Wife: అదే విషయంలో గొడవలు, ఏంచేస్తావు అని ఎదురు తిరిగిన భార్య, స్పాట్ లో చంపేసిన భర్త !
బెంగళూరు: హ్యాపీగా పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలని దంపతులు కలలుకన్నారు. చక్కగా సంసారం చేసుకుంటున్న వారి జీవితంలో సమస్యలు మొదలైనాయి. చిన్నచిన్న విషయాలకు దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్య కుటుంబ సభ్యులు, భర్త కుటుంబ సభ్యులు ఇంతకాలం ఇద్దరికి నచ్చ చెబుతూ వచ్చారు. ఎన్నిసార్లు పంచాయితీలు జరిగినా దంపతుల ప్రవర్తనలో మార్పురాలేదు. ఇంట్లో దంపతులు గొడవపడ్డారు. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోయింది. ఏం చేస్తావో చేసుకో అని భార్య ఎదురు తిరిగింది. నా మాటకే ఎదురు చెబుతావా ? అంటూ రెచ్చిపోయిన భర్త కత్తి తీసుకుని భార్యను పొడిచి స్పాట్ లో చంపేశాడు.

బెంగళూరులో కాపురం
ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని చంద్రాలేఔట్ లో సయ్యద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సయ్యద్, బేబి అయోషా అే యువతిని వివాహం చేసుకున్నాడు. హ్యాపీగా పెళ్లి చేసుకున్నామని, జీవితాంతం కలిసి ఉండాలని సయ్యద్, బేబి ఆయేషా దంపతులు కొంతకాలం కలలుకన్నారు.

చిన్నిచిన్న సమస్యలు
చక్కగా సాగిపోతున్న ఆయేషా, సయ్యద్ దంపతుల మద్య చిన్నచిన్నగా గొడవలు మొదలైనాయి. రానురాను ఆ గొడవలు పెద్దవి అయ్యాయి. భార్య సయ్యద్ కుటుంబ సభ్యులు, భర్త ఆయేషా కుటుంబ సభ్యులు ఇంతకాలం ఇద్దరికి నచ్చ చెబుతూ వచ్చారు. ఎన్నిసార్లు పంచాయితీలు చేసినా వీరి ప్రవర్తనలో మార్పురాలేదు.

ఓ విషయంలో ఫైటింగ్
ఇంట్లో భార్య ఆయేషాతో ఆమె భర్త సయ్యద్ ఓ విషయంలో పెద్దగా గొడవ పెట్టుకున్నాడు. ఆ సందర్బంలో ఇద్దరి మద్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సందర్బంలో భర్త సయ్యద్ కు ఎదురు తిరిగిన ఆయేషా నేను నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, నీచేత ఎమైదే అది చేసుకో అంటూ ఎదురు తిరిగిందని సమాచారం.

భార్యను స్పాట్ లో చంపేసిన భర్త
మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన సయ్యద్ ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని అతని భార్య బేబి ఆయేషాను ఇష్టం వచ్చినట్లు పొడవడంతో ఆమె స్పాట్ లో ప్రాణాలు వదిలేసింది. ఆయేషా హత్యకు కచ్చితమైన కారణాలు తెలీడం లేదని, కేసు విచారణలో ఉందని బెంగళూరు పశ్చిమ విభాగం డీసీపీ సంజీవ ఎం. పాటిల్ మీడియాకు చెప్పారు.

పక్కా క్లారిటీ లేదు ?
ఏ విషయంలో గొడవ జరిగి ఆయేషా హత్యకు గురైయ్యిందో తెలీక ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్య ఆయేషాను హత్య చేసిన ఆమె భర్త సయ్యద్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే తన భార్య ఆయేషాను ఎందుకు చంపాల్సి వచ్చిందో ? అనే విషయంలో సయ్యద్ ఇంకా పక్కా సమాచారం ఇవ్వలేదని తెలిసింది.












Click it and Unblock the Notifications