Wife: భర్త రీజనల్ మేనేజర్, రాత్రి ఇంటికి వెళ్లి చూసే సరికి, 15 ఏళ్తకు కాపురంలో ఏం జరిగిదంటే ?
అహమ్మదాబాద్/ చెన్నై: కుటుంబ సభ్యులు చూసి చేసిన పెళ్లితో దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. మంచి ఉద్యోగం చేస్తున్న భర్త 15 సంవత్సరాల క్రితం వేరే రాష్ట్రానికి వెళ్లి కాపురం పెట్టాడు. దంపతులు సంతోషంగా కాపురం చేసుకుంటున్నారని, ఎలాంటి సమస్యలు లేదని వారి కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడం లేదని, వారి మద్య సమస్యలు చాలా ఉన్నాయని ఆలస్యంగా వెలుగు చూసింది. తాను ఇంటికి వెళ్లే సమయానికి తన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య అంత్యక్రియలు కూడా పూర్తి అయిపోయాయి. భార్య చనిపోయిన తరువాత తన కూతురి ఆత్మహత్యకు తన అల్లుడే కారణం అని, వివాహం జరిగిన 15 సంవత్సరాల తరువాత కట్నం కోసం తన కూతురిని వేధింపులకు గురి చెయ్యడం వలనే ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కొత్త కథ మొదలైయ్యింది.

15 సంవత్సరాల క్రితం పెళ్లి
బీహార్ లోని వైశాలికి చెందిన సుజిత్ సింగ్ (36) అనే యువకుడికి బీహార్ కు చెందిన రుచి రాజ్ సింగ్ (35) అనే యువతికి వారి కుటుంబ సభ్యులు 15 సంవత్సరాల క్రితం గ్రాండ్ గా పెళ్లి చేశారు. కుటుంబ సభ్యులు చూసి చేసిన పెళ్లితో సుజిత్ సింగ్, రుచి రాజ్ సింగ్దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు.

అహమ్మదాబాద్ లో కాపురం
సుజీత్ సింగ్ అహమ్మదాబాద్ లోని ఫార్మాస్యూటికల్ కంపెనీలో రీజనల్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. 10 సంవత్సరాల క్రితం సుజీత్ సింగ్ అతని భార్య రుచి రాజ్ సింగ్ తో కలిసి అహమ్మదాబాద్ లో కాపురం ఉంటున్నాడు. ప్రతిరోజు సుజీత్ సింగ్ ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు. రుచి సింగ్ ఇంటిలోనే ఉంటున్నది.

కుటుంబ సభ్యులకు షాక్
సుజీత్ సింగ్, రుచి రాజ్ సింగ్ దంపతులు సంతోషంగా కాపురం చేసుకుంటున్నారని, ఎలాంటి సమస్యలు లేవని వారి కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే సుజీత్ సింగ్, రుచి రాజ్ సింగ్ దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడం లేదని, వారి మద్య సమస్యలు చాలా ఉన్నాయని ఆలస్యంగా వెలుగు చూడటంతో వారి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

ఆత్మహత్య చేసుకున్న భార్య
ఆగస్టు 18వ తేదీన ఉదయం సుజీత్ సింగ్ ఉద్యోగానికి వెళ్లిపోయాడు. ఉద్యోగం ముగించుకున్న సుజిత్ రాత్రి ఇంటికి వెళ్లాడు. తాను ఇంటికి వెళ్లే సమయానికి తన భార్య రుచి రాజ్ సింగ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త సుజీత్ సింగ్ ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తరువాత రుచి రాజ్ సింగ్ అంత్యక్రియలు కూడా పూర్తి అయిపోయాయి.

ఇన్ని రోజులకు భర్త మీద కేసు
రుచి రాజ్ సింగ్ చనిపోయిన ఐదు రోజుల తరువాత తన కూతురి ఆత్మహత్యకు తన అల్లుడు సుజీత్ సింగ్ కారణం అని, వివాహం జరిగిన 15 సంవత్సరాల తరువాత కట్నం కోసం తన కూతురిని వేధింపులకు గురి చెయ్యడం వలనే ఆమె ఆత్మహత్య చేసుకుందని, ఆత్మహత్య చేసుకునే ముందు రుచి సింగ్ అతని సోదరుడికిఫోన్ చేసి విషయం మొత్తం చెప్పి విలపించిందని ఆమె తండ్రి కేదార్ నాథ్ సింగ్ సాహు అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కొత్త కథ మొదలైయ్యింది. పోలీసులు సుజీత్ సింగ్ మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications