Wife: ఆంటీ అందంగా ఉందని భర్తకు అనుమానం, యాసిడ్ పోసి చంపేశాడు. క్లైమాక్స్ లో !

బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు పిల్లలు ఉన్నారు. భార్యతో 21 సంవత్సరాలు కాపురం చేసిన తరువాత ఆమె మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. నువ్వు చూడటానికి ఇప్పటికీ చాలా అందంగా ఉంటావని, నేను అందంగా లేనని భర్త అతని భార్యతో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. అందంగా ఉన్న నువ్వు వేరే వ్యక్తితో అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నావని భర్త అతని భార్యను చితకబాదడం మొదలుపెట్టాడు. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. నా భార్య చూడటానికి చాలా అందంగా ఉందని రగిలిపోయిన భర్త ఆమె మీద యాసిడ్ పోశాడు. తీవ్రగాయాలైన భార్య కొన్ని రోజుల తరువాత చనిపోయింది. అక్రమ సంబంధం విషయంలో భార్యను హత్య చేసిన భర్త జీవితాంతం సుఖంగా ఉండాలని అనుకున్నాడు. అయితే టైమ్ బ్యాడ్ కావడంతో అరెస్టు అయిన భర్త అతని భార్య హత్య కేసులో యావజ్జీవ శిక్షకు గురై జైలుపాలైనాడు.

 21 సంవత్సరాలు కాపురం చేశారు

21 సంవత్సరాలు కాపురం చేశారు

బెంగళూరు నగరంలోని కేజీ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో చెన్నేగౌడ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 21 సంవత్సరాల క్రితం చెన్నేగౌడ మంజుల అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న చెన్నేగౌడ, మంజుల దంపతులు సంతోషంగా కాపురం చేశారు. చెన్నేగౌడ, మంజుల దంపతులు పిల్లలు ఉన్నారు.

 భార్య చాలా అందంగా ఉందని డౌట్

భార్య చాలా అందంగా ఉందని డౌట్

మంజులతో 21 సంవత్సరాలు కాపురం చేసిన తరువాత ఆమె మీద భర్త చెన్నేగౌడకు అనుమానం మొదలైయ్యింది. నువ్వు చూడటానికి ఇప్పటికీ చాలా అందంగా ఉంటావని, నేను అందంగా లేనని కొన్ని సంవత్సరాల క్రితం చెన్నేగౌడ అతని భార్య మంజులతో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాడు.

 అందమైన భార్య మీద యాసిడ్ తో దాడి

అందమైన భార్య మీద యాసిడ్ తో దాడి

అందంగా ఉన్న నువ్వు వేరే వ్యక్తితో అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నావని చెన్నేగౌడ అతని భార్య మంజులను చితకబాదడం మొదలుపెట్టాడు. ఇదే విషయంలో చెన్నేగౌడ, మంజుల దంపతుల మద్య చాలాకాలం గొడవలు జరిగాయి. 2017 జులై 14వ తేదీన చెన్నేగౌడ అతని స్నేహితుడు కుమరేశన్ అనే వ్యక్తి దగ్గర యాసిడ్ తెప్పించుకుని అతని భార్య మంజుల మీద పోసేశాడు.

 శాడిస్టు భర్త దెబ్బకు భార్య ప్రాణం పోయింది

శాడిస్టు భర్త దెబ్బకు భార్య ప్రాణం పోయింది

యాసిడ్ దాడితో తీవ్రగాయాలైన మంజుల విక్టోరియా ఆసుపత్రిలో చేరింది. యాసిడ్ దాడితో విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందిన మంజుల 2017 ఆగస్టు 29వ తేదీన చనిపోయింది. అక్రమ సంబంధం విషయంలో భార్య మంజులను హత్య చేసిన ఆమె భర్త చెన్నేగౌడ జీవితాంతం సుఖంగా ఉండాలని అనుకున్నాడు. అయితే సీన్ రివర్స్ కావడంతో కేజీ నగర పోలీసులు చెన్నేగౌడను అరెస్టు చేశారు.

 యావజ్జీవ శిక్షతో సీన్ రివర్స్

యావజ్జీవ శిక్షతో సీన్ రివర్స్

తన మీద తన భర్త చెన్నేగౌడ యాసిద్ పోశాడని అప్పటికే మంజుల పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక మందిని విచారణ చేసి వారి సాక్షాలను కోర్టు ముందు సమర్పించింది. కేసు విచారణ చేసిన కోర్టు మంజుల మీద యాసిడ్ దాడి చేశాడని, ఆమెను చంపేసిన భర్త చెన్నేగౌడకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధించిందని కేజీ నగర పోలీసులు తెలిపారు. మంజుల మీద అనుమానంతో ఆమె మీద యాసిడ్ పోసి హత్య చేసిన చెన్నేగౌడకు సరైన శిక్షపడిందని బాధితురాలి కుటుంబ సభ్యులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+