Wife kidnap: భార్య కిడ్నాప్ కు ఫ్రెండ్స్ తో స్కెచ్. అర్దరాత్రి ఫామ్ హౌస్ లో భర్త హత్య, అందుకే జరిగింది !
లక్నో/చెన్నై: కావలసినంత డబ్బులు ఉన్నాయి. భార్యతో చక్కగా కాపురం చేస్తున్న భర్త వ్యాపారం చేస్తూ, ఫామ్ హౌస్ చూసుకుంటూ సంతోషంగా ఉన్నాడు భార్య కూడా భర్తతో సంతోషంగానే ఉండేది. అయితే ఇంట్లో దంపతుల మద్య మొదలైన చిన్నచిన్న గొడవలు ఎక్కువ అయ్యాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, పెద్దలు దంపతులకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఎవ్వరు ఎన్ని చెప్పినా దంపతుల మద్య రాజీ మాత్రం కుదరలేదు. మంచి రోజు చూసిన భార్య భర్తకు బాయ్ బాయ్ చెప్పేసి పుట్టింటికి వెళ్లిపోయింది. రాత్రి పక్కన భార్య లేకపోవడం, నిద్రరాకపోవడంతో ఆమెను ఇంటికి పిలుచుకురావడానికి ఆమె భర్త అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో భార్య మాత్రం భర్త ఇంటికి రాలేదు. భార్యను కిడ్నాప్ చేసి తీసుకురావాలని భర్త ఆలోచించాడు. తన ప్రాణ స్నేహితుడిని ఫామ్ హౌస్ కు పిలిపించిన భర్త అక్కడ అతని భార్య కిడ్నాప్ కు స్కెచ్ వేశాడు. రాత్రి మందు పార్టీలో భార్య కిడ్నాప్ స్కెచ్ వేశారు. అక్కడ పరిస్థితులు తారుమారు కావడంతో భార్య కిడ్నాప్ కు స్కెచ్ వేసిన భర్త మరుసటి రోజు ఫామ్ హౌస్ టెర్రాస్ మీద శవమై కనిపించడం కలకలం రేపింది.

భూస్వామి, ఫామ్ హౌస్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ జిల్లాలోని హింపూర్ దీపా పోలీస్ స్టేషన్ పరిధిలోని ముధల్ గ్రామంలో హరి ఓం (34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. హరి ఓంకు భూస్వామి. అతనికి.కావలసినంత ఆస్తీతో పాటు డబ్బులు ఉన్నాయి. హరి ఓంకు స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే యువతితో వివాహం అయ్యింది. భార్య స్వప్నాతో చక్కగా కాపురం చేస్తున్న హరి ఓం వ్యాపారం చేస్తూ, ఫామ్ హౌస్ చూసుకుంటూ సంతోషంగా ఉన్నాడు.

భర్తకు బాయ్ బాయ్ చెప్పిన భార్య
ఇంట్లో హరి ఓం, స్వప్నా దంపతుల మద్య మొదలైనాయి. చిన్నచిన్న గొడవలు మొదలై అవి ఎక్కువ అయ్యాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, పెద్దలు హరి ఓం, స్వప్నా దంపతులకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఎవ్వరు ఎన్ని చెప్పినా హరి ఓం, స్వప్నా దంపతుల మద్య రాజీ మాత్రం కుదరలేదు. మంచి రోజు చూసిన స్వప్నా ఆమె భర్త హరి ఓంకు బాయ్ బాయ్ చెప్పేసి పుట్టింటికి వెళ్లిపోయింది.

భార్య పక్కన లేదని భర్తకు నిద్రరాలేదు
రాత్రి పక్కన భార్య స్వప్నా లేకపోవడం, నిద్రరాకపోవడంతో ఆమెను ఇంటికి పిలుచుకురావడానికి ఆమె భర్త హరి ఓం అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో స్వప్నా మాత్రం భర్త హరి ఓం ఇంటికి రాలేదు. భార్య స్వప్నాను కిడ్నాప్ చేసి తీసుకురావాలని భర్త హరి ఓం ఆలోచించాడు. తన ప్రాణ స్నేహితుడు పరమ్ సింగ్ ను ఫామ్ హౌస్ కు పిలిపించిన హరి ఓం అక్కడ అతని భార్య స్వప్నా కిడ్నాప్ కు స్కెచ్ వేశాడు.

ఫ్రెండ్ రివర్స్ తో తేడాలు
రాత్రి మందు పార్టీలో భార్య స్వప్నాను కిడ్నాప్ కు స్కెచ్ వేశారు. అక్కడ హరి ఓంకు, అతని స్నేహితుడు పరమ్ సింగ్ మద్య తేడాలు వచ్చాయి. నీ భార్య స్వప్నా కిడ్నాక కు నేను సహకరించనని పరమ్ సింగ్ తేల్చి చెప్పాడు. ఆక్కడ పరిస్థితులు పూర్తిగా తారుమారు అయ్కాయాయి.

భర్తను స్పాట్ లో చంపేసిన ఫ్రెండ్
భార్య స్వప్నా కిడ్నాప్ కు స్కెచ్ వేసిన భర్త హరి ఓం రెచ్చిపోవడంతో అంత వరకు సహనంగా ఉన్న పరమ్ సింగ్ సహనం కోల్పోయాడు. అంతే కత్తి తీసుకున్న పరమ్ సింగ్ అతని ఫ్రెండ్ హరి ఓంను కత్తితో పొడిచి చంపేశాడు. మరుసటి రోజు ఫామ్ హౌస్ టెర్రాస్ మీద హరి ఓం శవమై కనిపించడం కలకలం రేపింది. పోలీసులు పరమ్ సింగ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా తాను హరి ఓంను హత్య చేశానని అంగీకరించాడని పోలీసులు చెప్పారు. భార్య కిడ్నాప్ కు స్కెచ్ వేసిన హరి ఓం హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications