పెళ్లయ్యాక భర్త గురించి షాకింగ్ నిజం: అంతకుముందే అతనో 'గే'తో..

తనతో పెళ్లికి ముందే తన భర్తకు ఓ 'గే'తో వివాహం జరిగిందని థానేకి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ముంబై: తనతో పెళ్లికి ముందే తన భర్తకు ఓ 'గే'తో వివాహం జరిగిందని ముంబైలోని థానేకి చెందిన ఒక మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆ విషయం దాచిపెట్టి తనను పెళ్లి చేసుకున్నాడని, తీరా నిజం తెలిసి నిలదీస్తే తనను వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.

పోలీసుల కథనం ప్రకారం.. కళ్యాణ్ ప్రాంతంలోని బిర్లా కాలేజీ సమీపంలో నివసించే ఓ వివాహిత(30) శనివారం ఖడక్ పడ పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి విషయంలో తన భర్త తనను మోసం చేశాడని ఆరోపిస్తూ.. ఒక 'గే'తో అతనికి వివాహం జరిగిన ఫోటోలను చూపించింది.

ఆమె చూపించిన ఫోటోలు ఫిబ్రవరి01,2015లో ముంబై మిర్రర్ పత్రికలో వచ్చినట్లుగా పోలీసులు కూడా గుర్తించారు. ఫోటోలు, బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్త మిలింద్ సాల్వెపై మోసం, గృహ హింస కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని దాచిపెట్టి తన జీవితాన్ని నాశనం చేశారని భర్త తల్లిదండ్రులపై కూడా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో.. వారిపై కూడా కేసు నమోదైంది.

WIFE OF MAN WHO MARRIED GAY PARTNER FILES POLICE COMPLAINT

కాగా, 2015 నవంబర్ నెలలో మిలింద్ తో బాధితురాలికి వివాహం జరిగిందని, కానీ అంతకుముందే ఫిబ్రవరి నెలలో అతనికి వైభవ్ అనే ఒక 'గే'తో పెళ్లి కూడా అయిందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరికి ఎనిమిది నెలల పాప కూడా ఉండటం గమనార్హం.

తన భర్త ఒక గేను వివాహం చేసుకున్నాడని తెలియగానే ఆమె అతన్ని నిలదీసింది. అయితే అతను తిరిగి ఆమెనే వేధించడంతో ఇక చేసేదేమి లేక పాపను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉందని క్రైమ్ ఇన్‌స్పెక్టర్ జాదవ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+