్ పై మరోసారి తాజాగా అమెరికా దాడులు చేపట్టిన తర్వాత ట్రంప్ ఇలా భద్రతా వలయంలోకి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

iran has devised a master plan to assassinate US President TrumpUS and Iran tensions escalating row

మరోవైపు ఇరాన్ లో ఖమేనీ అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. ఖమేనీ స్వస్థలం అయిన మశద్ లోని పవిత్ర ఇమామ్ రెజా దర్గా వద్ద ఆయన్ను ఖననం చేశారు. ఈ క్రమంలో ఈ చివరి ఘట్టాన్ని చూసేందుకు లక్షలాదిమంది తరలివచ్చారు. తుది నివాళులు అర్పించారు. నాలుగు నెలల క్రితం ఫిబ్రవరి 28 న ఇరాన్- అమెరికా మధ్య ప్రారంభమైన దాడుల్లో మొదటిరోజే ఖమేనీతోపాటు అతని కుటుంబం మృతి చెందారు. ఇక ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవరాలు, భార్య తదితరుల అంత్యక్రియలను కూడా మశద్‌ లోనే ఒకేసారి నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+