Revenge: రెండో భర్తను వదిలేసింది, ప్యాంటులో బాంబు పెట్టుకుని వెళ్లి భార్య కౌగిలించుకున్న భర్త!
మిజోరం/ చెన్నై: దంపతుల మద్య గొడవలు జరగడంతో వారు విడిపోయారు. రెండవ భర్తతో విడిపోయిన అతని భార్య ఆమె కూతురితో కలిసి వేరుగా ఉంటున్నది. భర్త కూడా వేరుగా ఉంటున్నాడు. తనను వదిలేసి వెళ్లిపోయిన భార్య మీద పగ తీర్చుకోవాలని భర్త స్కెచ్ వేశాడు. భార్యను చంపడానికి ఇంతకు ముందు భర్త అనేక ప్రయత్నాలు చేశాడని తెలిసింది. భార్యను చంపడానికి అనేక ప్రయత్నాలు చేసిన ఆమె భర్త చివరికి ఎవ్వరూ ఊహించని స్కెచ్ వేశాడు. నేను చచ్చినా పర్వాలేదు, నా భార్య మాత్రం బతికుండకూడదని అతను డిసైడ్ అయ్యాడు. జిలెటిన్ స్టిక్స్ తో బాంబు తయారు చేసిన భర్త దానికి అతను వేసుకునే దస్తుల్లో దాచిపెట్టుకున్నాడు. భార్య ఉన్న చోటకు వెళ్లిన భర్త ఎలాగున్నావు అంటూ ప్రశ్నించాడు.
సంవత్సరం తరువాత భర్త వచ్చి పలకరించండంతో ఆమె కూడా అతనితో మాటలు కలిపింది. ఆ సమయంలో సిగరెట్ అంటించుకున్న భర్త మూడు దమ్ములు కొట్టాడు. తరువాత దుస్తుల్లోపల ఉన్న బాంబుకు సిగరెట్ తో నిప్పంటించి అంటించి వెంటనే అతని భార్యను కౌగిలించుకోవడంతో అదిపేలిపోయింది. బాంబు పేలుడుకు దంపతులు ఇద్దరూ చనిపోయారు. భార్యను చంపడానికి భర్త ఆత్మాహుతి దాడికి ప్రయత్నించిన సమయంలో సమీపంలో ఉన్న కూతురు మాత్రం ప్రాణాలతో బయటపడింది.

రెండో పెళ్లి చేసుకున్న మహిళ
మిజోరంలోని లుంగ్లీ ప్రాంతంలో రోహ్మింగ్లియానా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న తంతియాంఘ్లిమి అనే మహిళకు ఇంతకు ముందే వివాహం జరిగింది. మొదటి భర్తతో కాపురం చేసిన తంతియాంఘ్లిమికి ఓ కుమార్తె ఉంది. మొదటి భర్తను రామ్ రామ్ చెప్పేసిన తంతియాంఘ్లిమి తరువాత రోహ్మింగ్లియాను రెండో పెళ్లి చేసుకుంది.

రెండో భర్తకు గుడ్ బాయ్ చెప్పేసింది
రోహ్మింగ్లియానా, తంతియాంఘ్లిమి మద్య రానురాను గొడవలు అయ్యాయి. సంవత్సరం క్రితం దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. రోహ్మింగ్లియానా, తంతియాంఘ్లిమి దంపతుల మద్య గొడవలు రానురాను పెద్దవి కావడంతో వారు విడిపోయారు. రెండవ భర్త రోహ్మిగ్లియానాతో విడిపోయిన అతని భార్య తంతియాంఘ్లిమి ఆమె కూతురితో కలిసి లుంగ్లీలో వేరుగా నివాసం ఉంటున్నది. భర్త కూడా వేరుగా ఉంటున్నాడు.

భార్యను చంపేయాలని స్కెచ్
తనను వదిలేసి వెళ్లిపోయిన భార్య తంతియాంఘ్లిమి మీద పగ తీర్చుకోవాలని ఆమె రెండో భర్త రోహ్మింఘ్లియానా స్కెచ్ వేశాడు. భార్య తంతియాంఘ్లిమిని చంపడానికి ఇంతకు ముందు ఆమె రెండో భర్త రోహ్మింఘ్లియానా అనేక ప్రయత్నాలు చేశాడని తెలిసింది. భార్యను చంపడానికి అనేక ప్రయత్నాలు చేసిన ఆమె భర్త రోహ్మింఘ్లియానా చివరికి ఎవ్వరూ ఊహించని స్కెచ్ వేశాడు.

బాంబు తయారు చేసిన రెండో మొగుడు
నేను చచ్చినా పర్వాలేదు, నా భార్య తంతియాంఘ్లిమిని మాత్రం బతికుండకూడదని అతను డిసైడ్ అయ్యాడు. జిలెటిన్ స్టిక్స్ తో బాంబు తయారు చేసిన రోహ్మింఘ్లియానా దానిని అతను వేసుకునే దస్తుల్లో దాచిపెట్టుకున్నాడు. మంగళవారం మద్యాహ్నం 12. 45 గంటల సమయంలో భార్య తంతియాంఘ్లిమిని ఉన్న చోటకు వెళ్లిన రోహ్మింఘ్లియానా ఎలాగున్నావు అంటూ ప్రశ్నించాడు. సంవత్సరం తరువాత భర్త రోహ్మింఘ్లియానా వచ్చి పలకరించండంతో ఆమె కూడా అతనితో మాటలు కలిపింది.

పేలిపోయిన దంపతులు
ఆ సమయంలో సిగరెట్ అంటించుకున్న రోహ్మింఘ్లియానా హ్యాపీగా మూడు దమ్ములు కొట్టాడు. తరువాత దుస్తుల్లోపల ఉన్న బాంబుకు సిగరెట్ తో నిప్పంటించి అంటించి రోహ్మింఘ్లియానా వెంటనే అతని భార్య తంతియాంఘ్లిమిని కౌగిలించుకోవడంతో అదిపేలిపోయింది. బాంబు పేలుడుకు రోహ్మింగ్లియానా, తంతియాంఘ్లిమి దంపతులు ఇద్దరూ చనిపోయారని ఓ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది.

బతికిపోయిన కూతురు
భార్య తంతియాంఘ్లిమిని చంపడానికి ఆమె రెండో భర్త రోహ్మింఘ్లియానా ఆత్మాహుతి దాడికి ప్రయత్నించిన సమయంలో సమీపంలో ఉన్న వారి కూతురు మాత్రం ప్రాణాలతో బయటపడింది. భార్యను బాంబులతో పేల్చేసి అతను ఆత్మహత్య చేసుకోవడం మిజోరంలో కలకలం రేపింది. గతంలో కూడా భార్యను చంపడానికి రోహ్మింఘ్లియానా అనేక ప్రయత్నాలు చేశాడని బాధితురాలి కూతురు పోలీసులకు చెప్పిందని స్థానిక మీడియా తెలిపింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications