Wife: లిక్కర్ పార్టీ, ముందే ఫ్రెండ్ భార్య మీద కన్ను, మద్యం మత్తులో నీఛంగా జోకులు, చీల్చేసిన భర్త!
కోల్ కత్తా: ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న ఇద్దరు స్నేహితులు ప్రతిరోజూ కలుసుకుంటున్నారు. సాయంత్రం పని ముగించుకుని ఒక చోట కలుస్తున్న స్నేహితులు మద్యం సేవించి ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ విషయాలు ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. మద్యం తాగుతున్న సమయంలో ఒకరి విషయాలు ఒకరు మాట్లాడుకుంటున్నారు. రాత్రి మద్యం మత్తులో ఓ స్నేహితుడు అతని ఫ్రెండ్ భార్య గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు. మద్యం మత్తులో తన భార్య గురించి ఏదేదో మాట్లాడుతున్నాడని మరో వ్యక్తి అనుకున్నాడు.
రాత్రి మద్యం మత్తులో ఫ్రెండ్ భార్య గురించి అసభ్యంగా మాట్లాడాడు. నీ భార్య బెడ్ రూమ్ లో అంటూ ఆమె గురించి నీఛంగా మాట్లాడాడు. తన భార్య గురించి పదేపదే అసభ్యంగా మాట్లాడుతున్నడని ఫ్రెండ్ విషయంలో భర్త అభ్యంతరం వ్యక్తం చేశాడు. అక్కడ మాటామాటా పెరిగిపోవడంతో భర్త అతని స్నేహితుడిని దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

ఆటో డ్రైవర్
పశ్చిమ బెంగాల్ లోని కోల్ కత్తా నగరంలో ఆనంద్ పూర్ లో బిస్వంత్ జానా అలియాస్ జానా (36) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆటో నడుపుతున్న బిస్వంత్ జానా సాయంత్రం వరకు డబ్బు సంపాధించి తరువాత స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకుని తరువాత ఇంటికి వెలుతున్నాడు.

ఫ్రెండ్ భార్య మీద కన్నుపడింది
ఆటో డ్రైవర్ బిస్వంత్ జానా కు మనగల్ మోండల్ అలియాస్ మోండల్ (31) అనే స్నేహితుడు ఉన్నాడు. ఆనంద్ పూర్ ఏరియాలోనే మనగల్ మోండల్ అతని భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. స్నేహితుడు మోండల్ భార్య మీద ఆటో డ్రైవర్ బిస్వంత్ జానా కన్నుపడిందని తెలిసింది, స్నేహితుడు మోండల్ ను మాట్లాడించే ముసుగులో బిస్వంత్ జానా అతని భార్యతో కూడా ఎక్కువగా మాట్లాడేవాడని తెలిసింది.

రోజూ మద్యం సేవించి ఎంజాయ్ చేస్తున్న ఫ్రెండ్స్
ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న బిస్వంత్ జానా, మోండల్ ఇద్దరు స్నేహితులు ప్రతిరోజూ కలుసుకుంటున్నారు. సాయంత్రం పని ముగించుకుని ఒక చోట కలుస్తున్న స్నేహితులు బిస్వంత్ జానా, మోండల్ మద్యం సేవించి ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్లు మద్యం తెప్పించడం, ఇద్దరూ కలిసి మద్యం సేవిస్తూ ఎంజాయ్ చెయ్యడం బిస్వంత్ జానా, మోండల్ కు అలవాటుగా మారిపోయింది.

మద్యం మత్తులో ఫ్రెండ్ భార్య టాపిక్
మద్యం సేవించే సమయంలో బిస్వంత్ జానా, మోండల్ వారి కుటుంబ విషయాలు ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. మద్యం తాగుతున్న సమయంలో ఒకరి విషయాలు ఒకరు మాట్లాడుకుంటున్నారు. రాత్రి మద్యం మత్తులో ఆటో డ్రైవర్ బిస్వంత్ జానా అతని ఫ్రెండ్ మోండల్ భార్య గురించి అసభ్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. మద్యం మత్తులో తన భార్య గురించి బిస్వంత్ జానా ఏదేదో మాట్లాడుతున్నాడని మోండల్ అనుకున్నాడు.

నీ భార్య బెడ్ రూమ్ విషయంలో?
రాత్రి కోల్ కత్తాలోని ఆనంద్ పూర్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో మద్యం సేవించారు. ఆ సమయంలో మద్యం మత్తులో బిస్వంత్ జానా అతని ఫ్రెండ్ మోండల్ భార్య గురించి అసభ్యంగా మాట్లాడాడు. నీ భార్య బెడ్ రూమ్ లో ? అంటూ బిస్వంత్ జానా ఆమె గురించి నీఛంగా మాట్లాడాడు. తన భార్య గురించి పదేపదే అసభ్యంగా మాట్లాడుతున్నడని మోండల్ ఆ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశాడు.

చంపేసి ఎస్కేప్
అక్కడ బిస్వంత్ జానా, మోండల్ మధ్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన మోండల్ సిమెంట్ ఇటుకలు తీసుకుని ఆటో డ్రైవర్ బిస్వంత్ జానా మీద వేశాడు. ఇనుపరాడ్ తీసుకుని బిస్వంత్ జానా తల మీద, శరీరం మీద ఇష్టం వచ్చినట్లు దాడి చెయ్యడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భార్య విషయంలో ఆమె భర్త మోండల్ అతని స్నేహితుడిని దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

అందుకే చంపేశానని భర్త స్టేట్ మెంట్
బిస్వంత్ ను హత్య చేసి పారిపోయిన మోండల్ ను నోనాడంగా బ్రిడ్జ్ సమీపంలో అరెస్టు చేశామని జాయింట్ పోలీసు కమీషనర్ మురళీధర్ శర్మా మీడియాకు చెప్పారు. తన భార్య గురించి బిస్వంత్ జానా అసభ్యంగా మాట్లాడాడని, తట్టుకోలేక నేను అతన్ని చంపేశానని మోండల్ అంగీకరించాడని జాయింట్ పోలీసు కమీషనర్ మురళీధర్ శర్మా మీడియాకు చెప్పారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications