Wife: భార్య టార్చర్ తట్టుకోలేక భర్త ఏం చేశాడంటే ?, దెబ్బకు భార్య, అత్త అరెస్టు, ఫేస్ బుక్ !
చంఢీగర్/హిసార్: వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు పాటు సంతోషంగా జీవించారు. రానురాను దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భార్యకు ఆమె కుటుంబ సభ్యుల మద్దతు ఎక్కువ ఉండటంతో ఆమె రెచ్చిపోయిందని సమాచారం. భర్త అంటే లెక్కలేకుండా మాట్లాడుతూ ఎదిరిస్తున్న భార్య హల్ చల్ చేసింది. ఎక్కువ మాట్లాడితే నీ మీద పోలీసు కేసు పెడుతానని భార్య ఆమె భర్తను బెదిరించిందని ఆరోపణలు ఉన్నాయి. చివరికి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య ఆమె కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె భర్తకు నోటీసులు పంపించింది. కోర్టు నుంచి నోటీసులు వచ్చిన తరువాత భర్త రగిలిపోయాడు. నేను చస్తే కాని నా భార్య నన్ను వదిలిపెట్టదని భర్త డిసైడ్ అయ్యాడు. అంతే భార్య, అత్తతో పాటు కొందరు నా ఆత్మహత్యకు కారణం అని డెత్ నోట్ రాసి ఓ వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టిన భర్త ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భర్త ఆత్మహత్యకు కారణం అయిన భార్యతో పాటు అందరిని పోలీసులు అరెస్టు చేశారు.

భార్యతో కొంతకాలం హ్యాపీ
చంఢీగడ్ లోని హిస్సార్ జిల్లాలోని ఖేరా గ్రామంలో దిలీప్ (33) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఫతేబాద్ జిల్లాలోని పర్త గ్రామానికి చెందిన సోనూ అనే మహిళను దిలీప్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న దిలీప్, సోనూ దంపతులు కొన్ని సంవత్సరాలు పాటు సంతోషంగా జీవించారు.

రెచ్చిపోయిన భార్య
రానురాను దిలీప్, సోనూ దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. సోనూకు ఆమె కుటుంబ సభ్యుల మద్దతు ఎక్కువ ఉండటంతో ఆమె రెచ్చిపోయిందని సమాచారం. దిలీప్ అంటే లెక్కలేకుండా మాట్లాడుతూ ఎదిరిస్తున్న సోనూ హల్ చల్ చేసింది. ఎక్కువ మాట్లాడితే నీ మీద పోలీసు కేసు పెడుతానని సోనూ ఆమె భర్త దిలీప్ ను బెదిరించిందని ఆరోపణలు ఉన్నాయి.

కోర్టు నోటీసులు
కొన్ని నెలల క్రితం సోనూ, దిలీప్ ల మద్య పెద్ద గొడవ జరిగింది. ఆ సందర్బంలో రెచ్చిపోయిన సోనూ ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటిలో ఉన్న సోనూ ఆమె కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె భర్త దిలీప్ కు విడాకుల నోటీసులు పంపించింది. కోర్టు నుంచి విడాకుల నోటీసులు వచ్చిన తరువాత దిలీప్ రగిలిపోయాడు.

భార్య టార్చర్ తట్టుకోలేక భర్త ఆత్మహత్య
నా భార్య సోనూ తనను విపరీతంగా టార్చర్ పెడుతోందని, నేను చస్తే కాని నా భార్య నన్ను వదిలిపెట్టదని దిలీప్ అతని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ దగ్గర విచారం వ్యక్తం చేశాడు. నా భార్య సోనూ, మా అత్తతో పాటు కొందరు నా ఆత్మహత్యకు కారణం అని డెత్ నోట్ రాసి ఓ వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టిన దిలీప్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దిలీప్ మామా కేసు పెట్టడంతో ఉక్లాన్ పోలీసులు రంగంలోకి దిగారు. దిలీప్ ఆత్మహత్యకు కారణం అయిన అతని భార్య సోనూతో పాటు రజని, రమేష్, రోహ్తాన్ ను పోలీసులు అరెస్టు చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications