Wife: జాతరకు ఊరికి వెళ్లారు, అదే టైమ్ లో పెళ్లి రోజు సంబరాలు, అర్దరాత్రి భార్యను సైలెంట్ గా చంపేసి !

బెంగళూరు/యాదగిరి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులు చూడముచ్చటగా ఉన్నారని అందరూ అనుకున్నారు. వివాహం చేసుకున్న తరువాత దంపతులు సిటీకి వెళ్లిపోయారు. పండుగలు, శుభకార్యాలయాలకు అప్పుడప్పుడు దంపతులు సొంత ఊరికి వచ్చి వెలుతున్నారు. ఊరిలో జాతర ఉండటంతో దంపతులు సొంత ఊరికి వెళ్లారు. అదే సందర్బంలో దంపతుల పెళ్లి రోజు వచ్చింది. దంపతుల పెళ్లి రోజు సందర్బంగా బంధువులు, స్నేహితులు వాళ్లకు శుభాకాంక్షలు చెప్పారు. మద్యాహ్నం దంపతులు సంతోషంగా బంధువులు, స్నేహితులతో కలిసి భోజనం చేశారు. రాత్రి దంపతుల మద్య గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన భర్త అతని భార్యను చంపేశాడు. జాతరకు వచ్చిన పాపానికి పెళ్లి రోజు భర్త చేతిలో అతని భార్య దారుణ హత్యకు గురికావడంతో వాళ్ల కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అందరూ షాక్ అయ్యారు.

ఏడాది క్రితం పెళ్లి

ఏడాది క్రితం పెళ్లి

కర్ణాటకలోని యాదగిరి జిల్లాలోని గురుమఠకల్ తాలుకాలోని గోపాలపురంలో భీమరాయ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. యాదగిరి జిల్లాలోని సౌరాష్ట్రపురకు చెంందిన పార్వతిని గత ఏడాది మే 13వ తేదీ భీమరాయ వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తరువాత భీమరాయ, పార్వతి దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు.

బెంగళూరులో కాపురం

బెంగళూరులో కాపురం

భీమరాయ, పార్వతి దంపతులు చూడముచ్చటగా ఉన్నారని అందరూ అనుకున్నారు. వివాహం చేసుకున్న తరువాత భీమరాయ, పార్వతి దంపతులు బెంగళూరు సిటీకి వెళ్లి అక్కడే పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పండుగలు, శుభకార్యాలయాలకు అప్పుడప్పుడు బీమరాయ, పార్వతి దంపతులు యాదగిరి జిల్లాలోని వాళ్ల సొంత ఊరికి వచ్చి వెలుతున్నారు.

జాతర+ పెళ్లి రోజు

జాతర+ పెళ్లి రోజు


సొంత ఊరిలో జాతర ఉండటంతో భీమరాయ, పార్వతి దంపతులు మే 7వ తేదీన సొంత ఊరికి వెళ్లారు. జాతరకు ఊరికి వెళ్లిన సందర్బంలో దంపతుల పెళ్లి రోజు (మే 13వ తేదీ) వచ్చింది. పార్వతి, భీమరాయ దంపతుల పెళ్లి రోజు సందర్బంగా బంధువులు, స్నేహితులు వాళ్లకు శుభాకాంక్షలు చెప్పారు. మద్యాహ్నం భీమరాయ, పార్వతి దంపతులు సంతోషంగా బంధువులు, స్నేహితులతో కలిసి భోజనం చేశారు.

చిన్న విషయంలో దంపతుల మద్య గొడవ

చిన్న విషయంలో దంపతుల మద్య గొడవ

పెళ్లి రోజు రాత్రి భీమరాయ, పార్వతి దంపతుల మద్య ఇంటి పని చేసే విషయంలో చిన్న గొడవ జరిగింది. తరువాత గొడవ పెద్దది అయ్యింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు భీమరాయ, పార్వతి దంపతులకు సర్ది చెప్పడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. అయితే భీమరాయ అతని భార్య పార్వతి మీద రగిలిపోయాడు.

 పెళ్లి రోజు భార్యను సైలెంట్ గా చంపేసిన భర్త

పెళ్లి రోజు భార్యను సైలెంట్ గా చంపేసిన భర్త

రాత్రి భీమరాయ, పార్వతి దంపతులు ఇంట్లో నిద్రపోయారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన భీమరాయ అతని భార్య పార్వతిని గొంతు నులిమి చంపేసి ఆమెకు ఉరి వేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు. జాతరకు వచ్చిన పాపానికి పెళ్లి రోజు భర్త భీమరాయ చేతిలో అతని భార్య పార్వతి దారుణ హత్యకు గురికావడంతో వాళ్ల కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అందరూ షాక్ అయ్యారు. అయితే పోస్టుమార్టం వచ్చిన తరువాత భీమరాయ అతని భార్య పార్వతిని హత్య చేశాడని మూడు రోజుల తరువాత ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+