Wife: భర్త, అత్తకు కుష్కాలో నిద్రమాత్రలు కలిపి పెట్టిన కిలాడీ కోడలు, నగలతో ప్రియుడితో జంప్ !

లక్నో/ఉత్తరప్రదేశ్: కుటుంబ సభ్యులు చూపించిన యువకుడిని పెళ్లి చేసుకోవడానికి యువతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెళ్లి చేసుకున్న యువతి ఆమె భర్తతో సంవత్సరం పాటు సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు ఓ కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తరువాత భార్య నిత్యం ఫోన్ లో మరో వ్యక్తితో మాట్లాడుతోంది. ఈ విషయం గమనించిన అత్త నీ భార్య గంటలు గంటలు ఎవరితోనే ఫోన్ లో మాట్లాడుతోందని కొడుక్కి చెప్పింది. నువ్వు ఫోన్ లో బయటి వ్యక్తులతో మాట్లాడకూడదని భర్త అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో గొడవలు జరుగుతున్నాయి. రాత్రి మసాలా కూరలు, కుష్కా చేసిన భార్య అందులో మత్తుమాత్రలు కలిపి భర్తకు, అత్తకు పెట్టింది. మసాలా కూరల్లో మత్తు మాత్రలు కలపడంతో గుర్తించలేని భర్త, అత్తా కడుపునిండా భోజనం చేసి నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసిన భర్త, అతని తల్లి షాక్ అయ్యారు. ఇల్లు మొత్తం లూటీ చేసిన భార్య ఆమె ప్రియుడితో జెండా ఎత్తేసిందని తెలుసుకున్న భర్త లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించాడు.

 పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయిన పెద్దలు

పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయిన పెద్దలు

ఉత్తరప్రదేశ్ లోని హావుర్ గముర్నేశ్వర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రష్మీ (పేరు మార్చడం జరిగింది) అనే యువతికి ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోి సర్దాన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడితో పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు.

 హ్యాపీగా పెళ్లి చేసుకున్న కిలాడీ లేడి

హ్యాపీగా పెళ్లి చేసుకున్న కిలాడీ లేడి

కుటుంబ సభ్యులు చూపించిన రాకేష్ ను పెళ్లి చేసుకుంటానని రష్మీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2020లో రాకేష్ ను పెళ్లి చేసుకున్న రష్మీ ఆమె భర్తతో సంవత్సరం పాటు సంతోషంగా కాపురం చేసింది. రాకేష్, రష్మీ దంపతులకు 11 నెలల క్రితం కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తరువాత రష్మీలో చాలా మార్పులు వచ్చాయి.

 గంటలు గంటలు ప్రియుడితో మాట్లాడింది

గంటలు గంటలు ప్రియుడితో మాట్లాడింది

నిత్యం ఫోన్ లో మరో వ్యక్తితో మాట్లాడుతోంది. ఈ విషయం గమనించిన రష్మీ అత్త నీ భార్య గంటలు గంటలు ఎవరితోనే ఫోన్ లో మాట్లాడుతోందని కొడుకు రాకేష్ కు చెప్పింది. నువ్వు ఫోన్ లో బయటి వ్యక్తులతో మాట్లాడకూడదని రాకేష్ అతని భార్య రష్మీ దగ్గర అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

 భర్త, అత్తకు కుష్కాలో మత్తుమందు పెట్టింది

భర్త, అత్తకు కుష్కాలో మత్తుమందు పెట్టింది

రాత్రి మసాలా కూరలు, కుష్కా చేసిన రష్మీ అందులో మత్తుమాత్రలు కలిపి భర్త రాకేష్ కు, ఆమె అత్తకు పెట్టింది. మసాలా కూరల్లో మత్తు మాత్రలు కలపడంతో గుర్తించలేని రాకేష్, రష్మీ అత్త కడుపునిండా భోజనం చేసి నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసిన రాకేష్, అతని తల్లి షాక్ అయ్యారు.

 ప్రియుడితో కిలాడీ కోడలు ఎస్కేప్

ప్రియుడితో కిలాడీ కోడలు ఎస్కేప్

ఇంట్లో బంగారు నగలు, నగదు లూటీ చేసిన రష్మీ ఆమె ప్రియుడితో జెండా ఎత్తేసిందని తెలుసుకుని లబోదిబో అన్నాడు. నా భార్య రష్మీ బంగారు నగలు చోరీ చేసి ప్రియుడితో పారిపోయిందని రాకేష్ పోలీసులను ఆశ్రయించాడు. భర్త, అత్తకు నిద్రమాత్రలు కలిపిన భోజనం పెట్టిన వివాహిత మహిళ ఆమె ప్రియుడితో పారిపోవడం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+