Wife:ఫ్రెండ్ భార్యతో రొమాన్స్, జంప్, హైవేలో వెంటాడి నరికిన భర్త, ఫ్యాక్షన్ సినిమా టైప్ లో ప్రియుడు ?

చెన్నై/సేలం: సహకార పాల సంఘం డైరీలో ఇద్దరు యువకులు పని చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇద్దరూ అక్కడే పని చేస్తున్నారు. యువకులు ఎప్పుడు ఎక్కడ ఉంటారు అనే విషయాలు ఒకరి గురించి ఒకరికి తెలుస్తోంది. స్నేహితుడి భార్యను ఓ యువకుడు లేపుకుని వెళ్లాడు. చాలాకాలం పాటు ఫ్రెండ్ భార్యతో అతను రొమాన్స్ చేశాడు. భర్త కేసు పెట్టడంతో ప్రేమికులను పోలీసులు పట్టుకుని వచ్చి వార్నింగ్ ఇచ్చి ఇద్దరినీ విడగొట్టారు. అయితే స్నేహితుడు మాత్రం అతని ఫ్రెండ్ భార్యను వదల్లేదు. మ్యాటర్ సీరియస్ గా తీసుకున్న భర్త హైవే రహదారిలో మకాం వేసి అతని భార్య ప్రియుడిని అడ్డగించి వేటకొడవలితో వెంటాడి వెంటాడి నరికేశాడు. ప్రియురాలి భర్త నుంచి తప్పించుకోవడానికి ప్రియుడు ట్రక్ నడుపుకుంటూ పారిపోవడానికి ప్రయత్నించి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ట్రక్ తో ఢీకొట్టాడు.

పెళ్లి చేసుకున్న యువకుడు

పెళ్లి చేసుకున్న యువకుడు

తమిళనాడులోని సేలం జిల్లాలోని కెంగవల్లి సమీపంలోని సౌత్ మనక్కాడ్ ప్రాంతంలో మురుగన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మురుగన్ కు ప్రదీప్ (28) అనే కుమారుడు ఉన్నాడు. మూడు సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన సెల్వీ ( పేరు మార్చడం జరిగింది ) అనే యువతిని ప్రదీప్ వివాహం చేసుకున్నాడు.

ఒకే చోట ఉద్యోగం

ఒకే చోట ఉద్యోగం

మనక్కాడ్ పాల సహకార సంఘంలో ప్రదీప్ ట్రక్ లో పాల ట్యాంక్ లు లోడ్ చేసే పని చేస్తున్నాడు. ఇదే పాల సహకార సంఘంలో జగదీషన్ (25) అనే యువకుడు ట్రక్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి జగదీషన్, ప్రదీప్ ఇద్దరూ అక్కడే పని చేస్తున్నారు. ప్రదీప్, జగదీషన్ ఎప్పుడు ఎక్కడ ఉంటారు అనే విషయాలు ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు.

ఫ్రెండ్ భార్యతో రొమాన్స్

ఫ్రెండ్ భార్యతో రొమాన్స్

ప్రదీప్ ఇంట్లో లేని సమయంలో అక్కడికి వెలుతున్న జగదీషన్ ఫ్రెండ్ భార్య సెల్వీతో చనువు పెంచుకున్నాడు. రానురాను ప్రదీప్ భార్య సెల్వీతో జగదీషన్ ఇంకా చనువు పెంచుకుని ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. రెండు సంవత్సరాల నుంచి జగదీషన్ తో ప్రదీప్ భార్య సెల్వీ ఎంజాయ్ చేసింది.

ఫ్రెండ్ భార్యతో జంప్ జిలాని

ఫ్రెండ్ భార్యతో జంప్ జిలాని

సెల్వీ, జగదీషన్ ల అక్రమ సంబంధం పీకల్లోతులో కూరుకుపోయింది. 8 నెలల క్రితం జగదీషన్ అతని ఫ్రెండ్ ప్రదీప్ భార్య సెల్వీని లేపుకుని వెళ్లిపోయాడు. నెల రోజుల పాటు సెల్వీ, జగదీషన్ వేరేచోట కాపురం పెట్టి ఎంజాయ్ చేశారు. తన భార్య కనపడటం లేదని ప్రదీప్ కేసు పెట్టాడు. పోలీసులు రంగంలోకి దిగి జగదీషన్, సెల్వీ కోసం గాలించారు.

పోలీసులు వార్నింగ్ ఇచ్చినా వినలేదు

పోలీసులు వార్నింగ్ ఇచ్చినా వినలేదు

ప్రదీప్ కేసు పెట్టడంతో అక్రమ సంబంధం పెట్టుకున్న జగదీషన్, సెల్వీలను పోలీసులు పట్టుకుని వచ్చి వార్నింగ్ ఇచ్చి ఇద్దరినీ విడగొట్టారు. సెల్వీని ఆమె భర్త ప్రదీప్ కు అప్పగించారు. ఇంత జరిగినా జగదీషన్ మాత్రం అతని ఫ్రెండ్ ప్రదీప్ భార్యను రహస్యంగా కలుస్తూ ఆమెతో అక్రమ సంబంధం కొనసాగించాడు.

హైవే రహదారిలో వేటకొడవలితో వెంటాడిన భర్త

హైవే రహదారిలో వేటకొడవలితో వెంటాడిన భర్త

భార్య అక్రమ సంబంధం విషయం సీరియస్ గా తీసుకున్న ప్రదీప్ అరకలూరు నుంచి వేప్పంబూడి రహదారిలో మకాం వేసి అతని భార్య ప్రియుడు జగదీషన్ ట్రక్ లో వెలుతుంటే అడ్డగించాడు. ఆ సందర్బంలో ప్రదీప్ వేటకొడవలితో జగదీషన్ ను వెంటాడి వెంటాడి నరికేశాడు. ప్రదీప్ చంపేస్తాడని భయపడిన జగదీషన్ పరుగు తీశాడు.

చెట్టును ట్రక్కుతో ఢీకొట్టిన ప్రియుడు

చెట్టును ట్రక్కుతో ఢీకొట్టిన ప్రియుడు

ప్రదీప్ దాడిలో జగదీషన్ చెయ్యి, వెన్ను తదితర చోట్ల తీవ్రగాయాలైనాయి. ప్రదీప్ దాడి నుంచి నుంచి తప్పించుకున్న జగదీషన్ గంట తరువాత అతను నడుపుతున్న ట్రక్ దగ్గరకు వెళ్లి ఆ వాహనంలో పారిపోవడానికి ప్రయత్నించి కొంతదూరం వెళ్లిన తరువాత రోడ్డు పక్కన ఉన్న చెట్టుకుని ఢీకొట్టి అదే ట్రక్కులో కుప్పకూలిపోయాడు.

ఐసీయూలో ప్రియుడు

ఐసీయూలో ప్రియుడు

అటువైపు వెలుతున్న వారు విషయం గుర్తించి జగదీషన్ ను సేలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. జగదీషన్ పరిస్థితి విషమంగా ఉందని, అతను ఐసీయూలో ఉన్నాడని, ప్రదీప్ ను అరెస్టు చేశామని సేలం జిల్లా పోలీసులు తెలిపారు. అక్రమ సంబంధం కారణంగా భార్య ప్రియుడిని భర్త రోడ్డు మీద వెంటాడని నరకడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+