• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Wife: లవ్ మ్యారేజ్, భర్తకు ఎక్కడో కాలిపోయింది, అత్తా, భార్యను ఒకేసారి, ఫోన్ చేసి మ్యాటర్ చెప్పాడు !

|
Google Oneindia TeluguNews

ద్వారకా/ చెన్నై: పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి తాపీగా ఓ విషయం చెప్పాడు. నా భార్య, అత్తను చంపేశాను, మీరు త్వరగా వచ్చి రెండు శవాలు తీసుకెళ్లండి అని చెప్పడంతో పోలీసులు బిత్తరపోయారు. నువ్వు ఎవరు ?, ఎక్కడి నుంచి ఫోన్ చేశావు, ఎందుకు నీ భార్య, అత్తను చంపేశావు అని పోలీసులు ప్రశ్నించారు. సార్ అడ్రెస్ చెబుతాను, నేరుగా ఇక్కడికి రండి మాట్లాడుకుందామని అతని చెప్పడంతో పోలీసులు పరుగు తీశారు. ఇంట్లో భార్య, ఆమె తల్లిని రివాల్వర్ తో కాల్చి చంపేసిన వ్యక్తి పోలీసులు వెళ్లి చూడగా అక్కడ కుర్చీ ఒకటి వేసుకుని రిలాక్స్ గా కుర్చోని ఉండటంతో పోలీసులు బిత్తరపోయారు. భార్య, అత్తను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించడంతో సార్... ఎందుకు మీరు బలవంతంగా పట్టుకుంటారు, నేను పారిపోయేవాడిని అయితే మీకు ఫోన్ చేసి ఎందుకు పిలిపిస్తాను అని చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Illegal affair: ఒకే ఆంటీతో ఫ్రెండ్స్ వన్స్ మోర్, బర్త్ డే పార్టీలో నేరుజారి ?, కట్ చేసి రోడ్డు మీద !Illegal affair: ఒకే ఆంటీతో ఫ్రెండ్స్ వన్స్ మోర్, బర్త్ డే పార్టీలో నేరుజారి ?, కట్ చేసి రోడ్డు మీద !

పెద్దలు జరిపించిన లవ్ మ్యారేజ్

పెద్దలు జరిపించిన లవ్ మ్యారేజ్

గుజరాత్ లోని ద్వారకాలో నివాసం ఉంటున్న మహేష్ సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసి వాటిని ఇతరులకు విక్రయిస్తూ డబ్బు సంపాధిస్తున్నాడు. వ్యాపారంలో డబ్బులు బాగా సంపాధిస్తున్న మహేష్ కు నిధి (22) అనే యువతితో పరిచయం అయ్యింది. మహేష్ నిధి ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో 2020 జనవరిలో మహేష్, నిధి వివాహం చేసుకున్నారు.

ఇంట్లో అత్త పెత్తనం

ఇంట్లో అత్త పెత్తనం

భార్య నిధితో కలిసి మహేష్ కొత్తగా కాపురం పెట్టాడు. మహేష్ ఇంటిలో అతని భార్య నిధి తల్లి బీరో (55) కూడా ఉంటున్నది. ప్రతిరోజూ ఉదయం సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్ కు వెలుతున్న మహేష్ రాత్రి వ్యాపారం ముగించుకుని ఇంటికి వెలుతున్నాడు. మహేష్ బయట ఉన్న సమయంలో అతని భార్య నిధి, ఆమె తల్లీ బీరో ఇంటిలోనే ఉంటున్నారు.

సమస్యలు మొదలైనాయి

సమస్యలు మొదలైనాయి

మహేష్, నిధి దంపతుల మద్య రానురాను చిన్న విషయాల్లో గొడవలు మొదలైనాయి. చాలాసార్లు మహేష్, నిధి దంపతులు సర్దుకుని కలిసిపోయేవారు. అయితే కొంతకాలంగా మహేష్ దంపతుల గొడవల విషయంలో అతని భార్య నిధి తల్లి బీరో ఎక్కువ జోక్యం చేసుకోవడంతో పంచాయితీలు పెద్దవి అయ్యేవని సమాచారం.

వార్నింగ్ ఇచ్చినా ఓవర్ యాక్షన్ చేసిన అత్త

వార్నింగ్ ఇచ్చినా ఓవర్ యాక్షన్ చేసిన అత్త

మా విషయంలో మీరు ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని, మీ పని మీరు చూసుకుని మమ్మల్ని వదిలేయాలని మహేష్ అతని భార్య నిధి తల్లి బీరోకు చెప్పాడు. అయితే ఓవర్ యాక్షన్ చేస్తున్న బీరో నువ్వు నేను, నా కూతురు చెప్పినట్లు వినాలని, లేదంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని రెచ్చిపోయిందని తెలిసింది.

Recommended Video

గాంధీ భవన్ లో సాంప్రదాయబద్దంగా బతుకమ్మ వేడుకలు || Oneindia Telugu
 చంపేసి పోలీసులకు ఫోన్ చేసిన మహేష్

చంపేసి పోలీసులకు ఫోన్ చేసిన మహేష్


రాత్రి ఇంటిలో మహేష్, నిధి దంపతుల మద్య గొడవ ఎక్కువ అయ్యింది. ఆ సమయంలో పానకంలో పుడకలా నిధి తల్లి బీరో ఎంట్రీ ఇచ్చి రెచ్చిపోయింది. చాలా కాలం నుంచి అత్త బీరో విషయంలో ఓపికగా ఉన్న మహేష్ సహనం కోల్పోయాడు. వెంటనే అల్మారాలో ఉన్న రివాల్వర్ తీసుకున్న మహేష్ మొదట అత్త బీరోను, అడ్డు పడిన అతని భార్య నిధిని కాల్చిపారేశాడు. భార్య నిధి, అత్త బీరో మీద 8 రౌండ్లు కాల్పులు జరిపిన మహేష్ తరువాత పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి ఇద్దరిని చంపేసిన విషయం స్వయంగా చెప్పాడని ద్వారకా డిప్యూటీ పోలీసు కమీషనర్ శంకర్ చౌదరి మీడియాకు చెప్పారు. అత్తా, భార్యను ఒకేసారి కాల్చి చంపేసిన మహేష్ పోలీసులకు లొంగిపోవడం ద్వారకాలో హాట్ టాపిక్ అయ్యింది. మహేష్ కు గతంలో కూడా నేరచరిత్ర ఉందని ద్వారకా డిప్యూటీ పోలీసు కమీషనర్ శంకర్ చౌదరి అన్నారు.

English summary
Wife: A 32-year-old man allegedly shot dead his wife and mother-in-law with a pistol in Baba Haridas Nagar of Dwarka in Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X