అన్న బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడ్రోయ్.. వేట మొదలు..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇటీవల కరుప్పు.. తెలుగులో వీరభద్రుడు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూర్య ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో మరోసారి క్రేజీ హిట్ కొట్టారు. ఈ మూవీ ఆగస్టు 14 న విడుదల కాగా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది.

రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 74.47 కోట్లు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ విషయాన్ని సాక్ నిక్ తెలిపింది. రిలీజ్ అయిన తొలిరోజు కంటే సెకండ్ రోజు కలెక్షన్స్ పెరగడంతో బాక్సాఫీస్ వద్ద సూర్య వేట మొదలైంది అని మాట్లాడుకుంటున్నారు. అటు అమెరికాలోనూ విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రఫ్పాడిస్తోంది. ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల మార్క్ ను దాటినట్లు మేకర్స్ వెల్లడించారు. సూర్య కెరీర్ లో అత్యంత వేగంగా ఈ ఫీట్ ను నమోదు చేసిన సినిమా ఇదేనని టాక్ వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ మూవీ ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో వేచి చూడాలి.

ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఆయన గతంలో సర్, లక్కీ భాస్కర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ రెండు సినిమాలూ అటు తమిళంతోపాటు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు సూర్యతో తీసిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ కూడా అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. దాంతో దర్శకుడు వెంకీ అట్లూరి హ్యాట్రిక్ హిట్స్ కొట్టినట్లుగా భావించవచ్చు. ఈ మూవీని సితార నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్‌ గా నటించారు. వీరితోపాటు ఈ మూవీలో రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ తదితరులు నటించారు.

Suriya scored blockbuster hit with the movie Viswanath amp amp Sons Here are the opening day collections

ఇక విశ్వనాథ్ అండ్ సన్స్ సూర్య కెరీర్​ లోనే స్పెషల్ మూవీగా నిలిచిపోతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ​గా సాగే ఈ మూవీలో వెంకీ రాసిన డైలాగ్స్​ కు థియేటర్లలో క్లాప్స్ పడుతున్నాయి. 'మనకి డబ్బులు, స్టేటస్ సౌకర్యం కావాలి కానీ అహంకారం కాకూడదు'.. 'మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదు.. ఒక గొడవ తర్వాత ఎలా మాట్లాడాలో తెలీక' ఇలాంటి డైలాగ్స్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టైల్ ను గుర్తు చేస్తున్నాయి. అందుకే దర్శకుడు వెంకీ అట్లూరిని జెన్ జీ త్రివిక్రమ్ అని ట్యాగ్ ఇచ్చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+